mother death
-
మంత్రి వేములకు మాతృవియోగం.. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు(శుక్రవారం) నిజామాబాద్ జిల్లా వేల్పూరుకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి అంత్యక్రియలకు కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం. రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ తల్లి మంజులమ్మ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో పలువురు నేతలు ఆయనకు సానుభూతి తెలిపారు. ఆపై అంత్యక్రియల కోసం భౌతిక కాయాన్ని వేల్పూర్‌కు తరలించారు. అంతకు ముందు.. వేముల మాతృవియోగంపై సీఎంవో ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. -
పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా అధికారికంగా ద్రువీకరించింది. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ''మారియా కమిన్స్ చనిపోవడం చాలా బాధాకారం. క్రికెట్ ఆస్ట్రేలియా తరపున పాట్ కమిన్స్, అతని కుటుంబసభ్యులకు మా ప్రగాడ సానభూతి. కమిన్స్ తల్లి మృతికి సంతాపంగా టీమిండియాతో నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్ క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో(బ్లాక్ ఆర్మ్ బాండ్స్) బరిలోకి దిగుతారు.. '' అంటూ ట్వీట్ చేసింది. పాట్ కమిన్స్ తల్లి మృతిపై బీసీసీఐ సహా టీమిండియా ఆటగాళ్లు తమ సంతాపాన్ని ప్రకటించారు. ''ఈ విషాద సమయంలో కమిన్స్, అతని కుటుంబసభ్యులుకు మా సానుభూతి తెలియజేస్తున్నాం'' అంటూ ట్వీట్ చేశారు. కాగా తల్లి అనారోగ్యం కారణంగా పాట్ కమిన్స్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయాడు. తల్లిని దగ్గరుండి చూసుకోవాలన్న అతని కోరికను మన్నించిన క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. తన తల్లి మారియా చివరి రోజుల్లో పక్కనే ఉండాలని భావించిన కమిన్స్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని ఇటీవలే పత్రికా ప్రకటనలో పేర్కొన్నాడు. We are deeply saddened at the passing of Maria Cummins overnight. On behalf of Australian Cricket, we extend our heartfelt condolences to Pat, the Cummins family and their friends. The Australian Men's team will today wear black armbands as a mark of respect. — Cricket Australia (@CricketAus) March 10, 2023 On behalf of Indian Cricket, we express our sadness at the passing away of Pat Cummins mother. Our thoughts and prayers are with him and his family in this difficult period 🙏 — BCCI (@BCCI) March 10, 2023 చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు -
మా అమ్మ పార్థివ దేహం వద్ద... కరువుదీరా ఏడ్వలేకపోయా
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై ప్రిన్స్ హ్యారీ (38) విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రేమకు ప్రతిరూపమైన తన తల్లి డయానా చనిపోతే కనీసం కరువుదీరా ఏడవలేకపోయానని మంగళవారం విడుదల కానున్న తన స్వీయచరిత్ర ‘స్పేర్’లో ఆయన వాపోయారు. రాచ కుటుంబపు కఠినమైన నైతిక కట్టుబాట్లే అందుకు కారణమని ఆరోపించారు. ‘‘ఏం జరిగినా ఏడవకూడదన్నది రాజకుటుంబంలో అలిఖిత నియమం. ఇలాంటి వాటిని చిన్నతనం నుంచే రుద్దీ రుద్దీ నా హృదయాన్ని బండబార్చారు. దాంతో మా అమ్మ చనిపోయి అంతులేని శూన్యాన్ని మిగిల్చినా ఆ దుర్భర ఆవేదనను బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకపోయింది. దాన్నంతటినీ గుండెల్లోనే అదిమి పెట్టి మా అమ్మ కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను నవ్వుతూ పలకరించాల్సి వచ్చింది. కానీ వారిలో ఎవరితో కరచాలనం చేసినా అరచేతులన్నీ తడితడిగా తగిలాయి. అవన్నీ వారి కన్నీళ్లతో తడిశాయని అర్థమై చాలా సిగ్గుపడ్డా. ఆ వీడియోలను ఇప్పుడు చూసినా సిగ్గేస్తుంటుంది’’ అన్నారు. -
Indira Devi Death: తల్లి మృతితో శోకసంద్రంలో మహేశ్‌బాబు
తల్లి ఇందిరా దేవి(70) మృతితో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఏడాది జనవరిలోనే సోదరుడు రమేశ్ బాబు మరణించడం, ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది. మహేశ్‌కు తల్లి ఇందిరా దేవిపై అపురూపమైన ప్రేమ. పలు సందర్భల్లో ఆమె ప్రస్తావన రాగానే ఎంతో ఎమోషనల్ అయ్యాడు. పెళ్లికిముందు వరకు ఆయన తల్లి చాటునే పెరిగాడు. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఓ వివాహ వేడుకకు ఇందిర వచ్చినప్పుడు మహేశ్‌బాబు ఆమెను రిసీవ్ చేసుకున్న విధానం అందరినీ ఆకర్షించింది. తండ్రికి రెండో వివాహం.. అందుకే తల్లి చాటున ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణ మామ కూతురే. వరసకు మరదలు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొన్నాళ్లకే కుటుంబసభ్యుల సలహా మేరకు ఇందిరను పెళ్లి చేసుకున్నారు కృష్ణ. అయితే ఆ తర్వాత విజయ నిర్మలతో వరుసగా సినిమాలు తీయడంతో ఆమెతో ప్రేమలో పడ్డారు. దీంతో ఇందిరతో పెళ్లైన నాలుగేళ్లకే.. విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు కృష్ణ. పెళ్లి విషయాన్ని ఇందిరకు చెప్పారు. ఆ తర్వాత కూడా అందరూ కలిసే ఉన్నారు. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఇందిరా దేవి ఎప్పుడూ బయటకు రాలేదు. ఫంక్షన్లలోనూ అరుదుగా కనిపించారు. ఎమోషనల్ పోస్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 20న ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు చాలా ప్రత్యేకంగా ట్విట్టర్లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. అమ్మా మీరు నా తల్లికావడం అదృష్టం. మీ గురించి చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ట్వీట్ చేశాడు. మహేశ్ తన మాతృమూర్తి పట్ల చూపించిన ప్రేమను చూసి ఆయన అభిమానులు మురిసిపోయారు. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె ప్రాణాలు కోల్పోవడం మహేశ్‌తో పాటు అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Happy birthday Amma ♥️ Thank you for being the blessing you are. One day is never truly enough! Love you always 🤗🤗🤗 pic.twitter.com/92aqNPmUQR — Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2022 చదవండి: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం -
బిడ్డకు జన్మనిచ్చి తల్లి అనంతలోకాలకు..
ప్రేమ వివాహం చేసుకుని తొలిసారి గర్భం దాల్చిన ఆమె ఎన్నో కలలు కంది. నెలలు నిండే కొద్దీ ఆమె మధురోహల్లో తేలిపోయింది.అనుకున్నట్లే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే విధి చిన్నచూపు చూసింది. బిడ్డకు పాలు పట్టిన కొన్ని క్షణాలకే కన్నుమూసింది. పెరిందేశంలో విషాదం కేవీబీపురం: మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన సుమిత్ర (19), గోపాల్ (22) గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమిత్ర గర్భం దాల్చడంతో గోపా ల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నెలలు నిండి గురువారం తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి శిశువును వెలికితీశారు. బలహీనంగా ఉన్నప్పటికీ సుమిత్ర బిడ్డను చూడగానే మోములో ఆనందం తొంగిచూసింది. మాతృత్వపు మధురిమల నడుమ బిడ్డకు తొలిసారి పాలు పట్టించింది. అయితే బలహీనంగా ఉండటమో, రక్తహీనత కారణమోగానీ ఆ తల్లి కొన్ని క్షణాలకే కన్నుమూసింది. కలలో కూడా ఊహించని ఈ హఠాత్ పరిమాణానికి గోపాల్‌కు ఒక్కసారిగా మిన్ను విరిగి మీద పడినట్లైంది. ఓ వైపు పురిటి బిడ్డ..మరో వైపు విగతజీవిగా సుమిత్రను చూసి గోపాల్ గుండె సంద్రమైంది. పొగిలి..పొగిలి ఏడుస్తున్న అతడిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చూపరులను సైతం కంటతడి పెట్టించింది. అంబులెన్సులో స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. మరోవైపు ఆకలితో పురిటిబిడ్డ ఏడుపు అందుకుంది. గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమైంది. తల్లి పాల కోసం పురిటి బిడ్డ ఏడుపు, గోపాల్ రోదన నడుమ శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు ఆ పసికందుకు నానమ్మే అమ్మ అయ్యింది. పోతపాలు పట్టిస్తోంది. -
కూతురి వెంటే తల్లి..
టెక్కలి (శ్రీకాకుళం): గుండెల నిండా మాతృప్రేమ నింపుకున్న అమృత మూర్తి ఆ తల్లి.. అక్క మరణించడంతో ఆమె పిల్లల కోసం బావను పెళ్లాడి, వారిని ఒకింటి వాళ్లను చేసింది.. ప్రభుత్వ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తన కూతురిపై ఆశలు పెట్టుకొని బతుకుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్లో కుమార్తె మరణించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె బుధవారం ఉదయం గుండె ఆగి మరణించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ పరిధి మెట్ట పేట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తన అక్క ఆకస్మికంగా మరణించడంతో గుంట అరుణ (35) అక్క భర్తను పెళ్లి చేసుకుంది. బావ సరిగా చూడనప్పటికీ తల్లి మరణంతో దిక్కు లేకుండా ఉన్న ఇద్దరు ఆడ పిల్లలను పెంచి పెద్ద చేసింది. కూలి పనులు చేసుకుంటూ వారిద్దరికీపెళ్లిళ్లు చేసింది. అలాగే తనకు జన్మించిన కుమార్తెను ఉన్నత స్థితిలో చూడాలని పాతపట్నం మోడల్ స్కూల్లో చదివిస్తోంది. పద్నాలుగేళ్ల కూతురు పూర్ణ సోమవారం హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మృతిని తట్టుకోలేక అరుణ దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. రెండు రోజులుగా పచ్చి మంచినీళ్లు తీసుకోకుండా కంటి మీద కునుకు లేకుండా గడిపింది. మంగళవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రించిన తరువాత ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది. బుధవారం అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆమెను వైద్యం చేస్తుండగా మృతి చెందింది. హృద్రోగంతో చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
చిత్రహింసలు పెట్టి తల్లిని చంపాడు
దుబాయ్: భార్యతో కలసి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి తన సొంత తల్లినే చిత్రహింసలు పెట్టి చావుకు కారణమైన ఘటన దుబాయ్‌లో జరిగింది. చనిపోయేనాటికి తల్లి బరువు కేవలం 29 కేజీలు అని వైద్యులు వెల్లడించారు. తిండిపెట్టకుండా కడుపు మాడ్చి, శారీరకంగా హింసించడంతో ఆమె పక్కటెముకలు విరగడంతో అంతర్గత రక్తస్రావంతో ఆమె మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. ఆమె కంటి రెటీనాను పెరికివేయడంతో పాటు మరో కంటికి కూడా గాయం చేసినట్లు కోర్టు తెలిపిందని బుధవారం ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. 2018 జూలై నుంచి అక్టోబర్ వరకూ ఈ హింస కొనసాగినట్లుగా అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
అమ్మా.. నను చూడకుండానే కనుమూశావా..
అమ్మా.. నవమాసాలునను కంటికి రెప్పలాకాపాడుకున్నావు.. ననుఈ ప్రపంచానికి పరిచయంచేశావు... నీవు మాత్రంనాతో బంధాన్ని తెంపుకొన్నావు... నను చూడకుండానే కనుమూశావాతల్లీ.. నేనేపాపం చేశానని..వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నీ ఆలన, పాలన,అనురాగం, ప్రేమకుదూరం అయ్యానా...!వైద్యుల నిర్లక్ష్యంతోనిండుచూలాలుమృతిచెందిన ఘటనగాలివీడు మండలంసీసీపల్లె గ్రామం కడపవాండ్లపల్లె దళితవాడలోశుక్రవారం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా , గాలివీడు : మండల పరిధిలోని సీసీపల్లె గ్రామం కడపవాండ్లపల్లె హరిజవాడకు చెందిన బాలిపోగు రామకృష్ణ భార్య చంద్రకళ(29) సరైన వైద్యం అందక మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి... చంద్రకళ గర్భందాల్చినప్పటి నుంచి నూలివీడు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సూచనలు, సలహాలు తీసుకుంటోంది. ఆరు మాసాలు గడిచిన తరువాత రక్త హీనతతో ఉన్న విషయం వైద్యులకు తెలిసినప్పటికి మృతురాలికి రక్తం పెంచేందుకు చర్యలు తీసుకోలేదు. కాగా శుక్రవారానికి చంద్రకళకు తొమ్మిది నెలలు పూర్తవ్వడంతో పురిటి నొప్పులతో బాధపడుతుండా మధ్యాహ్నం ఆటో సహాయంతో నూలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో సిబ్బందితో వైద్యం అందిస్తున్న క్రమంలో చంద్రకళ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండవ బిడ్డ జన్మించే సమయంలో వైద్యం వికటించి మృతి చెందింది. కాగా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చంద్రకళ మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇకనైనా ఇలాంటి అత్యవసర కేసుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా జిల్లాస్థాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చంద్రకళ వైద్యం వికటించి మృతి చెందడం దురదృష్టకరమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. చంద్రకళ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆయనతోపాటు మాజీ జెడ్పీటీసీ జల్లా సుదర్శన్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు యదుభూషణ్‌రెడ్డి, గ్రామ నాయకులు కృష్ణారెడ్డిలు మృతదేహానికి సంతాపం తెలిపారు. -
మరో మాతృ మరణం
హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో మాతృమరణాలు ఆగడం లేదు. ప్రసవాలపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. అత్యవసర కేసులకు మెరుగైన వైద్యం అందకపోవడం వల్లే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లా ఆస్పత్రి అని గొప్పగా చెప్పుకోవడమే కానీ వైద్యం ఆ స్థాయిలో అందడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం, హిందూపురం అర్బన్: ప్రసవానంతరం తీవ్ర కడుపునొప్పి రావడంతో బాలింత మృతి చెందింది. హిందూపురం ప్రభుత్వాస్పత్రి వైద్యులు, నర్సుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన సుభాషిణి (24) గర్భిణి. నెలలు నిండటంతో పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో కుటుంబ సభ్యులు శనివారం పరిగి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి ఉమ్మనీరు పోతోందని గుర్తించి, వెంటనే హిందూపురం తీసుకెళ్లాలని సూచించారు. 108 వాహనం ఎంతసేపటికీ రాకపోవడంతో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆటోలో హిందూçపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం.. శనివారం సాయంత్రం వరకు వైద్యులు పట్టించుకోలేదు. ఐదు గంటల సమయంలో బయట స్కానింగ్ చేయించుకురమ్మన్నారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రయివేట్ సెంటర్లో స్కానింగ్ చేయించుకుని తీసుకొచ్చారు. రాత్రి 7.45 వరకు వైద్యులు స్పందించి రక్తపరీక్షలు చేయించాలని బయటి నుంచి ల్యాబ్ వారిని పిలిపించారు. నొప్పులతో విలవిలలాడిపోతున్నా పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీశారు. దీంతో వారు అప్పుడు సిజేరియన్ చేయడంతో సుభాషిణి పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆదివారం ఉదయం నుంచి కడుపునొప్పిగా ఉందని నర్సులకు చెబితే మ«ధ్యాహ్నం ఒక ఇంజెక్షన్ వేశారు. అయినా అలాగే ఉందని చెప్పడంతో మరోనర్సు మూడు ఇంజెక్షన్లు వేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంకో ఆరు ఇంజెక్షన్లు ఇచ్చారు. అప్పటికీ కడుపునొప్పి భరించలేకపోతున్నానని సుభాషిణి చెప్పడంతో 108 వాహనాన్ని పిలిపించి అనంతపురానికి రెఫర్ చేశారు. హిందూపురం దాటేలోపే సుభాషిణి ఊపిరి ఆగిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోండి బాలింత మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, పైడేటి గ్రామస్తులు హిందూపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులు రాకుండా నర్సులతోనే ఇంజెక్షన్లు వేయిస్తూ సరైన వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందని సుభాషిణి భర్త అనిల్‌కుమార్ ఆరోపించాడు. ఆదివారం అయితే డాక్టర్లు డ్యూటీకి రారా.. అలాంటప్పుడు ‘సెలవు’ బోర్డు పెట్టొచ్చు కదా అంటూ ఆగ్రహించాడు. వైద్యులు డ్యూటీలో లేకుండా ఏం చేస్తున్నారంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులును నిలదీశారు. వైద్యం చేయలేనపుడు ఇక్కడ ఇంత పెద్ద ఆస్పత్రి ఎందుకంటూ మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామపెద్దలకు సీఐలు చిన్నగోవిందు, తమీం అçహ్మద్, వెంకటేశులు నచ్చజెప్పి శాంతింపజేశారు. బాధితులు చివరకు సూపరింటెండెంట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
మాతృమరణాలు తగ్గవా?
సాక్షి, విశాఖపట్నం: ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా మీరు..? మాతృమరణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు..? అంటూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వైద్య ఆరోగ్యశాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో మాతృమరణాలపై సమీక్షించారు. గత క్వార్టర్లీ సమావేశంలో 12 మాతృమరణాలు సంభవిస్తేనే చాలా ఎక్కువని భావించామని, కానీ ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 16 మరణాలు చోటుచేసుకున్నాయంటే ఏం అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. మాతృమరణాల ప్రాంతాల మెడికల్ ఆఫీసర్లు, ఎఎన్ఎంలు, ఆశావర్గర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. పునరావృతం కాకుండా చూడాలన్నారు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరం మేరకు మందులు, పౌష్టికాహారం అందించేలా చూడాలన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రుల్లో చేర్పించాలన్నారు. హెచ్‌బీ, బీపీ, తదితర పరీక్షలను నిర్వహించాలన్నారు. ఏజెన్సీలో సరైన రోడ్డు సౌకర్యం లేక వాహనాలు అందుబాటులో లేక గర్భిణులు, బాలింతలు నడిచి వెళ్లడం వంటి కారణాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వైద్యాధికారులు వివరించగా కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులను ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేర్చించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లలో హైబీపీ, హైపోథైరాయిడ్, గుండె సంబంధిత సమస్యల వల్ల 16 మాతృ మరణాలు సంభవించాయన్నారు. మాతృమరణాలు తగ్గించేందుకు పీహెచ్‌సీల పరిధిలో ప్రత్యేక వైద్యాధికారులతో శిక్షిణ ఇస్తామన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ నాయక్, జిల్లా వైద్యాధికారులు, ఎఎన్ఎంలు పాల్గొన్నారు. -
బిడ్డకు జన్మనిచ్చి..
గుంటూరు మెడికల్: నవమాసాలు బిడ్డను కడుపులో మోసి జన్మనిచ్చే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక ఎందరో తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాన్పు సమయాల్లో సంభవించే మాతృమరణాలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది జిల్లాకు కోట్లాది రూపాయలు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా విడుదల చేస్తున్నాయి. ఆ నిధులను వినియోగించడంలో అధికారులకు చిత్తశుద్ధి కొరవడి తల్లుల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. సంభవిస్తున్న మరణాలు జిల్లా వ్యాప్తంగా 2014–15 సంవత్సరంలో 66 మంది తల్లులు ప్రసవ సమయంలో కన్నుమూశారు. 2015–16 సంవత్సరంలో 62 మంది , 2016–17 సంవత్సరంలో 57 మంది, 2017–18లో 54 మంది తల్లులు చనిపోయారు. అయితే ఈ మాతృమరణాల్లో సగానికి పైగా మరణాలు నివారించదగినవేనని సాక్షాత్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగే తల్లుల మరణాల ఆడిట్ సమావేశంలో వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మాతృమరణాలను నివారించేందుకు ముందస్తుగానే వైద్య సిబ్బంది వైద్యాధికారులు ప్రణాళికాబద్ధంగా రూప కల్పన చేయాల్సి ఉంది. సరిపడా రక్తపు నిల్వలు అందుబాటులో ఉండే విధంగా కాన్పు చేసే సౌకర్యాలు ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలి. ఇంటి నుంచి ఆస్పత్రికి కాన్పు కోసం తరలించేందుకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చూసుకోవాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపైనే ఉంది. ఇలా ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడం, కిందిస్థాయి సిబ్బందికి కాన్పులపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ప్రతి ఏడాది మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. జీజీహెచ్‌లోనూ ఇదే తంతు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్న అరకొర సిబ్బంది వైద్యంపై పూర్తి అవగాహన లేకపోవడంతో చివరి వరకు కాన్పు కోసం గర్భిణులను ఉంచి చిట్టచివరి సమయంలో గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. జీజీహెచ్‌లో 24 గంటలు కాన్పుల విభాగంలో వైద్య సేవలు లభిస్తున్నప్పటికీ కొన్ని మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రతినెలా మూడు మాతృమరణాలు జీజీహెచ్‌లో సైతం నమోదవుతున్నాయి. 2018 జనవరిలో ఇద్దరు, ఫిబ్రవరిలో ఇద్దరు, మార్చిలో ఆరుగురు, ఏప్రిల్‌లో ముగ్గురు తల్లులు మరణించారు. ఆరోగ్య కేంద్రాల అధికారులకు, జీజీహెచ్ అధికారులకు మధ్య సమన్వయలోపంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. నివారణ చర్యలు తీసుకుంటున్నాం మాతృమరణాల నివారణ కోసం ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్షలు నిర్వహించి సూచనలు, ఆదేశాలు ఇస్తున్నాం. ప్రతి గర్భిణీని 12 వారాలలోపే గుర్తించి పేరు నమోదు చేసి, హైరిస్క్ ప్రెగ్నెన్సీ వారిని గుర్తించి కాన్పు కోసం పెద్దాస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. ప్రతినెలా 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం ద్వారా గర్భిణులకు ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తున్నాం. పోషకాహారం కోసం రూ.6 వేలు అందిస్తున్నాం. ఆరోగ్య కేంద్రాల్లో ప్రసూతి కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం.–డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
తల్లి మరణం జీర్ణించుకోలేక..
సాలూరు: పట్టణంలోని బంగారమ్మ కాలనీకి చెందిన చెలపరెడ్డి లక్ష్మి(16) మంగళవారం రాత్రి తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక సత్యసాయి జూనియర్ కళాశాలలో ఇంటర్(బైపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతూ పరీక్షలు రాస్తున్న ఆమె ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరివేసుకున్నట్లు పట్టణ ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు. మూడు నెలల కిందట లక్ష్మి తల్లి కామేశ్వరి జ్వరంతో చనిపోయింది. అప్పటి నుంచి లక్ష్మి ముభావంగా ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. లక్ష్మి కొద్ది రోజు లుగా జ్వరంతో బాధపడుతోందని, ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేధనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు. -
మరణించిన అమ్మను మళ్లీ చూసుకున్నాడు
మాతృమూర్తి భౌతికంగా దూరమై సరిగ్గా ఏడాది కాలం..చిత్రపటాలు, అమ్మ పంచిన అమృతమంటి ప్రేమ మాత్రమే ఆమె జ్ఞాపకాలు.. అప్పుడప్పుడు అమ్మ పంచిన ఆప్యాయతలే తలపులు..ఇవీ ఆ కుమారుడికి మిగిలింది. అయితే ఉన్నట్టుండి ఆయనకో తియ్యని కబురు వచ్చింది తమ తల్లి భౌతికకాయం కాటూరు వైద్య కళాశాల్లో కనిపించిందని. ఆ మాట చెప్పిన వెంటనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే కళాశాలకు వెళ్లి మాతృమూర్తి భౌతికకాయాన్ని మనసారా చూసుకున్నాడు ఆమె పంచిన ప్రేమ మదిలో మెదలగా చెమర్చిన కళ్లు తుడుచుకుంటూ. యడ్లపాడు(చిలకలూరిపేట): తల్లి మృతి చెందిన ఏడాది తర్వాత ఆమె భౌతికకాయాన్ని కుమారులు తిరిగి చూసుకోగలిగారు. యడ్లపాడు ఎర్రచెరువులో ఉంటున్న కేతు వెంకాయమ్మ (85) అనారోగ్యంతో గతేడాది డిసెంబర్ 20న మృతి చెందింది. ఆమె మరణానంతరం కుమారుడు రామబ్రహ్మం మృతదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం కాటూరి మెడికల్ కళాశాలకు అప్పగించారు. ప్రదర్శనల వల్ల తల్లిని చూడగలిగారు... కాటూరి వైద్యశాలలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అక్కడకు వెళ్లిన అనేక మంది రామబ్రహ్మం తల్లి భౌతికకాయాన్ని చూసి గుర్తు పట్టారు. వెంటనే కొడుకు రామబ్రహ్మంకు చెప్పడంతో మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి తల్లి భౌతికకాయాన్ని చూసుకున్నారు. ఆనందంతో తల్లి ప్రేమను మరొక్కసారి గుర్తు చేసుకున్నారు. -
కూతురు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
కూతురు మృతిపై పలు అనుమానాలు కార్వేటినగరం : మండలంలోని అన్నూరు పంచాయతీ శెట్టిగుంట ఎస్టీ కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందింది. కూతురి మరణాన్ని చూసి తట్టుకోలేక తల్లి కుప్పకూలింది. తల్లీ కూతురు ఒకేసారి తనువు చాలించడంతో శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం అలుముకుంది. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని శెట్టిగుంట ఎస్టీకాలనీకి చెందిన పి. శ్రీనివాసులు భార్య పి.రోజా(24) స్థానిక అంగన్వాడి కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. శ్రీనివాసులు శనివారం రాత్రి కూలి పనుల నుంచి వచ్చాడు. ఈ క్రమంలో భార్య స్పృహతప్పి పడి ఉండడాన్ని గుర్తించి ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. ఇదిలా ఉండగా రోజా ప్రతి రోజూ అంగ్వాడీ కేంద్రానికి పిల్లలను తీసుకెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెలకొన్న ట్టు కాలనీలో పుకార్లు వచ్చాయి. దీంతో బాలాజీ భార్య ద్రాక్షాయణి శనివారం రాత్రి బంధువులతో కలిసి రోజాపై దాడి చేసింది. దీన్ని అవమానంగా భావించిన రోజా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. రోజా ను చితకబాదడంతోనే మృతి చెందిన ట్లు పలువురు ఆరోపిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం కూతురు రోజాపై దాడి చేసినట్టు శ్రీరంగరాజపురం మండలంలోని పిళ్లారికుప్పం ఎస్టీకాలనీలో ఉన్న రోజా తల్లి కుప్పమ్మకు తెలిసింది. ఆమె వెంటనే శెట్టిగుంటకు వచ్చింది. చనిపోయిన రోజాను చూసి రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను చికిత్సకోసం తిరుపతికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనతో ఎస్టీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి మరణంతో గుండెపగిలి....
రంగారెడ్డి(చేవెళ్ల): గోరు ముద్దలు తినిపించి అల్లారుముద్దుగా పెంచిన తల్లి కాలధర్మం చేసి చనిపోతే అప్పటివరకు తల్లే దైవంగా జీవించిన కొడుకు కూడా తల్లి దారినే నడిచి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ హృదయవిదారక సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సింగప్పగూడెంలో మంగళవారం రాత్రి జరిగింది. గ్రామానకి చెందిన కల్లెంల గాలెమ్మ(75) రెండు రోజుల కిందటే అనారోగ్యంతో మృతిచెందింది. మంగళవారం ఆమే అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన ఆమె కొడుకు కల్లెంట నారాయణ(55) గుండెపోటుతో మృతిచెందాడు. రెండురోజుల్లో రెండు చావులు చూసిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. -
తల్లి మరణం తట్టుకోలేక కూతురు మృతి
చింతపల్లి: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కూతురు తట్టుకోలేక‘పోయింది’. కళ్లెదుటే విగతజీవిగా పడి ఉన్న మాతృమూర్తి మృతదేహంపై పడి తనూ కూడా ప్రాణాలొదిలింది.. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లిలో గురువారం చోటు చేసుకుంది. చక్కని బక్కమ్మ(80)కు ఇద్దరు కుమారులు, కూతురు అంజమ్మ (60) ఉన్నారు. బక్కమ్మ తన పెద్ద కుమారుడు అంజయ్య వద్ద ఉంటోంది. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బక్కమ్మ గురువారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న అంజమ్మ.. తల్లి అంత్యక్రియలలో పాల్గొనేందుకు అత్తింటి నుంచి స్వగ్రామానికి వచ్చింది. తల్లి మృతదేహంపై పడి బోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది.