
వాషింగ్టన్: బంధువులను చూసేందుకు బయలుదేరిన ఓ భారతీయ కుటుంబం అదృశ్యమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన తొట్టపిల్లి సందీప్(42), తన భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచితో కలసి ఈ నెల 5(గురువారం)న హోండా పైలట్ కారులో పోర్ట్‌ల్యాండ్ నుంచి శాన్ జోస్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి బయలుదేరారు. శుక్రవారమే రావాల్సిన సందీప్ కుటుంబం ఎంతకూ రాకపోవటంతో అనుమానం వచ్చిన బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.