Daughter suicide
-
తండ్రి మరణం ..నదిలో దూకిన కూతురు
-
తండ్రి మరణం తట్టుకోలేక..
రామగుండంక్రైం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకి గల్లంతయింది. గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన ఆరవెల్లి వసంతం ద్విచక్రవాహనంపై వెళ్తూ సోమవారం జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద గేదెలు అడ్డురావడంతో బైక్ పైనుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో వసంతం మృతదేహాన్ని చెన్నూరుకు వాహనంలో తరలిస్తుండగా, కుటుంబ సభ్యులంతా కారులో ప్రయాణిస్తున్నారు. గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకోగానే మృతుడి కూతురు సాయిప్రియ (32) వాంతులు వస్తున్నాయని చెప్పడంతో కారుని డ్రైవర్ నిలిపివేశాడు. వెంటనే కిందకు దిగిన సాయిప్రియ కుటుంబ సభ్యులు చూస్తుండగానే హఠాత్తుగా బ్రిడ్జి పైనుంచి నదిలో దూకి గల్లంతయింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆమె గల్లంతు కావడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. రివర్ పోలీసులు గమనించి తాడు సాయంతో ప్రయత్నించినా నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో అప్పటికే ఆమె మునిగిపోయింది. రోధిస్తున్న కుటుంబసభ్యులు వసంతం మృతదేహంతో చెన్నూరు వెళ్లిపోయారు. గాలింపు చర్యలు గోదావరి నదిలోని నీటిలో దూకి గల్లంతైన సాయిప్రియ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శవంపైకి తేలితే తప్ప చేసేదేమి లేదని పేర్కొంటున్నారు. నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు అనుకూలంగా లేదని పోలీసులు తెలిపారు. కా గా సాయిప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీగా పనిచేస్తోంది. ఘటనపై గోదావరిఖని టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
తల్లి మరణం జీర్ణించుకోలేక..
సాలూరు: పట్టణంలోని బంగారమ్మ కాలనీకి చెందిన చెలపరెడ్డి లక్ష్మి(16) మంగళవారం రాత్రి తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక సత్యసాయి జూనియర్ కళాశాలలో ఇంటర్(బైపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతూ పరీక్షలు రాస్తున్న ఆమె ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరివేసుకున్నట్లు పట్టణ ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు. మూడు నెలల కిందట లక్ష్మి తల్లి కామేశ్వరి జ్వరంతో చనిపోయింది. అప్పటి నుంచి లక్ష్మి ముభావంగా ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. లక్ష్మి కొద్ది రోజు లుగా జ్వరంతో బాధపడుతోందని, ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేధనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు. -
బతుకు భారమై..
⇔ ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకూతుళ్లు ⇔ మృతి చెందిన కుమార్తె అపస్మారక స్థితిలో తల్లి ⇔ అయిన వారు ఉన్నా అనాథలుగా బతకలేక ఆత్మహత్యా ⇔ బాధితుల వద్ద సూసైడ్ నోట్లు? పదో తరగతిలో గ్రామానికే టాపర్‌గా నిలిచిన ఆ యువతి నిజ జీవిత పాఠాలు మాత్రం నేర్చుకోలేకపోయింది. ప్రాణాలు పోయేంత ప్రసవ వేదనను అనుభవించి ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చిన ఆ తల్లి ఆ తర్వాతి కష్టాలకు మౌనంగా తల వంచింది. ఆర్థిక సమస్యలకు సమాధానాలు వెతకలేక, ఎదురవుతున్న కష్టాలను భరించలేక, కుటుంబ సమస్యలను ఇంకా మోసే సత్తువ లేక సంతకవిటి మండలం గోళ్లవలసకు చెందిన తల్లీకూతుళ్లు చావడానికి సిద్ధమైపోయారు. రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనలో కుమార్తె పావని కన్నుమూయగా, తల్లి భాగ్యలత అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. శ్రీకాకుళం జిల్లా : భర్త ఎడబాటును ఐదేళ్ల పాటు తట్టుకున్న భాగ్యలత ఆ భారాన్ని మరి మోయలేకపోయిం ది. తండ్రి ఉన్నా ఆ ఆప్యాయత పొందలేని పా వని కూడా తల్లికి తోడుగా నిలవాలని చావుకు సిద్ధమైంది. పొందూరు రైల్వేస్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లీకూతుళ్ల కథ స్థాని కులకు కన్నీళ్లు తెప్పించింది. ఇలా జరిగింది పొందూరు రైల్వే స్టేషన్. సమయం మధ్యాహ్నం 2.30 గంటలు. పొందూరు రైల్వే స్టేషన్ నుంచి వాండ్రంకి రైల్వే క్రాస్ గేటువైపు రైలు పట్టాలు పక్కగా భాగ్యలత, పావనిలు నడుచుకుంటూ వ చ్చారు. ఇంతలో ఎదురుగా విశాఖ నుంచి పలాస వైపు గూడ్సు వచ్చింది. అప్పటికే చావుకు సిద్ధపడిపోయిన తల్లీకూతుళ్లు ఆ రైలుకు ఎదురెళ్లారు. ఘటనలో పావని అక్కడికక్కడే మృతి చెందగా తల్లి భాగ్యలతకు తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాకు పనుల్లో ఉన్న గార్డులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరి అపస్మారక స్థితిలో ఉన్న భాగ్యలతను పొందూరు 108 సాయంతో శ్రీ కాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రికి ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడంతో పాటు పోస్టుమార్టం కోసం పావని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అండ లేదనేనా..? భాగ్యలతకు సంతకవిటి మండలం గోళ్లవలసకు చెందిన వెంపటాపు కామినాయుడుతో 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భాగ్యలత కన్నవారి ఊరు బూర్జ మండలం పెదలంకాం గ్రామం. వివాహం త ర్వాత సోదరుడు నీలకంఠం కూడా భాగ్యలతతోనే ఉండేవారు. ఐదేళ్ల కిందటి వరకు భాగ్యలత కాపురంలో ఎలాంటి సమస్యా లేదు. సొంతిళ్లు కూడా కట్టుకుని, ఇద్దరు ఆడపిల్లలను చదివించుకుని హాయిగా జీవించారు. ఆ తరుణంలో భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్థలు మొదలయ్యాయి. అవి కాస్తా పెద్దవిగా మారాయి. దీంతో తన సోదరుడిని కూడా భాగ్యలత వదులుకుంది. అప్పటి వరకు సోదరి బా వలతో కలిసి ఉన్న నీలకంఠం ఐదేళ్ల కిందటి నుంచి రాజాం లో ఉంటున్నారు. ఆ తర్వాత కూడా దంపతుల మధ్య సమస్యలు సద్దుమణగలేదు. ఆఖరకు ఈ వివాదాలు రాజాం, సంతకవిటి పోలీస్ స్టేషన్ల వరకు చేరాయి. ఆ సమయంలో భాగ్యలత పలుమార్లు ఆత్మహత్యాయత్నాలు కూడా చేశా రు. పిల్లలు పెరుగుతున్నా తల్లిదండ్రుల్లో అన్యోన్యత పెరగలేదు. చివరకు పెద్దలు కలుగుజేసుకుని భార్యభర్తలను కలి పి తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించారు. దీంతో భా ర్యాభర్తలిద్దరూ ఒకే ఊరిలో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నా రు. వీరి ఇద్దరు ఆడపిల్లలు తల్లి భాగ్యలత వద్దే ఉంటున్నారు. పెద్దమ్మాయి గాయత్రి ఏడాది కిందట పదో తరగతిలో ఉత్తీర్ణత చెంది బూర్జ మండలం ఓవీపేటలో మోడల్ స్కూల్లో చేరి ఇంటర్ చదువుతోంది. ఇదే మండలం వాసుదేవపట్నంలో కస్తూర్బా పాఠశాలలో చదువుకున్న చిన్నమ్మా యి పావని కూడా ఈ యేడు 8.7 జీపీఏ మార్కులు సాధించింది. పావని ఆటల్లోనూ మేటిగా రాణించేది. స్పోర్ట్స్ స్కూల్లో చేరాలని ప్రయత్నిస్తూనే సోదరి చదువుతున్న మెడల్ స్కూల్లో చేరింది. అంతా సాఫీగానే సాగుతోందన్న తరుణంలో ఇలా తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పా ల్పడి అయిన వారికి కన్నీళ్లు మిగిల్చారు. ఆస్తి వివాదమేనా? ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భాగ్యలత, ఆమె భర్త కామినాయుడు ఒకే ఊరిలో ఉంటున్నా వేర్వేరుగా నివసిస్తున్నారు. పిల్లల చదువులు సమయంలో పాఠశాల వద్ద క లుస్తుంటారు. అంతవరకే వీరి బాధ్యత. వీరిద్దరి మధ్య వి వాదాన్ని గ్రామస్తులు, బంధువులు సెటిల్ చేసి భాగ్యలతకు ప్రతి నెల పోషణ ఖర్చులు ఆమె భర్త ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికైనా వీరు కలుస్తారని భావించారు. అయితే పరిస్థితి మారలేదు. ఇటీవల భాగ్యలత భర్త కామినాయుడు తన ఆస్తులను విక్రయానికి సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్నే భాగ్యలత అడిగినా ఫలితం లేకపోయినా భవిష్యత్‌పై భయంతో ఆమె ఈ దుశ్చర్యకు పా ల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. జ్వరంతో పెద్దమ్మాయి.. భాగ్యలత పెద్ద కూతురు గాయత్రి ఎప్పుడూ అమ్మను వీడి ఉండలేదు. కానీ ఆదివారం ఆమెకు జ్వరంగా ఉండడంతో ఆమె ఇంటి వద్దే ఉండిపోయింది. అమ్మ, చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం తెలిసి ఆమె షాకైంది. సోదరి చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ కాగితాలు ఏమిటో? ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకూతుళ్ల వద్ద పలు కాగితాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అవి సూసైట్ నోట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ కాగితాలపై పూర్తిగా ఆరా తీసి సూసైడ్ నోట్లైతే వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపనున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన భాగ్యలతను శ్రీకాకుళం రిమ్స్‌లో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆదివారం రాత్రినాటికి ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
అమ్మానాన్నా.. నేనూ వస్తున్నా...
గుండెలు పిండే విషాదం * నాలుగురోజుల కిందటరోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల దుర్మరణం * దిగులుతో కుమార్తె ఆత్మహత్య * అనాథలైన ఇద్దరు తమ్ముళ్లు నవ మాసాలు మోసారు.. కంటికి రెప్పలా కాపాడారు.. ఓ ఇంటిదాన్ని చేశారు.. జీవితాంతం తోడూనీడగా ఉంటాడనుకున్న వాడు తాళిని ఎగతాళి చేసి వదిలేస్తే.. మీరే అండయ్యారు. మీరే సర్వస్వమయ్యారు.. ఊపిరయ్యారు.. కనిపెంచిన మీరే కనిపించే దేవతలయ్యారు. నాకు బాగో లేదంటే చూపిద్దామని ఆస్పత్రికి పిల్చుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో వెళ్లిపోయారు. మమ్మల్ని అనాథలను చేసి విగతజీవులుగా మారిపోయారు. మీరు లేని ఈ లోకంలో ఉండలేక.. నేనూ మీ చెంతకే వస్తున్నానమ్మా. యాడికి మండలం పచ్చారుమేకలపల్లికి చెందిన ఈశ్వరమ్మ, ఓబులేసు దంపతుల కుమార్తె గాయత్రి(20) సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆస్పత్రిలో కోలుకోలేక మంగళవారం మృత్యుఒడికి చేరింది. నాలుగు రోజుల కిందట ఆమె తల్లిదండ్రులు ఇదే మండలం వేములపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అమ్మానాన్న లేరన్న దిగులు ఓ వైపు, మరోవైపు అనారోగ్యం, ఇంకోవైపు ఇద్దరు తమ్ముళ్లను ఎలా పెంచాలోనన్న భయం.. ఆమెను ఆత్మహత్యకు కారణమయ్యాయి. భర్త నిరాదరణకు గురై...: వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం సోమలూరుకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట గాయత్రి వివాహమైంది. మనస్పర్ధల కారణంగా పెళ్లైన నెలకే ఆమె పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు అమ్మానాన్నతో పాటు ఇద్దరు తమ్ముళ్లు చక్కగా చూసుకునేవారు. మాయదారి కామెర్లు సోకి..: ఇటీవలే గాయత్రికి పచ్చకామెర్లు సోకాయి. ఆమెకు చికిత్స చేయిద్దామని ఈశ్వరమ్మ, ఓబులేసు ఓ బైక్‌లో, గాయత్రి, మరో బంధువు మరో బైక్‌లో తాడిపత్రి ఆస్పత్రికి నాలుగు రోజుల కిందట బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయిల్ ట్యాంకర్ విపరీతమైన వేగంతో వచ్చి ఢీకొనడంతో ఈశ్వరమ్మ, ఓబులేసు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. దీంతో వారి పిల్లలు గాయత్రి సహా కుమారులు శివకుమార్, జగదీశ్ తల్లిదండ్రుల వద్ద విలపించిన తీరు అందరినీ కలచివేసింది. మేం ఎవరి కోసం బతకాలంటూ? గాయత్రి తమ తల్లి చెంపలను నిమురుతూ విలపించడాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. జీవితంపై దిగులుతో...: భర్త వదిలేశాడన్న ఆవేదనలో ఉన్న గాయత్రికి కొండంత అండగా ఉంటారనుకున్న అమ్మానాన్న అంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆమెను కుంగదీసింది. ఇద్దరు తమ్ముళ్ల బాధ్యత గుర్తుకు రావడంతో తట్టుకోలేకపోయింది. భవిష్యత్తు భయంకరంగా భావించిన ఆమె చివరకు సోమవారం రాత్రి విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బంధువులు ఆమెను తాడిపత్రికి అక్కడి నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయినా కోలుకోలేక మంగళవారం తనువు చాలించింది. అటు అమ్మానాన్న, ఇటు అక్కను పోగొట్టుకున్న శివకుమార్(ఇంటర్‌తో చదువు ఆపేశాడు), జగదీశ్(ప్రస్తుతం తొమ్మిదో తరగతి) ఇప్పుడు తమకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది. -
రైలు కిందపడి తల్లి, కూతురు మృతి
ప్రకాశం జిల్లా: మార్కాపురం రైల్వేస్టేషన్లో రైలు కింద పడి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఆత్మహత్యకు చేసుకున్న వారి వివరాలు తెలియలేదు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కూతురి ఆత్మహత్యకు ప్రతీకార హత్య
► ఛేదించిన పోలీసులు ► ముగ్గురి నిందితుల అరెస్టు ఎచ్చెర్ల : తన కూతురు ఆత్మహత్యకు ఓ కుటుంబం కారణం అని భావించాడు ఆ తండ్రి. ఆ కుటుంబంలో ఒకరిని హతమార్చాలనుకున్నాడు. అందుకు పథకం వేశాడు. అనుకున్నట్టుగా వల పన్ని హత్య చేయిండాడు. అంతేకాదు మృతదేహం సైతం కనిపించకుండా తగలబెట్టించాడు. పోలీసులు ఈ కేసును నాలుగురోజుల్లో చేధించారు. ఈనెల 15న పొందూరు మండలం ధర్మపురం-బురికంచారం సరిహద్దులో యువకుడిని హత్య చేసి తలబెట్టిన సంఘటనలోని నిందితులను గురువారం అరెస్టు చేశారు. ఆ నిందితులను మీడియా ముందు హాజరు పర్చిన శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావు నాయుడు హత్య వివరాలను వెల్లడించారు. ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసకి చెందిన పుండ్రోతు వెంకటరావు, పందిరపల్లి వెంకటరావు సమీప బంధువులు. పుండ్రోతు వెంకటరావు తన కుమార్తె చందును మేనళ్లుడు అశోక్‌తో వివాహం చేయాలనుకున్నాడు. అయితే ఈ సంబంధం జరక్కుండా పందిరపల్లి వెంకటరావు కుటుం బం.. చందుపై వ్యక్తిగత దుష్ర్పచారం చేసినట్టు పుండ్రోతు కుటుంబం ఆరోపణ. దుష్ర్పచారంతో మనస్థాపానికి గురైన చందు ఐదు నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా చందుకు తల్లిదండ్రులు, బంధువులు దహన సంస్కారాలు నిర్వహించారు. అప్పుడే పుండ్రోతు వెంకటరావు తన కుమార్తె ఆత్మహత్యకు కారణం అయిన పందిరపల్లి వెంకటరావు కుమారుడు భరత్(17)ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడైన కిల్లాన అప్పారావును హత్యకు సహకరించమని కోరాడు. అలాగే అప్పారావు దుక్కా కళ్యాణ చక్రవర్తి అనే వ్యక్తిని హత్యకు సహాయం తీసుకున్నాడు. పుండ్రోతు వెంకటరావు రూ.80 వేలు అప్పారావుకు ఇవ్వగా.. అప్పారావు కల్యాణ చక్రవర్తికి రూ.70వేలు ఇచ్చాడు. దీంతో కల్యాణ చక్రవర్తి సెకెండ్ హ్యాండ్ బైక్ కొని భరత్‌తో స్నేహం చేయటం ప్రారంభించాడు. భరత్ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో పాలిటెక్నిక్ డిప్లమా చేశాడు. మూడు నెలలుగా వీరు స్నేహం చేస్తూ ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. 15వ తేదీ సాయంత్రం కల్యాణ చక్రవర్తి బైక్‌పై భరత్‌ను తీసుకువెళ్లాడు. ఇద్దరూ చిలకపాలెం వైన్ షాప్‌లో మద్యం కొనుగోలు చేశారు. అనంతరం చిలకపాలెం వద్ద గల ఐచర్ కంపెనీ సమీపంలోకి వెళ్లి కల్యాణచక్రవర్తి..భరత్‌కు మద్యం తాగించాడు. తాను తాగుతున్నట్లు నటించి భరత్‌కు పూటుగా పట్టాడు. భరత్ అపస్మారక స్థితికి చేరుకున్నాక పీక నులిపి చంపేశాడు. అనంతరం పుండ్రోతు వెంకటరావు, కిల్లాన అప్పారావులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ సంఘటన జరగ్గా రాత్రి 11 గంటల సమీపంలో పుండ్రోతు వెంకటరావు తన ట్రాక్టర్ తీసుకుని వెళ్లి మృతదేహాన్ని అక్కడ నుంచి ధర్మపురం-బురిడి కంచరాం చెరకు తోటల్లోకి తీసుకువెళ్లారు. తోటల్లో మృతదేహంపై టైర్, గడ్డి, కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. అనంతరం ఎస్ఎంపురం సమీపంలో జీడిమామిడి తోటల్లో భరత్ సెల్‌ఫోన్, వారు ఉపయోగించిన హ్యాండ్ గ్లౌవ్స్, కిరోసిన్క్యాన్ తగల బెట్టారు. 16న హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కేసును ఛేందించిన పోలీసులు నిందితులు పుండ్రోతు వెంకటరావు, దుక్కా కల్యాణ చక్రవర్తి, కిల్లాన అప్పారావుపై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్, బైక్, రూ.32 వేలు నగదు, ఖాళీ మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారి సీఐ సాకేటి విజయ్‌కుమార్, ఎచ్చెర్ల,లావేరు, పొందూరు ఎస్సైలు పీవీబీ ఉదయ్‌కుమార్, అప్పారావు, ఆర్హెచ్ఎన్వీ కుమార్ పాల్గొన్నారు. కేసును ఇలా ఛేదించారు.. ఈ కేసును జేఆర్‌పురం సీఐ విజయకుమార్ దర్యాప్తు చేశారు. 15 వతేదీ ఉదయం నుంచి భరత్ కనిపించడంలేదని అతని తండ్రి ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కల్యాణ చక్రవర్తి తన కుమారుడుని బైక్‌పై తీసుకుని వెళ్లినట్టు పోలీసులకు తెలిపాడు. దీంతో సీఐ కణ్యాణ చక్రవర్తిని విచారించారు. దీంతో హత్య పథకం బట్టబయలైంది.