Racist abuse
-
రాస్ టేలర్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాడ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 5వ రోజున న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌కి చేదు అనుభవం ఎదురైంది. రాస్ టేలర్‌పై ఇద్దరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఓ మహిళ ట్వీట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్‌లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు.. ఆ ఇద్దరిని మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఇక ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు చదవండి: WTC Final: ఆడతారా...ఓడతారా! -
‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’లోగోకు ఐసీసీ ఓకే!
మాంచెస్టర్: ఇటీవల అమెరికాలో చోటు చేసుకున్న జాత్యంహకార హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అదే సమయంలో జాతి వివక్షను ఎదుర్కొన్న వారంతా ఒక్కొక్కరుగా బయటకొస్తూ తమ గళాన్ని వినిపిస్తున్నారు. వీరిలో వెస్టిండీస్ క్రికెటర్లు కూడా ఉన్నారు. తమ రంగును హేళన చేస్తూ గతంలో ఎన్నో సార్లు జాతి వివక్షకు గురైన విషయాన్ని విండీస్ జట్టులోని చాలామంది క్రికెటర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. వేదిక ఏదైనా తమకు ఎదురైన చేదు అనుభవాలపై అప్పుడు నోరు మెదపకుండా ఉన్న విండీస్ క్రికెటర్లు.. ఇప్పుడు మాత్రం ఇక సహించేది లేదని అంటున్నారు. (‘బుమ్రా నో బాల్ కొంపముంచింది’)ల జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన వారికి స్పాట్ ఫిక్సింగ్ చేస్తే ఎలా బ్యాన్ చేస్తారో అదే తరహా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అదే క్రమంలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నినాదంతో ప్రపంచానికి తమ నిరసన వినిపించడానికి సిద్ధమయ్యారు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు టెస్టుల సిరీస్‌లో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగోతో బరిలోకి దిగనున్నారు. విండీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్లపై ఈ లోగోను ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా రూపొందించిన ఈ లోగోకు ఐసీసీ ఆమోద ముద్ర వేయడంతో విండీస్ క్రికెటర్లు విన్నూత్న రీతిలో నిరసన చేపట్టేందుకు మార్గం సుగుమం అయ్యింది. గతనెల అమెరికాలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. అందరికీ సమానత్వం, సమన్యాంయ అనే విషయాలపై పోరాటం జరుగుతుందని, విండీస్ క్రికెటర్లగా తమ జట్టు గొప్ప తనం తెలుసన్నాడు. జాతి వివక్ష అనేది చాలా ప్రమాదమని, నేటికీ ఇది ఉందంటే అది చేతగాని తనంతోనేనని విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తెలిపాడు. తమ క్రికెటర్లంతా జాతి వివక్షపై పోరాటం చేయడానికి ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఎంచుకున్నట్లు తెలిపాడు. వచ్చే నెల 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. -
భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు
సాక్షి: హాలిడే ట్రిప్ కోసం విదేశానికెళ్లిన భారతీయ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. ప్రసూన్ భట్టాచార్య అనే భారతీయుడు తన కుటుంబంతో మూడ్రోజుల పాటు విహారయాత్రకు ఐర్లాండ్ వెళ్లాడు. అందులో భాగంగా బెల్ఫాస్ట్ నుంచి డబ్లిన్‌కు రైలులో వెళ్తున్న వీరిని, పక్కనే కూర్చున్న తోటి ప్రయాణీకుడు జాత్యహంకారంతో దాదాపు గంటపాటు దుర్భాషాలాడాడు. భాష, యాసలను చూసి అవమాన పరిచాడు. వారించాల్సిన రైలు గార్డు వీరిని పట్టించుకోకుండా మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని సమాచారం. ఈ వివరాలతో ప్రసూన్ భట్టాచార్య మోదీని, ఐర్లాండ్ ప్రధానిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటనపై ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారి స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మరియు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా, ఆదేశ రైల్వే ప్రసూన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పింది. -
బ్రిటన్‌లో పెరుగుతున్న జాతి విద్వేష దాడులు
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవాలనే బ్రెగ్జిట్ కు అనుకూలంగా పౌరులు తీర్పు ఇచ్చిన తర్వాత బ్రిటన్‌లో జాతి విద్వేష దాడులు పెచ్చరిల్లుతున్నాయి. ఒక్క యూరోపియన్లకు వ్యతిరేకంగానే కాదు, భారతీయులకు వ్యతిరేకంగా కూడా దాడులు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఇంతవరకు నాలుగైదు కేసులే దాఖలైనప్పటికీ ఈ వారం రోజుల్లో వందకుపైగా జాతి విద్వేష దాడులు జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టమవుతోంది. ఈ దాడులు ప్రస్తుతానికి ఎక్కువ వరకు జాతివిద్వేష వ్యాఖ్యలకే పరిమితమవుతున్నాయని, అవి భౌతిక దాడులకు దారితీస్తే బ్రిటన్‌లో కొనసాగడం కష్టమని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడులు జరుగుతాయన్న భయంతో లండన్ పౌరసత్వం కలిగి అక్కడే స్థిరపడిన విదేశీయులు తమ పాస్‌పోర్టులను ఎక్కడికెళ్లినా బహిరంగంగా బాటసారులకు చూపిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇది, దేశానికి నిజంగా సిగ్గు చేటని, ఇక ఇలాంటి దాడులు ఏమాత్రం సహించమని, దోషుల పట్ల కఠినంగా వ్వవహరిస్తామని ప్రధాన మంత్రి డేవిడ్ కేమరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్న నిఖిల్ పాండే అనే భారతీయ విద్యార్థి ఇటీవల ఎయిర్‌పోర్టులో జాతి విద్వేష వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఓ వ్యక్తి నన్ను ఎయిర్ పోర్టులో ఏ దేశం నుంచి వచ్చావని అడిగారు. నేను భారత్ నుంచి వచ్చానని చెప్పాను. వెంటనే నా పాస్‌పోర్టు గుంజుకున్నారు. బ్రిటన్‌లో నా నివాసం ధ్రువపత్రాన్ని కూడా లాక్కున్నాడు. పాస్‌పోర్టుపై నేను రెండేళ్ల క్రితం తీసుకున్న ఫొటో ఉంది. ఆ ఫొటోలో నాకు గడ్డం ఉంది. దాన్ని చూసి ఆయన నన్ను టైస్టులాగా ఉన్నావంటూ వ్యాఖ్యానించాడు. ఇలాంటి అవమానం నాకు బ్రిటన్‌లో ఎప్పుడూ జరగలేదు. నేను రెండేళ్ల నుంచి బ్రిటన్‌లో ఉంటున్నా నేనెప్పుడూ ఈ దేశం జాతి విద్వేష దేశమని ఎప్పుడూ భావించలేదు’ అని పాంగే తనకు జరిగిన అవమానాన్ని మీడియాకు వివరించారు. ఇలాంటి సంఘటనలపై తక్షణమే దర్యాప్తు జరపాలని లండన్ మేయర్ పాదిక్ ఖాన్ పోలీసులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనల గురించి పౌరులు కూడా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.