Messi Robbed In paris Hotel: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్, ప్రపంచ సంపన్న క్రీడాకారుల్లో ఒకడైన లియోనెల్ మెస్సీకి పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అతను బస చేస్త్నున హోటల్ గదిలో దొంగలు పడి విలువైన ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. ఇటీవలే బార్సిలోనా క్లబ్‌ను వీడి పారిస్ సెయింట్ జెర్మేన్(పీఎస్‌జీ) క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మెస్సీ.. గత కొంత కాలంగా భార్య, ముగ్గురు పిల్లలతో కలసి పారిస్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంటున్నాడు.
పారిస్‌లో తన స్థిర నివాసానికి మరమ్మత్తులు చేస్తుండడంతో మెస్సీ ఇక్కడి నుంచే మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్తున్నాడు. ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా బుధవారం మాంచెస్టర్ సిటీతో మ్యాచ్ అనంతరం తిరిగి హోటల్ గదికి వెళ్లిన మెస్సీ.. తన సూట్‌లో దొంగతనం జరిగిన విషయాన్నిగుర్తించాడు. బెడ్‌రూమ్ లాకర్‌లో ఉన్న 40వేల డాలర్ల విలువైన నగలతో పాటు 15 వేల డాలర్ల నగదు అపహరణకు గురైనట్లు మెస్సీ హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.
ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పటిష్ట భద్రత ఉండే స్టార్ హోటల్లో దొంగతనం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం.. పారిస్‌లోని అత్యంత ఖరీదైన హోటల్‌లలో ఒకటైన 'లె రాయల్ మాన్సీయా'లోని నాలుగు గదుల సూట్ రూమ్‌లో మెస్సీ తాత్కాలికంగా బస చేస్తున్నాడు. ఈ సూట్‌కు అతను రోజుకు 23వేల డాలర్ల అద్దె చెల్లిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ అద్భుతమైన గోల్ చేసి జట్టును గెలిపించాడు. పీఎస్‌జీ తరఫున ఇది మెస్సీకి తొలి గోల్.
చదవండి: చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..!
Comments
Please login to add a commentAdd a comment