చిన్నారిపై కన్నతల్లి కత్తిపోట్లు.. | A Mother Repeatedly Stabbed Her Six Year Old Son | Sakshi
Sakshi News home page

బాలుడిపై కన్నతల్లి కత్తిపోట్లు.. కారణం తెలిస్తే షాకే

Published Thu, May 31 2018 7:32 PM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM

A Mother Repeatedly Stabbed Her Six Year Old Son - Sakshi

నిమోరియా విల్లగోమెజ్‌, బాలుడి తల్లి

పోర్ట్‌ల్యాండ్‌ : అర్థరాత్రి ఓ ఆరేళ్ల బాలుడు ఏడుస్తూ రక్తపు మరకలతో పరుగెత్తుకొచ్చి పక్కింటి వాళ్ల డోర్‌ నెట్టాడు. వారు ఆ బాలున్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అతని ఒంటి నిండా రక్తపు మరకలే. బిక్కుబిక్కు మంటూ ఏడుస్తున్న ఆ పసివాణ్ని చూసి ఏమైందని అడుగేలోపే ఆ బాలుడు ‘మా అమ్మ నన్ను చంపేస్తుంది. కాపాడండి’  అంటూ ఏడుస్తూ చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాలుడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఇదంతా ఏదో క్రైమ్‌ స్టోరీలా ఉంది కదా! కానీ ఇది వాస్తవం. 

ఈ విచారకర ఘటన గత శనివారం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిమోరియా విల్లగోమెజ్‌(34)అనే మహిళ పోర్ట్‌ల్యాండ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. గత శనివారం ఆమె తన ఆరేళ్ల బాలుడిపై కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేసింది. ఆ బాలుడు తప్పించుకొని పొరుగు వాళ్లకి అసలు విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటన స్థలానికి వచ్చారు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని స్థానిక ఆసుపత్రి తరలించారు.

అనంతరం పోలీసులు బాలుని ఇంటికి వెళ్లారు. తలుపులు మూసి ఉండడంతో కాలింగ్‌ బెల్‌ నొక్కారు. కానీ ఎవరూ స్పందించ లేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. గది గోడలకు మొత్తం రక్తపు మరకలే. బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి చూడక అక్కడే రక్తపు మరకలతో నిమోరియా ఉంది. బెడ్‌పై 14 నెలల బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడిపై కూడా రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. 

బాలుడిపై ఎందుకు కత్తిగాట్లు పెట్టావ్‌ అని ఆమెను ప్రశ్నించగా ‘దానికి అతను అర్హుడే’  అనే సమాధానం చెప్తోంది. ఆమె సమాధానంతో కంగుతిన్న పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా కత్తిపోట్లకు గురైన బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement