Stabbings
-
పెసర్లంక, దోనేపూడి తిరునాళ్ల రక్తసిక్తం
కొల్లూరు(వేమూరు): గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక, దోనేపూడి గ్రామాల్లో ఆదివారం రాత్రి జరిగిన తిరునాళ్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాత కక్షల నేపథ్యంలో చిన్న వివాదం ముదిరి కత్తి పోట్లు, కర్రలతో దాడులకు దారితీసింది. ఇరు వర్గాల్లో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పెసర్లంకలో జరుగుతున్న తిరునాళ్లలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని.. బైక్ తగిలిందనే కారణంతో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, ఇటుక రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు వర్గాలకూ చెందిన 10 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. అందరికీ తలలు పగలడంతో 108 వాహనాల్లో తెనాలి వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న గళ్లా సాంబశివరావును గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు రెండు వర్గాలకూ చెందిన మొత్తం 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దోనేపూడిలో కత్తులతో దాడి.. ఇదిలా ఉండగా దోనేపూడి తిరునాళ్లలోనూ ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పాత కక్షల నేపథ్యంలో కొల్లూరుకు చెందిన యువకుల మధ్య జరిగిన గొడవ కత్తి పోట్లకు దారితీసింది. కనపాల ప్రశాంత్, కనపాల చందు, చొప్పర శరత్‌కుమార్‌లపై చొప్పర జయచంద్ర, చొప్పర సుధాకర్‌లు కత్తితో దాడి చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. గాయపడిన ముగ్గురినీ తెనాలి, గుంటూరుల్లోని ఆస్పత్రులకు తరలించారు. కొల్లూరు ఎస్ఐ ఉజ్వల్‌కుమార్ రెండు కేసులనూ దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్‌ను పొడిచిన కరోనా రోగి బంధువులు
సాక్షి, ముంబై: కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో డాక్టరే కళ్లేదుట కనిపించే దేవుళ్లలా మారారు. ప్రాణాలకు తెగించి 24 గంటలు కష్టపడి సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ వారి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని లాతూరులో కరోనా రోగి బంధవులు డాక్టర్‌పై దాడి చేసి అతనిని కత్తితో పొడిచారు. కరోనా సోకిన ఒక వృద్ధ మహిళను లాతూర్‌లోని ఆల్ఫా సూపర్ స్పెషలిటీ హాస్పటల్లో చేర్పించారు. ఆమె వయసు రీత్యా కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. అయినా చికిత్స అందించాలని రోగి తరుపు బంధువులు అభ్యర్థించారు. కొన్ని రోజుల తరువాత ఆ మహిళ చనిపోయింది. ఆసుపత్రిలో గొడవ చేసిన రోగి బంధువులు దినేష్ వర్మ అనే డాక్టర్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన ఛాతికి, గొంతుకు, చేతికి గాయాలయ్యాయి. ఆయనను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మెడికల్ ఆసోసియేషన్ సీరియస్‌గా తీసుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆదేశించింది. చదవండి: వైద్యురాలిపై ఉమ్మివేసిన కరోనా పేషెంట్లు -
వైరల్: తల మీద కత్తి, ఒంటి నిండా రక్తం
న్యూయార్క్: తల మీద పొడిచిన కత్తితో ఓ వ్యక్తి రోడ్లపై కనిపించడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంగళవారం న్యూయార్క్‌లో ఓ మహిళ పర్సును కొందరు దుండగులు లాక్కునేందుకు ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో సదరు మహిళపై వారు చేయి చేసుకోగా ముప్పై ఆరేళ్ల యువకుడు ఆమెను కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో దుండగులు అతడిపై కత్తితో దాడి చేశారు. (తెల్ల చర్మం... నల్ల మచ్చలు..) తల, మొండెంపై కత్తిపోట్లతో విరుచుకుపడటంతో అతని బట్టలు రక్తసిక్తమయ్యాయి. వీడియోలో అతని రెండు చేతులు రక్తంలో తడిసినట్లు ఉండగా, కుడి చేతికి కట్టు కట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతను తనను తాను కాపాడుకునేందుకు రోడ్ల వెంట నడుస్తూ అంబులెన్స్ సాయం కోరాడు. తీవ్రంగా గాయపడిన అతడిని హార్లేమ్లోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సదరు మహిళ కూడా కత్తిపోట్లకు గురవగా ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. (నిరసనకారుడిని ఒక్కసారిగా తోసేయడంతో..) -
మాంచెస్టర్‌లో కత్తిపోట్లు.. ఐదుగురికి గాయాలు
లండన్ : ఓ అగంతకుడు జరిపిన కత్తిపోట్లకు అయిదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇగ్లాండ్‌లోని మాంచెస్టర్ నడిబొడ్డున ఉన్న అర్ండాలే షాపింగ్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై తీవ్రవాద నిరోధక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు శుక్రవారం తెలిపారు. దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. కొందరు కత్తి పట్టుకొని అనేక మందిపై దాడికి వచ్చారని, అందులో ఒకతను తన షాప్‌లోకి వచ్చి అయిదుగురిపై దాడికి పాల్పడ్డాడని ప్రత్యేక్ష సాక్షి అయిన దుకాణం యాజమాని తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉండగా, తీవ్ర గాయాలతో మరో వ్యక్తి చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటికీ కత్తిపోట్లు జరిపింది ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. కాగా 40 ఏళ్ళ ఓ వ్యక్తిని దాడి పాల్పడినట్లు అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
చిన్నారిపై కన్నతల్లి కత్తిపోట్లు..
పోర్ట్‌ల్యాండ్ : అర్థరాత్రి ఓ ఆరేళ్ల బాలుడు ఏడుస్తూ రక్తపు మరకలతో పరుగెత్తుకొచ్చి పక్కింటి వాళ్ల డోర్ నెట్టాడు. వారు ఆ బాలున్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అతని ఒంటి నిండా రక్తపు మరకలే. బిక్కుబిక్కు మంటూ ఏడుస్తున్న ఆ పసివాణ్ని చూసి ఏమైందని అడుగేలోపే ఆ బాలుడు ‘మా అమ్మ నన్ను చంపేస్తుంది. కాపాడండి’ అంటూ ఏడుస్తూ చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాలుడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఇదంతా ఏదో క్రైమ్ స్టోరీలా ఉంది కదా! కానీ ఇది వాస్తవం. ఈ విచారకర ఘటన గత శనివారం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిమోరియా విల్లగోమెజ్(34)అనే మహిళ పోర్ట్‌ల్యాండ్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. గత శనివారం ఆమె తన ఆరేళ్ల బాలుడిపై కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేసింది. ఆ బాలుడు తప్పించుకొని పొరుగు వాళ్లకి అసలు విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటన స్థలానికి వచ్చారు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని స్థానిక ఆసుపత్రి తరలించారు. అనంతరం పోలీసులు బాలుని ఇంటికి వెళ్లారు. తలుపులు మూసి ఉండడంతో కాలింగ్ బెల్ నొక్కారు. కానీ ఎవరూ స్పందించ లేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. గది గోడలకు మొత్తం రక్తపు మరకలే. బెడ్ రూమ్‌లోకి వెళ్లి చూడక అక్కడే రక్తపు మరకలతో నిమోరియా ఉంది. బెడ్‌పై 14 నెలల బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడిపై కూడా రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బాలుడిపై ఎందుకు కత్తిగాట్లు పెట్టావ్ అని ఆమెను ప్రశ్నించగా ‘దానికి అతను అర్హుడే’ అనే సమాధానం చెప్తోంది. ఆమె సమాధానంతో కంగుతిన్న పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా కత్తిపోట్లకు గురైన బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
అమ్మాయి కోసం వివాదం: ముగ్గురికి కత్తిపోట్లు
చాంద్రాయణగుట్ట: వివాహ విందులో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ముగ్గురి కత్తిపోట్లకు దారి తీసింది. ఛత్రినాక పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్రార్, ఇర్ఫాన్ సమీప బంధువులు. ఇద్దరూ తమ స్నేహితులతో కలిసి ఈనెల 4న బండ్లగూడలో జరిగిన బంధువుల పెళ్లి విందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక అమ్మాయి విషయమై అబ్రార్, ఇర్ఫాన్ గొడవ పడ్డారు. పెద్దలు ఇద్దరినీ సముదాయించి పంపేశారు. ఇదిలా ఉండగా... రాజీ కుదుర్చుకుందామని అబ్రార్ ఆరుగురితో, ఇర్ఫాన్ ఐదుగురితో మంగళవారం రాత్రి జంగమ్మెట్‌లోని బుడగ జంగాల బస్తీకి వచ్చారు. ఆ సమయంలో మాటా మాటా పెరగడంతో ఇర్ఫాన్కత్తితో అబ్రార్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఇర్ఫాన్‌తో పాటు వచ్చిన ఫయీం, నదీంలపై అబ్రార్ బృందం కత్తితో దాడి చేసింది. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.