సాక్షి: హాలిడే ట్రిప్ కోసం విదేశానికెళ్లిన భారతీయ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ప్రసూన్ భట్టాచార్య అనే భారతీయుడు తన కుటుంబంతో మూడ్రోజుల పాటు విహారయాత్రకు ఐర్లాండ్ వెళ్లాడు. అందులో భాగంగా బెల్‌ఫాస్ట్ నుంచి డబ్లిన్‌కు రైలులో వెళ్తున్న వీరిని, పక్కనే కూర్చున్న తోటి ప్రయాణీకుడు జాత్యహంకారంతో దాదాపు గంటపాటు దుర్భాషాలాడాడు. భాష, యాసలను చూసి అవమాన పరిచాడు. వారించాల్సిన రైలు గార్డు వీరిని పట్టించుకోకుండా మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. ఈ వివరాలతో ప్రసూన్ భట్టాచార్య మోదీని, ఐర్లాండ్ ప్రధానిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారి స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మరియు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, ఆదేశ రైల్వే ప్రసూన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment