Indian family
-
భారత సంతతి కుటుంబం మృతి కేసులో కీలక అంశాలు
న్యూయార్క్: అమెరికాలోని మసాచుసెట్స్‌లో భారత సంతతి సంపన్న కుటుంబం చనిపోయిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ కమల్ (57), ఆయన భార్య టీనా(54) కుమార్తె అరియానా(18) వారి విశాలమైన భవనంలో శవాలై కనిపించారు. రాకేష్ మృతదేహం దగ్గర తుపాకీ ఉండటంతో గృహ హింసలో వీరు మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రాకేష్ కమల్ తన భార్య టీనా, కూతురు అరియానాతో మసాచుసెట్స్‌లో విశాలమైన భవనంలో నివసిస్తున్నారు. ఆ భవనంలో 11 పడక గదులు, 13 బాత్రూమ్లు ఉన్నాయి. అయితే.. వీరు గత రెండు రోజులుగా కనిపించకోవడంతో సమీప బంధువు వెళ్లి చూశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాకేష్ కుటుంబం మొత్తం మృతదేహాలుగా పడి ఉన్నారు. రాకేష్ మృతదేహం వద్ద ఆయన తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాకేష్ కుటుంబం ఆర్థిక సమస్యలతో మరణించి ఉండవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. టీనా, ఆమె భర్త గతంలో ఎడునోవా అనే ఎడ్యుకేషన్ కంపెనీని నడిపారు. వారి కంపెనీ 2016లో ప్రారంభించబడింది. కానీ డిసెంబర్ 2021లో కాలేజీని రద్దు చేశారని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో భవనంలో కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అరియానా తెలివైన యువతి.. రాకేష్, టీనా కుమార్తె అరియానా మిల్టన్ అకాడమీ నుండి పట్టభద్రురాలైంది. ఆమె మరణం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించిందని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. అరియానా చాలా తెలివైన అమ్మాయి అని విద్యాలయ ఫ్రొఫెసర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాంబు దాడిలో.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మృతి? -
కెనడా–అమెరికా సరిహద్దు దాటబోతూ... భారతీయ కుటుంబం దుర్మరణం
టొరొంటో: కెనడా నుంచి నదీ మార్గంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో బోటు తిరగబడి ఓ భారతీయ కుటుంబం దుర్మరణం పాలైంది. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటిదాకా 8 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఇవి భారత, రొమేనియా సంతతికి చెందిన రెండు కుటుంబాలవిగా తేలింది. మృతుల్లో భారతీయులు ఎంతమంది అన్నది తేలాల్సి ఉంది. అలాగే మరో మృతదేహం దొరకాల్సి కూడా ఉందని పోలీసులు చెప్పారు. -
హృదయవిదారకం.. భారతీయ కుటుంబం దుర్మరణం!
న్యూయార్క్/ఒట్టావా: కెనడా-అమెరికా సరిహద్దులో విషాదం చోటుచేసుకుంది. అక్రమంగా సరిహద్దు దాటే క్రమంలో ఆరుగురు శరణార్థులు దుర్మరణం పాలయ్యారు. వీళ్లలో ఐదుగురు భారత్‌కు చెందినవాళ్లూ, అదీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. మరో వ్యక్తిని కెనడా పౌరసత్వం ఉన్న రోమేనియన్‌గా కెనడా పోలీసులు గుర్తించారు. ఇరు దేశాల మధ్య అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు-క్యూబెక్(న్యూయార్క్ స్టేట్) ప్రాంతంలో సెయింట్ లారెన్స్ నదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు అంతా భారతీయులేనా? అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం నదీ తీర ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఓ బోటును అధికారులు గుర్తించారు. ఆపై ఏరియల్ సర్వే ద్వారా మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలికితీశారు. మరో చిన్నారికి చెందిన పాస్‌పోర్ట్ లభ్యం కాగా ఆమె కూడా చనిపోయి ఉంటుందని అంచనాకి వచ్చిన పోలీసులు.. మృతదేహం కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇది హృదయవిదారకమైన ఘటన. మృతుల్లో పసికందులు కూడా ఉండడం ఘోరం అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఇక జనవరి నుంచి ఇప్పటిదాకా అక్రమంగా ఇరు దేశాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు 48 వెలుగు చూసినట్లు అక్వెసాస్నే అధికారులు చెబుతున్నారు. వీళ్లలో భారత్‌కు, రొమేనియాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. మోహవ్క్ సరిహద్దు ప్రాంతంలో ఉండే అక్వెసాస్నే.. క్యూబెక్, ఒంటారియో, న్యూయార్క్ స్టేట్లతో సరిహద్దు పంచుకుంటోంది. అందుకే వీటి గుండా ఇరు దేశాలకు శరణార్థుల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటోంది. పైగా ఈ అక్రమ రవాణాకు పోలీసులే సహకరిస్తుండడం గమనార్హం. సరిహద్దుల్లో దిగాక.. వాళ్లకు గోప్యంగా వాహనాల్లో ఆయా ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఇదీ చదవండి: నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు! -
మెజారిటీ ప్రజల్లో ఆర్థిక అభద్రత
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల విస్తృతి పెరిగినప్పటికీ, దేశంలో మెజారిటీ ప్రజల్లో ఆర్థిక అభద్రతా భావం నెలకొని ఉన్నట్టు మనీ 9 సర్వే ప్రకటించింది. ‘‘ఒక భారతీయ కుటుంబం (4.2 మంది) సగటు ఆదాయం నెలకు రూ.23,000గా ఉంది. కానీ, 46 శాతం కుటుంబాల వాస్తవిక ఆదాయం నెలకు రూ.15,000 కంటే తక్కువే ఉంది. జీవన పమ్రాణాల పరంగా దేశంలో కేవలం 3 శాతం కుటుంబాలే ఉన్నత విభాగంలో ఉన్నాయి. వీటిల్లో అధిక భాగం ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవి’’ అని ఈ సర్వే నివేదిక తెలియజేసింది. ఇతర అంశాలు.. ► 70 శాతం కుటుంబాలకు బ్యాంకు డిపాజిట్లు, బీమా, పోసాŠట్ఫీసు పొదుపు, బంగారం రూపంలో పెట్టుబడులు ఉన్నాయి. అత్యధికంగా వీరి పొదుపు ఉన్నది బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే. ఆ తర్వాత పోస్టాఫీసు పొదుపు పథకాలు, జీవిత బీమా, బంగారంలో వరుసగా ఉన్నాయి. ► 64 శాతం కుటుంబాలు బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడులు కలిగి ఉంటే, 19 శాతం కుటుంబాలకు జీవిత బీమా రూపంలో పెట్టుబడులు ఉన్నాయి. ► ఔత్సాహిక వర్గాల్లో 40 శాతం కుటుంబాలకు అసలు ఆర్థిక పొదుపులే లేవు. విధాన కర్తలు దీనిపై దృష్టి సారించాలన్నది ఈ సర్వే సూచనగా ఉంది. ► 22 శాతం కుటుంబాలకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, యులిప్‌లు, భౌతిక ఆస్తుల్లో (ప్రాపర్టీ తదితర) పెట్టుబడులు ఉన్నాయి. ► ప్రాపర్టీలు/భూములపై అత్యధికంగా 18 శాతం, మ్యూచువల్ ఫండ్స్‌లో 6 శాతం, స్టాక్స్‌లో 3 శాతం, యులిప్‌లలో 3 శాతం చొప్పున ఉన్నాయి. ► 11 శాతం కుటుంబాలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఉన్నాయి. వీటిల్లో వ్యక్తిగత రుణాలు ఎక్కువ కాగా, ఆ తర్వాత గృహ రుణాలున్నాయి. -
మీ కక్కుర్తి తగలడ.. పరువు తీశారు కదా
బాలీ: ఓ హోటల్లో బస చేయడం.. అక్కడ ఉన్న వస్తువులను దొంగతనం చేయడం.. ఆఖర్లో అడ్డంగా బుక్కవ్వడం ఇదంతా చదవగానే ఓ తెలుగు సినిమా గుర్తుకొస్తుంది కదా. కానీ నిజంగానే ఇలాంటి సంఘటన ఒకటి బాలీలో చేటు చేసుకుంది. బస చేసిన హోటల్లోనే దొంగతనం చేసి.. రెడ్‌హ్యాండెడ్‌గా బుక్కయిన వారు భారతీయులు కావడం ఇక్కడ విషాదం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. వివరాలు.. పర్యటన నిమిత్తం బాలీ వెళ్లిన ఓ భారతీయ కుటంబం తాము బస చేసిన హోటల్ గదిలో దొంగతనానికి పాల్పడ్డారు. హెయిర్ డ్రయ్యర్, సోప్ బాక్స్, అద్దం, జార్ వంటి వస్తువులను తీసుకుని తమ లగేజ్‌లో ప్యాక్ చేసుకున్నారు. గది ఖాళీ చేసి హోటల్ నుంచి వెళ్లేటప్పుడు సిబ్బంది వీరి లగేజ్‌ను చెక్ చేయడంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ దంపతులు ఒక్కసారిగా తల దించుకున్నారు. క్షమాపణలు చెప్పారు. అంతేకాక తాము తీసిన వస్తువుల ఖరీదు చెల్లిస్తామని వేడుకున్నారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మీ కక్కుర్తి తగలడ.. దేశం పరువు తీశారు కదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పాస్‌పోర్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు This family was caught stealing hotel accessories. Such an embarrassment for India. Each of us carrying an #IndianPassport must remember that we are ambassadors of the nation and behave accordingly. India must start cancelling passports of people who erode our credibility. pic.twitter.com/unY7DqWoSr — Hemanth (@hemanthpmc) July 27, 2019 ఈ సంఘటనపై నటి మిని మాథుర్ కూడా స్పందించారు. ‘పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లి.. భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించే చెత్త పర్యాటకులకు మీరు మంచి ఉదాహరణ. మీలాంటి వారి పనులను ఖండిస్తున్నాను’ అన్నారు. -
భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు
సాక్షి: హాలిడే ట్రిప్ కోసం విదేశానికెళ్లిన భారతీయ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ప్రసూన్ భట్టాచార్య అనే భారతీయుడు తన కుటుంబంతో మూడ్రోజుల పాటు విహారయాత్రకు ఐర్లాండ్ వెళ్లాడు. అందులో భాగంగా బెల్ఫాస్ట్ నుంచి డబ్లిన్‌కు రైలులో వెళ్తున్న వీరిని, పక్కనే కూర్చున్న తోటి ప్రయాణీకుడు జాత్యహంకారంతో దాదాపు గంటపాటు దుర్భాషాలాడాడు. భాష, యాసలను చూసి అవమాన పరిచాడు. వారించాల్సిన రైలు గార్డు వీరిని పట్టించుకోకుండా మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. ఈ వివరాలతో ప్రసూన్ భట్టాచార్య మోదీని, ఐర్లాండ్ ప్రధానిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారి స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మరియు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, ఆదేశ రైల్వే ప్రసూన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పింది. -
చిత్రహింసలు పెట్టి తల్లిని చంపాడు
దుబాయ్: భార్యతో కలసి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి తన సొంత తల్లినే చిత్రహింసలు పెట్టి చావుకు కారణమైన ఘటన దుబాయ్‌లో జరిగింది. చనిపోయేనాటికి తల్లి బరువు కేవలం 29 కేజీలు అని వైద్యులు వెల్లడించారు. తిండిపెట్టకుండా కడుపు మాడ్చి, శారీరకంగా హింసించడంతో ఆమె పక్కటెముకలు విరగడంతో అంతర్గత రక్తస్రావంతో ఆమె మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. ఆమె కంటి రెటీనాను పెరికివేయడంతో పాటు మరో కంటికి కూడా గాయం చేసినట్లు కోర్టు తెలిపిందని బుధవారం ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. 2018 జూలై నుంచి అక్టోబర్ వరకూ ఈ హింస కొనసాగినట్లుగా అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
పిల్లాడు ఏడ్చాడని విమానం నుంచి బలవంతంగా...
న్యూఢిల్లీ : పిల్లాడు ఏడ్చాడని ఓ ఇండియన్ ఫ్యామిలీని విమానం నుంచి బలవంతంగా దించేశారు. ఈ దారుణమైన సంఘటన బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ లండన్-బెర్లిన్ విమానం(బీఏ 8495)లో జూలై 23న చోటు చేసుకుంది. ఈ విషయంపై ఈ పిల్లాడి తండ్రి ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సురేష్ ప్రభుకు లేఖ రాశాడు. బ్రిటీష్ విమానయాన సంస్థ తమతో వ్యవహరించిన అవమానకరమైన చర్యపై మంత్రికి వివరించాడు. విమానం టేకాఫ్ అవుతుండగా తమ పిల్లాడు బెదిరిపోయి ఏడ్వడం ప్రారంభించాడు. దీంతో తల్లి అతడ్ని ఒళ్లోకి తీసుకుంది. ఇంతలో అక్కడకు చేరుకున్న క్రూ సిబ్బంది ఒకరు.. తమపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. చిన్నారిని తన సీట్లోకి వెళ్లాలని గద్దించాడు. దీంతో పసిపిల్లాడు మరింత బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ దంపతుల పక్కన సీట్లలో కూర్చున్న ఇతర భారతీయ కుటుంబాలు, పిల్లాడి ఏడుపు ఆపడానికి శతవిథాలా ప్రయత్నించారని, బిస్కెట్లు ఇస్తూ ఏడుపు ఆపేలా ప్రయత్నించారు. అయితే మళ్లీ వచ్చిన ఆ క్యాబిన్ సిబ్బంది.. యూ బ్లడీ.. ఏడుపు ఆపుతావా? లేదా? అంటూ మండిపడ్డాడు. లేకపోతే విండోలో నుంచి బయటకు పడేస్తా అంటూ హెచ్చరించాడు. దీంతో తమ చిన్నారి మరింత దడుచుకున్నాడని మంత్రికి రాసిన లేఖలో ఆ ప్రయాణికుడు పేర్కొన్నాడు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఆ కేబిన్ సిబ్బంది భారతీయులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, బ్లడీ ఇండియన్స్ అంటూ వ్యాఖ్యానించాడని లేఖలో తెలిపాడు. విమానాన్ని టెర్మినల్‌కు తీసుకెళ్లి, తమల్ని బలవంతంగా కిందకి దించేశారని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుని విచారించాలని ప్రయాణికుడు కోరాడు. ప్రయాణికుడు చేసిన ఈ ఫిర్యాదును, తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని, ఇలాంటి వివక్షపూరిత విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ బ్రిటీష్ ఎయిర్వేస్ అధికార ప్రతినిధి చెప్పారు. కస్టమర్‌తో ప్రత్యక్షంగా సంప్రదించి, దీనిపై పూర్తి విచారణ ప్రారంభిస్తామన్నారు. -
ఎన్ఆర్ఐ కుటుంబం మృతదేహాలు వెలికితీత
కాలిఫోర్నియా : భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అమెరికాలో అదృశ్యమైన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన సందీప్ తోటపల్లి(41), ఆయన భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్(12), సాచి(9)లు పోర్ట్లాండ్ నుంచి శాన్‌జోష్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న మెరూన్ హోండా పైలట్ కారు ప్రమాదవశాత్తూ ఈల్ నదిలో పడిపోయింది. సరదాగా గడిపేందుకు ఏప్రిల్ 6న బంధువు ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి వారి కోసం సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో గత వారం సందీప్ భార్య సౌమ్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు. కాగా, సోమవారం మరో రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు సందీప్ తోటపిల్లి, ఆయన కుమార్తె సాచివిగా సిబ్బంది గుర్తించారు. అయితే వారి కుమారుడు సిద్ధాంత్ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. సందీప్, సాచిల మృతదేహాలు హోండా పైలట్ కారులోనే చిక్కుకుని ఉండగా బయటకు తీశారు. గల్లంతైన సిద్ధాంత్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సందీప్ తల్లిదండ్రులు గుజరాత్లో ఉన్నారు. గుజరాత్‌లోనే పెరిగిన సందీప్ పదిహేనేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. -
అమెరికాలో భారతీయ కుటుంబం మృతి!
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో గత వారం గల్లంతైన భారతీయ కుటుంబం మరణించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈల్ నదిలో గాలింపు చర్యలు జరుపుతున్న సహాయక బృందాలు.. కొన్ని వ్యక్తిగత వస్తువులను, వాహనం విడి భాగాలను గుర్తించారు. ఇవి భారతీయ కుటుంబానికి చెందినవిగా భావిస్తున్నారు. భారత సంతతికి చెందిన సందీప్ తొట్టపల్లి(41) యూనియన్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారిటా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సందీప్ భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్(12), సాచీ(9)తో కలసి తమ హోండా పైలట్ కారులో రోడ్ ట్రిప్‌కు బయలుదేరారు. పోర్ట్ లాండ్‌లోని ఒరేగాన్ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌కు వెళుతుండగా ఈ నెల 5న వీరు కనిపించకుండా పోయారు. వీరి వాహనం ఏప్రిల్ 6 న ఉధృతంగా ప్రవహిస్తున్న ఈల్ నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు నదిలో విస్తృతంగా గాలించి హోండా వాహనానికి సంబంధించి కొన్ని విడి భాగాలను, అలాగే వ్యక్తిగత వస్తువులను గుర్తించగలిగామని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ సిబ్బంది వెల్లడించారు. -
అమెరికాలో ఓ భారతీయ కుటుంబం అదృశ్యం
వాషింగ్టన్: బంధువులను చూసేందుకు బయలుదేరిన ఓ భారతీయ కుటుంబం అదృశ్యమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన తొట్టపిల్లి సందీప్(42), తన భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచితో కలసి ఈ నెల 5(గురువారం)న హోండా పైలట్ కారులో పోర్ట్‌ల్యాండ్ నుంచి శాన్ జోస్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి బయలుదేరారు. శుక్రవారమే రావాల్సిన సందీప్ కుటుంబం ఎంతకూ రాకపోవటంతో అనుమానం వచ్చిన బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యూఎస్‌లో భారతీయ కుటుంబం అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో భారతీయ కుటుంబం అదృశ్యం సంచలనం కలిగిస్తోంది. భారత్‌కు చెందిన సందీప్ తోటపల్లి, ఆయన భార్య సౌమ్య, ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచిలు ఏప్రిల్ 5న మెరూన్ హోండా పైలట్ కారులో పోర్ట్లాండ్ నుంచి శాన్‌జోష్ వెళ్తూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారని స్థానిక మీడియా ప్రచురించిది. అయితే స్థానికంగా ఏప్రిల్ 6న ఈల్ నదిలో వచ్చిన వరదల్లో ఒక కారు కొట్టుకుపోయిందని, అది అదృశ్యమైన భారతీయుడు కారును పోలిఉందని హైవే పెట్రోలింగ్ అధికారి విలియం తెలిపారు. ప్రాధమిక విచారణలో ప్రత్యక్ష సాక్షలను విచారించగా వరదల్లో కొట్టుకుపోయిన కారు 2016 లేదా 2017లో విడుదలైన హోండా కారుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం కారును గుర్తించే పనిలో ఉన్నామని, కానీ ఇప్పటి వరకూ ఆచూకీ దొరకలేదని అధికార వర్గాలు తెలిపాయి. సంపదీప్ కారు ఈల్ నదిలో కూడా కొట్టుకుపోయిన కారు ఒకే విధంగా ఉన్నాయని, కానీ ఖచ్చితంగా నిర్ధారించలేమని అధికారులు అన్నారు. ఆచూకీ తెలియగానే కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్ స్పందించారు. ఈ సంఘటనసై వివరణ ఇవ్వాలంటూ శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారిని ఆదేశించారు. -
విషాదంలో మరో భారతీయ కుటుంబం
దుబాయి: దుబాయి ఒమన్ లోని మరో భారతీయ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. తండ్రి తన కూతురుతోపాటు వెళ్తున్న వాహానాన్ని ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనాదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు ఎంతకు స్పందించలేదు. దాంతో ఫోన్ నెంబర్ ఆధారంగా చిరునామా సేకరించి... మృతుల ఇంటికి వెళ్లగా అక్కడ మృతుడి భార్య కూడా మృతి చెందిందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మృతుడు సోహార్ స్టిల్ కంపెనీలో, అతడి భార్య ఎల్ అండ్ టీలతో పని చేస్తున్నారని తెలిపారు. వారి కుమార్తె స్థానిక భారతీయులకు చెందిన పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుందని పోలీసులు వెల్లడించారు. భారత్ లోని వారి బంధువులు వీరి మృతిపై సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. -
రిబ్బన్ కటింగ్‌కు మూడున్నర కోట్లు!!!
ఎప్పుడూ వార్తల్లో ఉండే కండల వీరుడు సల్మాన్‌ఖాన్... ఈసారి లండన్‌లోని ఓ ఇండియన్ ఫ్యామిలీకి షాకిచ్చాడు. కొత్తగా ఏర్పాటు చేసిన తమ బాంకెట్ హాల్ రిబ్బన్ కట్ చేయమని అడిగితే... ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట సల్మాన్. లండన్‌లో బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ సూపర్‌స్టార్‌తో డీల్‌పై టాక్స్ జరుగుతున్నాయట. కట్ చేసినందుకు తనకు రూ.3 కోట్లు, తన సిబ్బంది బోర్డింగ్, ట్రావెలింగ్కు మరో రూ.50 లక్షలు అడిగాడని ‘మిడ్ డే’ కథనం. అయితే సల్మాన్ ప్రతినిధి ఈ వార్తలను కొట్టిపారేశాడు. అదృష్టం అంటే నాదే..! నటిగా వూరిన మోడల్ లిసా హెడెన్‌కు ఇప్పుడు ఆకాశంలో విహరిస్తున్నట్టుందట. ‘షౌకీన్’ రీమేక్‌లో తనకు నటించే అవకాశం రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందీ వుుద్దు గువ్ము. బాలీవుడ్ యూక్షన్ స్టార్ అక్షయ్కువూర్తో పాటు వెటరన్ నటులు అనుపమ్‌ఖేర్, అనూ కపూర్, పరేష్ రావల్ వంటి వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టవుంటూ తెగ వుురిసిపోతోంది. ‘ఈ సినివూలో చేస్తూ చాలా నేర్చుకున్నా. బాగా ఎంజాయ్ చేశా’ అంటూ చెప్పేస్తోంది. పిల్లలకూ పిచ్చే..! సన్నీ లియోన్... పేరు చెబితే హాట్ హాట్ సీన్లు... రొవూన్స్ పండిన బిగ్ స్క్రీన్లు యుూత్ కళ్ల ముందు కదలాడుతుంటారుు. ఒకప్పటి అడల్ట్ స్టార్ వరుససినివూలతో ఇప్పుడు బాలీవుడ్లో తెగ బిజీ అరుుపోరుుంది. ఈ సొగసరి పేరు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా యువు పాపులర్. ఇదే విషయూన్ని అడిగితే... ‘నిజంగా ఈ విషయుం నాకు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి నాతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారు’ అంటూ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.