దుబాయ్: భార్యతో కలసి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి తన సొంత తల్లినే చిత్రహింసలు పెట్టి చావుకు కారణమైన ఘటన దుబాయ్‌లో జరిగింది. చనిపోయేనాటికి తల్లి బరువు కేవలం 29 కేజీలు అని వైద్యులు వెల్లడించారు. తిండిపెట్టకుండా కడుపు మాడ్చి, శారీరకంగా హింసించడంతో ఆమె పక్కటెముకలు విరగడంతో అంతర్గత రక్తస్రావంతో ఆమె మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. ఆమె కంటి రెటీనాను పెరికివేయడంతో పాటు మరో కంటికి కూడా గాయం చేసినట్లు కోర్టు తెలిపిందని బుధవారం ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. 2018 జూలై నుంచి అక్టోబర్ వరకూ ఈ హింస కొనసాగినట్లుగా అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment