Portland
-
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా TDF బతుకమ్మ సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. క్వాటామా ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున ప్రవాసులు పాల్గొని విజయవంతం చేసారు.తెలుగుదనం ఉట్టి పడేలా.. మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. ఈ సంబరాల్లో భాగంగా దుర్గా పూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకొని అలయ్ భలాయ్ చేసుకున్నారు. బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు.ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతం అవటానికి కృషి చేసిన స్పానర్స్, పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వాలంటీర్స్, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ మెట్రో ఇండియన్ కమ్యూనిటికి, సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. TDFసంస్థ స్థాపించి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, శుభాకాంక్షలు తెలిపారు. -
5000 మీటర్లలో గుల్వీర్ కొత్త జాతీయ రికార్డు
భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ ట్రాక్ ఫెస్టివల్ హై పెర్ఫార్మెన్స్ మీట్లో గుల్వీర్ ఈ ఘనత సాధించాడు. ఈ మీట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల గుల్వీర్ 5000 మీటర్లను 13 నిమిషాల 18.92 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అవినాశ్ సాబ్లే (13ని:19.30 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం 10,000 మీటర్ల లోనూ జాతీయ రికార్డు గుల్వీర్ పేరిటే ఉంది. -
Alaska Airlines Boeing 737-9 Max: గాల్లో గజగజ
అది అమెరికాలో ఓరెగాన్‌లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్‌ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు. నరకం అంచులకు వెళ్లొచ్చాం... ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్‌ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఆ విమానాల నిలిపివేత... ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది. – పోర్ట్‌ల్యాండ్ (అమెరికా) తొలిసారి కాదు.. బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్‌లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. -
విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. వీడియో వైరల్
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9(1282) విమానం పోర్టులాండ్ నుంచి ఒంటారియాకు(కెనడా) గురువారం సాయంత్రం బయలు దేరింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొంత సమయానికే మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలెట్.. విమానాన్ని తిరిగి పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. 🚨#BREAKING: Alaska Airlines Forced to Make an Emergency Landing After Large Aircraft Window Blows Out Mid-Air ⁰⁰📌#Portland | #Oregon ⁰A Forced emergency landing was made of Alaska Airlines Flight 1282 at Portland International Airport on Friday night. The flight, traveling… pic.twitter.com/nt0FwmPALE — R A W S A L E R T S (@rawsalerts) January 6, 2024 విమానం ఆకాశంలో ఉండగా డోర్ ఊడిపోయి సమయం దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనతో ప్రభావితులైన ప్రయాణికులు, సిబ్బంది పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. AS1282 from Portland to Ontario, CA experienced an incident this evening soon after departure. The aircraft landed safely back at Portland International Airport with 171 guests and 6 crew members. We are investigating what happened and will share more as it becomes available. — Alaska Airlines (@AlaskaAir) January 6, 2024 ఇక ఈ సంఘటన అనంతరం అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఫ్లైట్ 1282లో గురువారం రాత్రి జరిగిన పరిణామంతో మా బోయింగ్ 737-9కు సంబంధించిన 65 విమానాలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాత్కాలికంగా నేలకు పరిమితం చేస్తున్నాం’ అని ఎయిర్లైన్సన్ సీఈవో బెన్స్ మినికుచి పేర్కొన్నారు. పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత ప్రతి విమానం తిరిగి సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. -
పోర్ట్ ల్యాండ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
రోజ్ ఫెస్టివల్..ఎటు చూసిన గూలబీ పూల గుత్తులే..!
అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో ఇటీవల ‘రోజ్ ఫెస్టివల్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూ వాడా ఎటు చూసినా గులాబీల గుత్తులతో జనాల ఊరేగింపులతో పోర్ట్లాండ్ హోరెత్తింది. భారీ వాహనాలను పూలతో అలంకరించి ఊరేగింపులు నిర్వహించారు. కొందరు గుర్రాలపై పూల అలంకరణలో కనువిందు చేశారు. ఆడా మగా, పిల్లా పెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో జనాలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏటా మే నెలాఖరు నుంచి జూన్ రెండో వారం వరకు జరిగే ఈ ఊరేగింపు పోర్ట్‌లాండ్‌కి ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ఈసారి ఈ వేడుకల్లో దాదాపు పన్నెండు లక్షల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గులాబీల ప్రదర్శన, అందాల పోటీలు, సంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. (చదవండి: ఆటిజం ఉన్నా ఐక్యూలో ఘనం! 12 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ) -
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు అత్యంత అంగరంగ వైభోవోపేతంగా జరిగాయి. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత క్వాటామా ఎలిమెంటరీ స్కూల్లో (Quatama Elemantary School)లో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ పండుగలకు అమ్మాయిలు, మహిళలు తెలుగు తనం ఉట్టి పడే విధంగా సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగు రంగుల బతుకమ్మలతో వచ్చి ఆట పాటలతో హోరెత్తించారు. దసరా వేడుకని వేదం మంత్రాలని అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజని నిర్వహిచారు. జమ్మి (బంగారయం), ఇచ్చి పుచ్చుకొని అందరు అలయ్ బలయ్ చేసికున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల వేడుకలలో పాల్గొన్న వారందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియచేశారు. బతుకమ్మ పండుగ అత్యంత ఘనంగా జరగడానికి సహకరించిన మహిళలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ వేడుకలని వైభవోపేతంగా నిర్వహించి విజయవంతం కావడంలో కృషి చేసి ముఖ్య భూమికను పోషించిన పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వలంటీర్స్ - వీరేష్, సురేష్, మధుకర్, నరేందర్, అజయ్, ప్రవీణ్ ఏ, రఘు, జయకర్, రాజ్, శ్రీపాద్, శ్రీకాంత్, వెంకట్ , అరుణ్, శ్రీని ఎం, ప్రదీప్, శ్రీని జీ, రవి, కిషన్, నవీన్, మహేష్ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ప్రశంసలు తెలియ చేశారు. -
చిన్నారితో సహా కారు దొంగతనం: చివర్లో ట్విస్ట్!
వాషింగ్టన్: కారు కనిపించగానే ఎత్తుకెళ్లిన ఓ దొంగ అందులో ఓ పసిప్రాణం ఉందని తెలియగానే వెంటనే యూటర్న్ తీసుకుని ఆ చిన్నారిని తల్లికి అప్పగించాడు. కానీ కారును మాత్రం విడిచిపెట్టలేదు. అంటే ఆ దొంగ మంచోడా? చెడ్డోడా? అసలా దొంగ ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌ల్యాండ్‌లో శనివారం నాడు ఓ మహిళ నాలుగేళ్ల కొడుకును తీసుకుని కారులో షాపుకు వెళ్లింది. కారును రన్నింగ్‌లో ఉంచి, అందులో చంటిపిల్లాడిని ఒంటరిగా వదిలేసి దుకాణంలోకి వెళ్లి పాలు, మాంసం కొనుగోలు చేసింది. (చదవండి: నేను వచ్చిన బిడ్డో సర్కారు దవాఖానకు!) ఇంతలో అక్కడే ఉన్న ఓ దొంగ కారెక్కి ఎంచక్కా ఎత్తుకెళ్లిపోయాడు. అయితే కొంత దూరం వెళ్లాక కారులో పసిపిల్లాడు ఉన్నాడని గుర్తించి యూటర్న్ తీసుకుని తిరిగి అదే షాపుకు దగ్గరకు వెళ్లాడు. బుడ్డోడిని అలా వదిలేసి పోతావా? అని సదరు మహిళకు ఆవేశంతో క్లాస్ పీకాడు. అంతే కాదు, నిర్లక్క్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించి చిన్నోడిని ఆమె చేతుల్లో పెట్టాడు. ఇతడు మంచి దొంగే అనుకునేలోపే తిరిగి అదే కారులో ఉడాయించాడు. అయితే చంటోడిని తల్లికి అప్పజెప్పినందుకు పోలీసులు అతడిని నిజాయితీ గల దొంగగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే తిరిగా ఆ కారును గుర్తించి మహిళకు అప్పజెప్పగా ప్రస్తుతం దొంగ జాడ కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: వైరల్: గుడి దగ్గరకు రాగానే ఫోన్ చేయండి!) -
పోర్ట్‌లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ పోర్ట్లాండ్ సిటీలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) పోర్ట్లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చ్యువల్ బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కోవిడ్-19 నేపథ్యంలో బతుకమ్మ వేడుకలకు దూరం కాకూడదని టీడీఎఫ్ బృందం వినూత్నంగా జూమ్ మీటింగ్ ద్వారా కమ్యూనిటీని కనెక్ట్ చేసి వేడుకల్ని నిర్వహించింది. పోర్ట్లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల తన నివాసం నుంచి జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకల్ని ప్రారంభించారు. అక్టోబర్ 24న శనివారం జరిగిన ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుంచి 70 కుటుంబాలు (దాదాపు 250మంది), జూమ్ యాప్ ద్వారా పాల్గొని వేడుకల్ని విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు, మహిళలు తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగురంగుల బతుకమ్మలు పేర్చి ఆట పాటలతో హోరెత్తించారు. బతుకమ్మ నిమజ్జనం ఎవరి ఇళ్లల్లో వారు చేసుకుని గౌరమ్మ ప్రసాదం ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోర్ట్లాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా పోర్ట్లాండ్ చాప్టర్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. బతుకమ్మ పండుగని వైభవంగా జరగడానికి సాయం చేసి మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బతుకమ్మ విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ వేడుకల్ని మొదటిసారి ప్రత్యేక పరిస్థితుల్లో జూమ్ ద్వారా వైభవంగా నిర్వహించి విజయవంతం కావడానికి కృషి చేసిన టీమ్ సభ్యులు వీరేష్ బుక్క, నిరంజన్ కూర, సురేష్ దొంతుల, కొండల్ రెడ్డి పూర్మ, ప్రవీణ్ అన్నవజ్జల, నరేందర్ చీటి, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, రాజ్ అందోల్, అజయ్ అన్నమనేని, రఘు శ్యామతో పాటు ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు. వేడుకలను స్పాన్సర్ చేసినవారికి శ్రీని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
బ్రిటన్‌లో అరుదైన చేప లభ్యం
లండన్ : యూకేలోని పోర్ట్ ల్యాండ్ హార్బర్ సమీపంలో "మోలా-మోలా" అని పిలిచే అరుదైన అతిపెద్ద సముద్రపు చేప దొరికింది. డోర్సెట్ తీరంలో సజీవంగా ఉన్న అత్యంత అరుదైన అతిపెద్ద బోనీ ఫిష్‌ని గుర్తించారు. సాధారణంగా ఉష్ణమండల జలాల్లో ఈ చేపలు సంచరిస్తాయి. ఈ చేపలు 2.3 టన్నుల బరువు, 10 అడుగుల పొడవు ఉంటాయి. మరియన్ కన్జర్వేషన్ సొసైటీ ట్విట్టర్లో మోలా మోలా ఫోటోను పోస్ట్ చేసి, గ్రహం మీద సజీవంగా ఉన్న అతిపెద్ద బోనీ ఫిష్, జెల్లీ ఫిష్‌లను తినడం కోసం వేసవికాలంలో యూకేకి వచ్చిందని కామెంట్ పెట్టారు. మోలా మోలా ఫోటో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. ఈ చేపను లిజ్ హేమ్స్లీ చిత్రీకరించారు. Wow! An Ocean Sunfish (or Mola Mola) spotted off #Portland Harbour yesterday afternoon. #Sunfish are the largest bony fish on the planet and visit UK seas during the summer months to eat jellyfish. Have you ever seen one? Thanks to Liz Hemsley for sending us the picture 📸 pic.twitter.com/HunVjlLpXO — Marine Conservation Society (@mcsuk) June 15, 2020 -
కుక్కతో లైవ్ టెలికాస్ట్ చేసిన జర్నలిస్ట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ అనేక దేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. అందులో భాగంగా ప్రజలెవరూ బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. మరోవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. అయితే ఇంట్లో నుంచే పనులు చేయడం అందరికీ అంత సులువు కాదని నిరూపించిందీ సంఘటన. మైక్ స్లిఫర్ అనే జర్నలిస్ట్ ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నాడు. వాతావరణ స్థితిగతుల గురించి చెప్తూ ఉండగా.. అతని కుక్క పిల్ల వచ్చి పక్కనే నిలబడింది. అతను వార్తలు చెప్పడం పూర్తవగానే కెమెరా వైపు సంతోషంగా చూసింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను మైక్ ట్విటర్లో షేర్ చేశాడు. (ప్లాన్ అదిరింది కానీ, బెడిసి కొట్టింది!) దీంతో నెటిజన్లు ఆ వీడియోకు ఫిదా అయిపోయారు. కుక్కపిల్ల అచ్చంగా నవ్వినట్లే ఉందని అబ్బురపడుతున్నారు. ఈ క్రమంలో తన కుక్కపిల్లతో కలిసి చేసిన వార్తలకు ఎంత రేటింగ్ ఇస్తారని ట్వీట్ చేయగా పదికి పదిచ్చినా తక్కువే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే జర్నలిస్టులకు ఇలాంటి సమస్యలు ఎదురవడం కొత్తేమీ కాదు. జర్నలిస్ట్ లైవ్ రికార్డింగ్ చేస్తుండగా అతని తండ్రి చొక్కా లేకుండా తిరగడం, ఓ మహిళా జర్నలిస్టు వార్తలు చెప్తున్న సమయంలో పిల్లలు పదేపదే అంతరాయం కలిగించడం వంటి ఎన్నో నవ్వు తెప్పించే సంఘటను ఇదివరకే చూశాం. (క్లోరోక్విన్.. మాకూ ఇవ్వండి) -
జంతువుల్లోనూ నపుంసక జంతువులు
వాషింగ్టన్ : సాధారణంగా మనుషుల్లో ఆడ, మగతో పాటు నపుంసకులు ఉంటారన్నది తెలిసిన విషయమే. కానీ జంతువుల్లోనూ నపుంసక జంతువులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా గొర్రెల జాతికి సంబంధించి 12 గొర్రెల్లో ఒకటి నపుంసకత్వాన్ని కలిగి ఉందని పోర్ట్లాండ్లోని ‘‘ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్శిటీ’’ చెందిన ప్రొఫెసర్ చార్లెస్ రోసెల్లీ పేర్కొన్నారు. గొర్రెల జెండర్ అన్నది తల్లి గర్భంలోనే నిర్ణయించబడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నపుంసక గొర్రెలు ఆడవాటితో కలవటానికి ఇష్టపడకపోవటం వల్ల వాటిని వధశాలలకు తరలించటం జరుగుతోందని చెప్పారు. దాదాపు ఎనిమిది శాతం గొర్రెలు నపుంసకత్వాన్ని కలిగి ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల కోతులు, కుక్కలు, తాబేళ్లు, సింహాలు కూడా నపుంసకత్వాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించారు. చానల్ 4ఎస్ రూపొందించిన ‘‘మై గే డాగ్ అండ్ అదర్ అనిమల్స్’’ అనే డాక్కుమెంటరీలో ఈ వివరాలను ప్రస్తావించారు. -
పోర్ట్‌లాండ్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు
పోర్ట్లాండ్ : అమెరికాలోని ఒరేగాన్స్టేట్లో టీడీఎఫ్ (తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్) పోర్ట్లాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోర్ట్లాండ్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల విఘ్నేశ్వరుడికి పూజ, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారుల, అమ్మాయిలు, మహిళలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. బతుకమ్మలను నిమజ్జనం చేసిన తరువాత దసరా పండుగను జరుపుకున్నారు. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేడుకల అనంతరం పసందైన విందులను ఆరగించారు. ఈ సందర్భంగా శ్రీని అనుమాండ్ల మాట్లాడుతూ.. వేడుకలకి వచ్చిన వారందరికి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమాలను జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికి ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించుకోవడానికి సహాయం చేసిన స్పాన్సర్స్‌కి శ్రీని కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీఎఫ్ టీమ్ మెంబర్స్ నిరంజన్ కూర, నరేందర్ చీటి, భాను పోగుల, కొండల్ రెడ్డి పుర్మ, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, రాజ్ అందోల్, శ్రీనివాస్‌రెడ్డి పగిడి, రఘు శ్యామ, సురేష్ దొంతుల, జయాకర్ రెడ్డి ఆడ్ల, సత్య సింహరాజు, వీరేష్ బుక్క, అజయ్ అన్నమనేని, వెంకట్ ఇంజమ్, హరి సూదిరెడ్డి, శ్రీని గుబ్బ, వెంకట్ గోగిరెడ్డి, ఇతర వాలెంటెర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు
పోర్ట్‌ల్యాండ్ : అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా వజభోజనాల కార్యక్రమం జరిగింది. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్రొఫెసర్ జయశంకర్‌కి చాప్టర్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వనభోజన కార్యక్రమానికి పోర్ట్‌ల్యాండ్ మెట్రో సిటీ నుంచి పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతితో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అవార్డ్స్‌ను చాప్టర్ చైర్మన్ అందించారు. అనంతరం పుడ్ కమిటీ తయారు చేసిన రుచికరమైన తెలుగు వంటకాలతో చిన్నా పెద్ద అంతా కలిసి భోజనం చేశారు. మహిళలు, పిల్లలు, యువకులు, యువదంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్ అందరికీ శ్రీని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఢీఎప్ చాప్టర్ టీం సభ్యులు నిరంజన్ కూర, నరెందర్ చీటి, రాజ్ అందోల్, కాంత్ కోడిదేటి, కొండల్‌రెడ్డి పుర్మ, మధుకర్‌రెడ్డి పురుమాండ్ల, జయాకర్ రెడ్డి ఆడ్ల, హరి సూదిరెడ్డి, సత్య సింహరాజు, ఈవెంట్ టీం సభ్యులు శ్రీనివాసరెడ్డి పగిడి, వీరేష్ బుక్క, ప్రవీణ్ యలకంటి, స్పోర్ట్స్ టోర్నమెంట్ వాలంటీర్స్ శ్రీని బొంతల, అజయ్ అన్నమనేని, వెంకట్ ఇంజమ్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారిపై కన్నతల్లి కత్తిపోట్లు..
పోర్ట్‌ల్యాండ్ : అర్థరాత్రి ఓ ఆరేళ్ల బాలుడు ఏడుస్తూ రక్తపు మరకలతో పరుగెత్తుకొచ్చి పక్కింటి వాళ్ల డోర్ నెట్టాడు. వారు ఆ బాలున్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అతని ఒంటి నిండా రక్తపు మరకలే. బిక్కుబిక్కు మంటూ ఏడుస్తున్న ఆ పసివాణ్ని చూసి ఏమైందని అడుగేలోపే ఆ బాలుడు ‘మా అమ్మ నన్ను చంపేస్తుంది. కాపాడండి’ అంటూ ఏడుస్తూ చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాలుడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఇదంతా ఏదో క్రైమ్ స్టోరీలా ఉంది కదా! కానీ ఇది వాస్తవం. ఈ విచారకర ఘటన గత శనివారం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిమోరియా విల్లగోమెజ్(34)అనే మహిళ పోర్ట్‌ల్యాండ్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. గత శనివారం ఆమె తన ఆరేళ్ల బాలుడిపై కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేసింది. ఆ బాలుడు తప్పించుకొని పొరుగు వాళ్లకి అసలు విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటన స్థలానికి వచ్చారు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని స్థానిక ఆసుపత్రి తరలించారు. అనంతరం పోలీసులు బాలుని ఇంటికి వెళ్లారు. తలుపులు మూసి ఉండడంతో కాలింగ్ బెల్ నొక్కారు. కానీ ఎవరూ స్పందించ లేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. గది గోడలకు మొత్తం రక్తపు మరకలే. బెడ్ రూమ్‌లోకి వెళ్లి చూడక అక్కడే రక్తపు మరకలతో నిమోరియా ఉంది. బెడ్‌పై 14 నెలల బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడిపై కూడా రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బాలుడిపై ఎందుకు కత్తిగాట్లు పెట్టావ్ అని ఆమెను ప్రశ్నించగా ‘దానికి అతను అర్హుడే’ అనే సమాధానం చెప్తోంది. ఆమె సమాధానంతో కంగుతిన్న పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా కత్తిపోట్లకు గురైన బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఏమోయ్.. సరదాగా పార్కుకు వెళ్దామా..
వెళ్దాం.. వెళ్దాం.. ఆ వెళ్లేదేదో.. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉన్న మిల్ ఎండ్స్ పార్కుకు వెళ్దాం.. ఆ రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్లు.. పచ్చిక చూసి.. అదే పార్కు అనుకుంటున్నారా.. కాదండీ.. ఎక్కడుందబ్బా అని దిక్కులు చూడకండి.. అదిగో సరిగ్గా రోడ్డు మధ్యన ఆ.. అదే.. అరే.. కరెక్టుగా గుర్తుపట్టేశారే.. అదిగో ఆ రోడ్డుకు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌లా కనిపిస్తున్నదే మిల్ ఎండ్స్ పార్కు! ఏమిటి.. ఈ తొక్కలో మొక్కా అని గట్టిగా అనమాకండి.. ఎందుకంటే.. మొక్కే కదా అని పీకేస్తే.. పీక తెగ్గోసే రకాలు అక్కడ.. ఎందుకంటే.. పోర్ట్‌ల్యాండ్ వాసులకు ఈ పార్కు అంటే ఎంతో ప్రీతి.. చాన్స్ దొరికినప్పుడల్లా ఇక్కడ పండగల్లాంటివి చేసేసుకుంటుంటారు. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పార్కు మా సొంతం అని కాలరెగరేస్తుంటారు. సాక్ష్యంగా గిన్నిస్ వాళ్లు ఇచ్చిన రికార్డు ప్రతిని కూడా చూపిస్తారు. అంతేనా.. ఈ పార్కు ఎలా ఏర్పడిందన్న విషయాన్ని కూడా మనకు పూసగుచ్చినట్లు వివరిస్తారు.. మరి మనం పూస గుచ్చకుండానే ఆ కథను వినేద్దామా.. అనగనగా.. కొన్నాళ్ల క్రితం.. అంటే 1940ల్లో.. ఇక్కడ కరెంటు స్తంభం పాతడానికి గొయ్యి తవ్వారు. కరెంటు స్తంభమైతే రాలేదు గానీ.. గొయ్యి మిగిలిపోయింది. దీంతో స్థానిక పత్రికలో కాలమిస్టుగా పనిచేసే డిక్ఫగాన్ అనే ఆయన ఈ గొయ్యిలో పూల మొక్క నాటాడు. వాళ్ల ఆఫీసు దీని ఎదురుగానే ఉండేది. ఆయన మిల్ ఎండ్స్ పేరిట సదరు పత్రికలో తన అనుభవాలను కథలు కథలుగా రాసేవాడు. దీన్ని ప్రపంచంలోనే అతి చిన్నపార్కుగా పేర్కొంటూ.. ఈ పార్కు దాని చుట్టూ నివసించే జనం గురించి తన కాలమ్‌లో ఊహాజనిత కథనాలు రాసేవాడు. తాను ఓ సారి ఓ దేవతను తనకో పార్కు కావాలని కోరానని.. అయితే.. దాని సైజు చెప్పకపోవడంతో ఆ దేవత తనకీ చిన్న పార్కును ప్రసాదించిందని.. ఇలా ఉండేవి అతడి కథనాలు. 1969లో ఫగాన్ చనిపోయాడు. 1976లో స్థానిక అధికార యంత్రాంగం దీన్ని సిటీ పార్కుగా ప్రకటించింది. తదనంతర కాలంలో ఈ పార్కు పేరు మీద ఉత్సవాలు కూడా జరిగాయి. కొంతమంది చిన్నచిన్న బొమ్మలతో దీన్ని అలంకరించడం.. ఒక మొక్క ఎండిపోతే.. మరొకటి నాటడం వంటివి చేసేవారు. పార్కులోని మొక్కల పేర్లు మారాయి గానీ.. అతి చిన్న పార్కుగా మిల్ ఎండ్స్ పేరు మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. కథ కంచికి.. మనం ఇంటికి.. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అదృశ్యం
వాషింగ్టన్: బంధువులను చూసేందుకు బయలుదేరిన ఓ భారతీయ కుటుంబం అదృశ్యమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన తొట్టపిల్లి సందీప్(42), తన భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచితో కలసి ఈ నెల 5(గురువారం)న హోండా పైలట్ కారులో పోర్ట్‌ల్యాండ్ నుంచి శాన్ జోస్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి బయలుదేరారు. శుక్రవారమే రావాల్సిన సందీప్ కుటుంబం ఎంతకూ రాకపోవటంతో అనుమానం వచ్చిన బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోర్ట్‌లాండ్‌లో బతుకమ్మ, దసరా సంబురాలు
సాక్షి, పోర్ట్లాండ్: అమెరికాలోని ఓరెగాన్ స్టేట్‌లోని పోర్ట్లాండ్ నగరంలో బతుకమ్మ, దసరా సంబురాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ సంబురాలను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, పోర్ట్లాండ్ చాఫ్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు పోర్ట్లాండ్ మెట్రో నగరాల నుంచి దాదాపుగా 600 మంది హాజరయ్యారు. ఈ వేడుకలను పోర్ట్లాండ్ చాఫ్టర్ చైర్మన్ అనుమాండ్ల జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ దుస్తులో మహిళలు, చిన్నారులు ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి అనుమాండ్ల బహుమతులను బహుకరించారు. అనంతరం వాలంటీర్ల సహాయంతో స్కూల్ దగ్గర్లో ఉన్న కొలనులో బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు. తదనంతరం దసరా పండుగ సందర్భంగా టీడీఎఫ్ టీం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఇచ్చి పెద్దవారితో ఆశీర్వాదం తీసుకున్నారు. చైర్మన్ అనుమాండ్ల కార్యక్రమానికి వచ్చిన వారందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ఘనంగా జరుపుకోవటానికి సహకరించిన మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.రఫెల్ టికెట్స్ గెలిచిన వారికి శ్రీని గిఫ్ట్ కార్డ్స్ బహుకరించారు. చివరగా అందరూ ఢీ జె మ్యాజిక్కి డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ పోర్ట్లాండ్ చాఫ్టర్ కమిటీ మెంబర్స్, వాలంటీర్స్ టీం సభ్యులు.. కొండల్ రెడ్డి పుర్మ, రఘుస్వామి, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, నిరంజన్ కూర, నరేందర్ చీటి, జయాకర్ రెడ్డి ఆడ్ల, శివ ఆకుతోట, సత్యసింహరాజ, ప్రవీణ్ అన్నవజ్జల, రాజ్ అందోల్, వీరేష్ బుక్కా, సురేశ్ దొంతుల, ప్రవీణ్ ఎలకంటి, అజయ్ అన్నమనేని శ్రీని బొంతల, వెంకట్ ఇంజం, శ్రీనివాస్ రెడ్డి పగిడి, కృష్ణారెడ్డి అయిలూరి, శ్రీని గుబ్బ, రామ్ పప్పుల, గణేష్ ప్రభల, వెంకట్ రెడ్డి గోగిరెడ్డి, అంజి పల్లాటి, కిరీట్ పోల, వారి కుటుంబాలకు చాఫ్టర్ చైర్మన్ శ్రీని హృదయ పూర్వక అభినందలు తెలియజేశారు. -
ఈ ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు
పోర్ట్లాండ్ : చిన్నమంటలు వ్యాపిస్తేనే వాటిని చూసి భయంతో బెంబేలెత్తిపోయి పరుగులు పెడుతుంటారు. అలాంటిది కార్చిచ్చు దూసుకొస్తుందంటే అక్కడ ఎవరైనా ఉంటారా? కాని ఉన్నారు. ఒక పక్క భారీ మొత్తంలో అటవీ ప్రాంతాన్ని దహనం చేస్తూ నిప్పులు కక్కుతూ మంటలు దూసుకొస్తున్నా ఏమాత్రం చీకు చింత లేనట్లు కొంతమంది వ్యక్తులు గోల్ఫ్ అడుతూ కనిపించారు. పోర్ట్లాండ్లోని కొలంబియా నది గుండా ఉన్నా అటవీ ప్రాంతాన్ని దహించుకుంటూ పెద్ద దావానలం వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అది 33,400 ఎకరాల అటవీ సంపదను బుగ్గిపాలు జేసింది. ప్రస్తుతం బెకాన్ రాక్ గోల్ఫ్ కోర్స్ వైపు ఆ కార్చిచ్చు వస్తున్నప్పటికీ అక్కడి వారు ఏమాత్రం భయపడకుండా ఎంత తాఫీగా గోల్ఫ్ ఆడుతున్నారో చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. -
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
పోర్ట్‌ల్యాండ్ : అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్‌లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఛైర్మన్ శ్రీని అనుమాండ్ర జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వేడుకలకి పోర్ట్‌ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తెలంగాణ ధూమ్ ధామ్ సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు పాల్గొని ఆటా,పాటలతో ప్రేక్షకులను అలరించారు. టీడీఎఫ్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి శ్రీని అనుమండ్ల వివరిస్తూ, ఈ వేడుకలు జరగడానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీఎఫ్ పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ టీం కొండల్ రెడ్డి, పుర్క రఘు స్వామి, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, కాంత్ కొడిదేటి, నిరంజన్ కూర, నరెందర్ చీటి, శివ ఆకుతోట, రాజ్ అందోల్, వీరేష్ బుక్కా, జయాకర్ రెడ్డి అడ్డ, సందీప్ రెడ్డి ఆశ, ప్రవీణ్, భాను పోగుల, సురేశ్ దొంతుల, ప్రవీణ్ ఎలకంటి, అజయ్ అన్నమనేని, హరినందన్ సదిరెడ్డి, వెంకట్ ఇంజం, సత్య సింహరాజులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు. -
15 ఏళ్లుగా విమానంలో ఒంటరిగా..
-
15 ఏళ్లుగా విమానంలో ఒంటరిగా..
పోర్ట్లాండ్: విమానయానం విపరీతంగా వృద్ధిచెందుతోన్న ప్రస్తుత దశలో ఏటా కనీసం 500 పాత విమానాలను తుక్కు(స్క్రాప్)గా మార్చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఇంజనీరింగ్ నిపుణుడు బ్రూస్ క్యాంప్‌బెల్‌కు ఇది ఏమాత్రం మింగుడుపడని అంశం. అందుకే ఎక్కడ పాడుబడ్డ విమానాల్ని అమ్మేస్తున్నారని తెలిస్తే అక్కడికెళ్లి కొనేస్తాడు! అన్నీ కొనడం కుదరదుకాబట్టి ఇష్టమైనవాటిని కనుక్కుంటాడు. అలా తన 20వ ఏట కొనుగోలుచేసిన భారీ బోయింగ్ 727 విమానాన్ని తన ఆవాసంగా మార్చుకున్నాడు క్యాంప్‌బెల్! ఆరెగాన్(యూఎస్)లోని పోర్ట్‌లాండ్‌కు చెందిన బ్రూస్.. తన వ్యవసాయ క్షేత్రంలో ఈ విమానం ఇంటిని రూపొందించాడు. పచ్చటి ప్రకృతి నడుమ, చిక్కటి చెట్ల మధ్య కొలువైన ఈ ఫైట్ హౌస్‌లోనే గడిచిన 15 ఏళ్లుగా బ్రూస్ నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అతని వయసు 66 ఏళ్లు. సంవత్సరంలో ఆరు నెలలు ఫ్లైట్ హౌస్‌లో ఉండే బ్రూస్.. మిగిలిన కాలమంతా పాత విమానాల కోసం విదేశాల్లో సంచరిస్తూఉంటాడు. ఆలూ, చూలు లేరు కాబట్టి అతనలా ప్రశాంతంగా, తనకు నచ్చినట్లు జీవిస్తున్నాడు.. -
పోర్ట్ ల్యాండ్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో 2వ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోర్టు ల్యాండ్ చాప్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చాప్టర్ ఛైర్ శ్రీనీ అనుమందల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు వచ్చిన వారందరికి శ్రీనీ అనుమందల తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనీ మాట్లాడుతూ..పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ చేపట్టిన జై కిసాన్, వికలాంగులకు మెడికల్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాల గురించి వివరించారు. టీడీఎఫ్ ప్రెసిడెంట్ విష్ణు కలవల స్కైప్ ద్వారా మాట్లాడుతూ..పోర్టు ల్యాండ్ టీం చేస్తున్న పలు సేవాకార్యక్రమాలని కొనియాడారు. -
రంగుల కోళ్లు
‘‘నవ్వు నలభై విధాల రైటు...మీ నవ్వుల కోసమీ ఫీటు’’ అంటున్నాడు అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో నివసించే బ్రూస్ విట్మాన్. నలుగురినీ నవ్వించాలని కోరుకునే విట్మ్యాన్ ఒక రోజున కాయగూరల రంగులను కలిపి తన రెండు పెంపుడు కోళ్లకు పూసేసి, పొద్దున్నే తీసుకెళ్లి ఓ పార్క్‌లో వదిలేశాడు. ఈ రంగుల కోళ్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వాటిని చూడడం, ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. ‘‘వింత మీకు వార్త మాకు’’ అన్నట్టు రెడీగా ఉండే మీడియాలో ఏవో వింత పక్షులు సిటీకి విహారానికి వచ్చినట్లు వార్తలు కూడా వచ్చేశాయి. కాసేపట్లోనే సదరు కోళ్లు సెలబ్రిటీలైపోవడం వరకూ ఓకెగాని, స్థానిక ముల్తానోమా కౌంటీ యానిమల్ సర్వీసెస్ వాళ్లు వచ్చేసి ఆ కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వాళ్లని సంప్రదించిన వైట్మాన్... అవి తన కోళ్లేనని లబోదిబోమన్నాడట. వాటికి రంగులు పూయడం వెనుక ఉన్న నవ్వించే ఆలోచన మంచిదే అయినా... అలా పెంపుడు కోళ్లను గాలికొదిలేయడం సరైంది కాదని మందలించిన యానిమల్ సర్వీసెస్ వాళ్లు... వాటిని కాసేపు సంరక్షించినందుకు కోడికి 16 డాలర్ల చొప్పున వసూలు చేసి మరీ వాటిని తిరిగి ఇచ్చారట! -
అరెస్టారెంట్..!
‘‘వడ్డించేవాడు మనవాడు కాకపోతే.. వరుసలో ముందున్నా వడపోతే’’... అనే విషయం అనుభవంలోకి వచ్చింది కేథలిన్ హ్యాంప్టన్కి. పోర్ట్‌ల్యాండ్‌లో నివసించే మధ్య వయస్కురాలైన కేథలిన్... గత వాలెంటైన్స్‌డే రోజు భర్తతో కలిసి లంచ్ చేయాలనుకుని ఎన్జోస్ కెఫె ఇటాలియానో అనే రెస్టారెంట్లో సీట్ రిజర్వ్ చేసుకుంది. అయితే సడన్‌గా తనకు రావడం కుదరదని భర్త చెప్పడంతో ఒంటరిగానే రెస్టారెంట్‌కి వెళ్లింది. ఇద్దరి కోసం తను రిజర్వ్ చేసుకున్న టేబుల్ మీద ఒక్కతే కూచుంది. అయితే రష్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఆ టేబుల్ని ఇంకొకరితో కలిసి షేర్ చేసుకోమన్నారు రెస్టారెంట్ వాళ్లు. దీనికి ఆమె అంగీకరించలేదు. నిమిషాలు ముదిరి గంటలవుతున్నా... ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి ఆమె దగ్గరకి ఎవరూ రాలేదు. దీంతో ఒళ్లు మండిన ఆమె రెస్టారెంట్లో నుంచి వెళ్లిపోబోయింది. అయితే దానికి కూడా నిర్వాహకులు చాలాసేపు ఆమెను అనుమతించలేదు. విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయిన కేథలిన్... గొడవ చేసి ఎలాగైతేనేం అక్కడి నుంచి బయటపడింది. ఈ అవమానం కారణంగా రోజుల తరబడి వలవల ఏడ్చేసిన కేథలిన్... తనకు ఇంత క్షోభ కలిగించిన వాళ్లని ఊరికే వదలకూడదనుకుంది. ‘‘విందు కోరి వస్తే ఖైదు చేస్తారా? ఆతిథ్యం అడిగితే అలుసుగా చూస్తారా’’ అంటూ సదరు రెస్టారెంట్ మీద లక్ష డాలర్ల పరిహారం కోరుతూ కోర్టు కెక్కింది. -
నగ్న ఎథ్లెట్ ను గుద్దేసి పోయిన నల్లకారు
'పుట్టినప్పుడు బట్ట కట్టలేదు... పోయేటప్పుడు అది వెంటరాదు...' అంటూ నందామయా గురుడ నందామయా తత్వం ఆ మనిషికి బాగా ఒంటపట్టింది. అందుకే నడిరోడ్డుపై బట్టలన్నీ విప్పేసి నగ్నంగా జాగింగ్ చేస్తూ, మధ్యమధ్యలో పుష్ అప్స్ చేస్తూ ఆనందించేస్తున్నాడు ఆ పెద్దమనిషి. దీన్ని చూసిన ప్రజలు పోలీసులకు ఫోను చేసి 'బాబూ .... ఇక్కడ ఉచితంగా సినిమా చూపించేస్తున్నాడు ఓ పెద్దమనిషి. దయచేసి అరెస్టు చేయండి' అని చెప్పారు. పోలీసులు హడావిడిగా బయలుదేరేలోపు మూడో ఫోన్ కాల్ వచ్చింది. 'నగ్న ఎథ్లెట్ ని ఒక నల్ల కారు గుద్దేసి వెళ్లిపోయింది' అని సమాచారం ఇచ్చింది. పోలీసులు సదరు నగ్న ఎథ్లెట్ శవాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని గుద్దేసిన కారు డ్రైవర్ పోలీసులు వచ్చే దాకా అక్కడే ఉండి, వారికి పూర్తిగా సహకరించడం విశేషం.ఈ సంఘటన అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రంలోని పోర్ట్ లాండ్ లో జరిగింది.