న్యూయార్క్: అమెరికాలోని మసాచుసెట్స్‌లో భారత సంతతి సంపన్న కుటుంబం చనిపోయిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ కమల్ (57), ఆయన భార్య టీనా(54) కుమార్తె అరియానా(18) వారి విశాలమైన భవనంలో శవాలై కనిపించారు. రాకేష్ మృతదేహం దగ్గర తుపాకీ ఉండటంతో గృహ హింసలో వీరు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
రాకేష్ కమల్ తన భార్య టీనా, కూతురు అరియానాతో మసాచుసెట్స్‌లో విశాలమైన భవనంలో నివసిస్తున్నారు. ఆ భవనంలో 11 పడక గదులు, 13 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అయితే.. వీరు గత రెండు రోజులుగా కనిపించకోవడంతో సమీప బంధువు వెళ్లి చూశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాకేష్ కుటుంబం మొత్తం మృతదేహాలుగా పడి ఉన్నారు. రాకేష్ మృతదేహం వద్ద ఆయన తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే.. రాకేష్ కుటుంబం ఆర్థిక సమస్యలతో మరణించి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. టీనా, ఆమె భర్త గతంలో ఎడునోవా అనే ఎడ్యుకేషన్ కంపెనీని నడిపారు. వారి కంపెనీ 2016లో ప్రారంభించబడింది. కానీ డిసెంబర్ 2021లో కాలేజీని రద్దు చేశారని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో భవనంలో కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
అరియానా తెలివైన యువతి..
రాకేష్, టీనా కుమార్తె అరియానా మిల్టన్ అకాడమీ నుండి పట్టభద్రురాలైంది. ఆమె మరణం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించిందని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. అరియానా చాలా తెలివైన అమ్మాయి అని విద్యాలయ ఫ్రొఫెసర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాంబు దాడిలో.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మృతి?
Comments
Please login to add a commentAdd a comment