విషాదంలో మరో భారతీయ కుటుంబం | Tragedy strikes Indian family in Oman | Sakshi
Sakshi News home page

విషాదంలో మరో భారతీయ కుటుంబం

Published Sat, Sep 20 2014 8:44 AM | Last Updated on Mon, Oct 22 2018 8:06 PM

Tragedy strikes Indian family in Oman

దుబాయి: దుబాయి ఒమన్ లోని మరో భారతీయ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. తండ్రి తన కూతురుతోపాటు వెళ్తున్న వాహానాన్ని ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనాదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. కాగా సెల్ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు ఎంతకు స్పందించలేదు. దాంతో ఫోన్ నెంబర్ ఆధారంగా చిరునామా సేకరించి... మృతుల ఇంటికి వెళ్లగా అక్కడ మృతుడి భార్య కూడా మృతి చెందిందని తెలిపారు.

ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మృతుడు సోహార్ స్టిల్ కంపెనీలో, అతడి భార్య ఎల్ అండ్ టీలతో పని చేస్తున్నారని తెలిపారు. వారి కుమార్తె స్థానిక భారతీయులకు చెందిన పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుందని పోలీసులు వెల్లడించారు. భారత్ లోని వారి బంధువులు వీరి మృతిపై సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement