
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో గత వారం గల్లంతైన భారతీయ కుటుంబం మరణించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈల్ నదిలో గాలింపు చర్యలు జరుపుతున్న సహాయక బృందాలు.. కొన్ని వ్యక్తిగత వస్తువులను, వాహనం విడి భాగాలను గుర్తించారు. ఇవి భారతీయ కుటుంబానికి చెందినవిగా భావిస్తున్నారు. భారత సంతతికి చెందిన సందీప్ తొట్టపల్లి(41) యూనియన్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారిటా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
సందీప్ భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్(12), సాచీ(9)తో కలసి తమ హోండా పైలట్ కారులో రోడ్ ట్రిప్‌కు బయలుదేరారు. పోర్ట్ లాండ్‌లోని ఒరేగాన్ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌కు వెళుతుండగా ఈ నెల 5న వీరు కనిపించకుండా పోయారు. వీరి వాహనం ఏప్రిల్ 6 న ఉధృతంగా ప్రవహిస్తున్న ఈల్ నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు నదిలో విస్తృతంగా గాలించి హోండా వాహనానికి సంబంధించి కొన్ని విడి భాగాలను, అలాగే వ్యక్తిగత వస్తువులను గుర్తించగలిగామని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ సిబ్బంది వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment