Australia Captain Pat Cummins Mother Maria Cummins Passed Away - Sakshi
Sakshi News home page

Pat Cummins: పాట్‌ కమిన్స్‌ తల్లి కన్నుమూత

Published Fri, Mar 10 2023 10:17 AM | Last Updated on Fri, Mar 10 2023 10:36 AM

Pat Cummins Mother Maria Cummins Dies Battle With Prolonged Cancer - Sakshi

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తల్లి మారియా కమిన్స్‌ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌ వేదికగా అధికారికంగా ద్రువీకరించింది. కొంతకాలంగా క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

''మారియా కమిన్స్‌ చనిపోవడం చాలా బాధాకారం. క్రికెట్‌ ఆస్ట్రేలియా తరపున పాట్‌ కమిన్స్‌, అతని కుటుంబసభ్యులకు మా ప్రగాడ సానభూతి. కమిన్స్‌ తల్లి మృతికి సంతాపంగా టీమిండియాతో నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్‌ క్రికెటర్లు నల్ల రిబ్బన్లతో(బ్లాక్‌ ఆర్మ్‌ బాండ్స్‌) బరిలోకి దిగుతారు.. '' అంటూ ట్వీట్‌ చేసింది. పాట్‌ కమిన్స్‌ తల్లి మృతిపై బీసీసీఐ సహా టీమిండియా ఆటగాళ్లు తమ సంతాపాన్ని ప్రకటించారు. ''ఈ విషాద సమయంలో ‍ కమిన్స్‌, అతని కుటుంబసభ్యులుకు మా సానుభూతి తెలియజేస్తున్నాం'' అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా తల్లి అనారోగ్యం కారణంగా పాట్‌ కమిన్స్‌ బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ముగియగానే స్వదేశానికి వెళ్లిపోయాడు. తల్లిని దగ్గరుండి చూసుకోవాలన్న అతని కోరికను మన్నించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా అంగీకరించింది. తన తల్లి మారియా చివరి రోజుల్లో పక్కనే ఉండాలని భావించిన కమిన్స్‌ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని ఇటీవలే పత్రికా ప్రకటనలో పేర్కొన్నాడు.  

చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement