
లండన్ : ఓ అగంతకుడు జరిపిన కత్తిపోట్లకు అయిదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇగ్లాండ్‌లోని మాంచెస్టర్ నడిబొడ్డున ఉన్న అర్ండాలే షాపింగ్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై తీవ్రవాద నిరోధక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు శుక్రవారం తెలిపారు. దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. కొందరు కత్తి పట్టుకొని అనేక మందిపై దాడికి వచ్చారని, అందులో ఒకతను తన షాప్‌లోకి వచ్చి అయిదుగురిపై దాడికి పాల్పడ్డాడని ప్రత్యేక్ష సాక్షి అయిన దుకాణం యాజమాని తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండగా, తీవ్ర గాయాలతో మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటికీ కత్తిపోట్లు జరిపింది ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. కాగా 40 ఏళ్ళ ఓ వ్యక్తిని దాడి పాల్పడినట్లు అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment