
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు(శుక్రవారం) నిజామాబాద్ జిల్లా వేల్పూరుకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి అంత్యక్రియలకు కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం.
రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ తల్లి మంజులమ్మ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో పలువురు నేతలు ఆయనకు సానుభూతి తెలిపారు. ఆపై అంత్యక్రియల కోసం భౌతిక కాయాన్ని వేల్పూర్‌కు తరలించారు. అంతకు ముందు.. వేముల మాతృవియోగంపై సీఎంవో ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment