
సాక్షి, ముంబై: కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో డాక్టరే కళ్లేదుట కనిపించే దేవుళ్లలా మారారు. ప్రాణాలకు తెగించి 24 గంటలు కష్టపడి సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ వారి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని లాతూరులో కరోనా రోగి బంధవులు డాక్టర్‌పై దాడి చేసి అతనిని కత్తితో పొడిచారు. కరోనా సోకిన ఒక వృద్ధ మహిళను లాతూర్‌లోని ఆల్ఫా సూపర్ స్పెషలిటీ హాస్పటల్‌లో చేర్పించారు. ఆమె వయసు రీత్యా కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. అయినా చికిత్స అందించాలని రోగి తరుపు బంధువులు అభ్యర్థించారు. కొన్ని రోజుల తరువాత ఆ మహిళ చనిపోయింది. ఆసుపత్రిలో గొడవ చేసిన రోగి బంధువులు దినేష్ వర్మ అనే డాక్టర్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన ఛాతికి, గొంతుకు, చేతికి గాయాలయ్యాయి. ఆయనను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని మెడికల్ ఆసోసియేషన్ సీరియస్‌గా తీసుకుంది. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment