
మృతురాలు చెలపరెడ్డి లక్ష్మి
సాలూరు: పట్టణంలోని బంగారమ్మ కాలనీకి చెందిన చెలపరెడ్డి లక్ష్మి(16) మంగళవారం రాత్రి తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక సత్యసాయి జూనియర్ కళాశాలలో ఇంటర్(బైపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతూ పరీక్షలు రాస్తున్న ఆమె ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరివేసుకున్నట్లు పట్టణ ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు. మూడు నెలల కిందట లక్ష్మి తల్లి కామేశ్వరి జ్వరంతో చనిపోయింది. అప్పటి నుంచి లక్ష్మి ముభావంగా ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. లక్ష్మి కొద్ది రోజు లుగా జ్వరంతో బాధపడుతోందని, ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేధనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment