మాంచెస్టర్: ఇటీవల అమెరికాలో చోటు చేసుకున్న జాత్యంహకార హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అదే సమయంలో జాతి వివక్షను ఎదుర్కొన్న వారంతా ఒక్కొక్కరుగా బయటకొస్తూ తమ గళాన్ని వినిపిస్తున్నారు. వీరిలో వెస్టిండీస్ క్రికెటర్లు కూడా ఉన్నారు. తమ రంగును హేళన చేస్తూ గతంలో ఎన్నో సార్లు జాతి వివక్షకు గురైన విషయాన్ని విండీస్ జట్టులోని చాలామంది క్రికెటర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. వేదిక ఏదైనా తమకు ఎదురైన చేదు అనుభవాలపై అప్పుడు నోరు మెదపకుండా ఉన్న విండీస్ క్రికెటర్లు.. ఇప్పుడు మాత్రం ఇక సహించేది లేదని అంటున్నారు. (‘బుమ్రా నో బాల్ కొంపముంచింది’)ల
జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన వారికి స్పాట్ ఫిక్సింగ్ చేస్తే ఎలా బ్యాన్ చేస్తారో అదే తరహా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అదే క్రమంలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నినాదంతో ప్రపంచానికి తమ నిరసన వినిపించడానికి సిద్ధమయ్యారు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు టెస్టుల సిరీస్‌లో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగోతో బరిలోకి దిగనున్నారు. విండీస్ క్రికెటర్లు ధరించే జెర్సీల కాలర్లపై ఈ లోగోను ప్రత్యేకంగా ముద్రించనున్నారు. ప్రముఖ డిజైనర్ అలీషా హోసన్నా రూపొందించిన ఈ లోగోకు ఐసీసీ ఆమోద ముద్ర వేయడంతో విండీస్ క్రికెటర్లు విన్నూత్న రీతిలో నిరసన చేపట్టేందుకు మార్గం సుగుమం అయ్యింది.
గతనెల అమెరికాలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. అందరికీ సమానత్వం, సమన్యాంయ అనే విషయాలపై పోరాటం జరుగుతుందని, విండీస్ క్రికెటర్లగా తమ జట్టు గొప్ప తనం తెలుసన్నాడు. జాతి వివక్ష అనేది చాలా ప్రమాదమని, నేటికీ ఇది ఉందంటే అది చేతగాని తనంతోనేనని విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తెలిపాడు. తమ క్రికెటర్లంతా జాతి వివక్షపై పోరాటం చేయడానికి ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఎంచుకున్నట్లు తెలిపాడు. వచ్చే నెల 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment