L&T
-
‘మేడిగడ్డ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్ డ్యాం నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్మాణసంస్థ ఎల్అండ్టీ మళ్లీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనెల 17న రామగుండం సీఈకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను చుట్టుముట్టాయని, దీంతో తాము చేసిన పనులు దెబ్బతిన్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంతో తాము చేసిన పనులు వృథా అయ్యాయని చెప్పింది. ఇందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్లు (పిల్లర్లు), రాఫ్ట్ ఫౌండేషన్, కటాఫ్ వాల్స్, ససికెంట్ పైల్స్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉందని, పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్‌తోపాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్‌స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్‌లో కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉందని ఈ లేఖలో స్పష్టం చేసింది. ఈ పనులు వ్యయ ప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ప్రభుత్వం వాటికి మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొంది. గోదావరినదిలో కాపర్‌డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని, వర్క్అగ్రిమెంట్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మళ్లీ మొదటికొచ్చిన మేడిగడ్డ పనులు అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికొచ్చాయని ఎల్అండ్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్‌లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లు, వాటి రాఫ్ట్ ఫౌండేషన్‌తో సహా తొలగించేందుకు డైమండ్ కట్టింగ్ విధానం అనుసరించాలని నిర్ణయించారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్అండ్టీ అధికారులు తామే పునరుద్ధరిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్ 2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్అండ్టీ బాంబు పేల్చింది. ఈమేరకు రామగుండం ఈఎన్సీకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్ డ్యాం నిర్మాణానికికే రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్అండ్టీని బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం ఘాటుగా హెచ్చరించిన తర్వాత కూడా ఎల్అండ్టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని మరో లేఖ రాశారు. మళ్లీ ఒప్పందం చేసుకోండి మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాంతోపాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్ పునరుద్ధరణకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని ఆ లేఖలో స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్29నపూర్తయ్యిందని, దీంతో దెబ్బతిన్న బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానేకాదని అందులో పేర్కొన్నారు. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్అగ్రిమెంట్లో లేని పనులను తాము చేపట్టలేమని స్పష్టత ఇచ్చామని గుర్తు చేశారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్డిపార్ట్మెంట్నుంచి తమకు ఎలాంటి డిజైన్లు కూడా అందలేదని లేఖలో ప్రస్తావించారు. బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిన తర్వాత జరిగిన లోపాలను తాము సరి చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కాఫర్డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్చేసుకుంటే తప్ప తాము అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు. -
కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. సొంత ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మరోసారి నిరాకరించింది. నీటిపారు దల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు సి.మురళీ ధర్, బి.నాగేందర్ రావు, నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి ఎల్ అండ్ టీ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్వీ దేశాయ్ బృందంతో సమావేశమై బ్యారేజీ పునరు ద్ధరణపై చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో నాణ్యత లోపాలు ఎలా చోటుచేసుకున్నాయని మంత్రి ఎల్ అంట్ టీ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లేఖ రాసి బ్యారేజీ పునరుద్ధరణ నుంచి తప్పుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. 2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, ఒప్పందం ప్రకారం పని పూర్తయి నట్టు ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ లేఖ సైతం ఇచ్చారని ఎల్ అండ్ టీ బృందం వివరించింది. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ సైతం ముగిసిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని పేర్కొంది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మరుసటి రోజే బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమదేనని అంగీకరిస్తూ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్ విడుదల చేసిన ప్రకటనను నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మంత్రికి చూపించారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే స్థాయి కానీ, అధికారం కానీ సురేశ్‌కుమార్‌కు లేదని ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేశాయ్ చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో ఆయనపై ఒత్తిడి చేసి ప్రకటన ఇప్పించారని ఆరోపించినట్టు సమాచారం. ఎల్ అండ్ టీ బోర్డు సమావేశంలో చర్చించి ఆమోదించాకే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయినా ఒప్పందం ప్రకారం చేయాల్సిన కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదని, చివరి బిల్లును సైతం ఇప్పటివరకు చెల్లించలేదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా పనులు పూర్తికానట్టేనని వాదించారు. ఇంకా అంచనాలే రూపొందించలేదా? మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా గోదావరిలో ఎగువ నుంచి వస్తున్న జలాలను దారి మళ్లించడానికి కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుందని, ఇందుకు రూ.55.5 కోట్ల మేర ప్రతిపాదనలు సమర్పించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధు లు ఉత్తమ్‌కు వివరించారు. కాఫర్ డ్యామ్‌కు అంత వ్యయం కాదని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు బదులిచ్చారు. మీ అంచ నాల ప్రకారం ఎంత వ్యయం అవుతుందని ఉత్తమ్ ఆయన ను ప్రశ్నించారు. ఇంకా అంచనాలు రూపొందించలేదని వెంకటేశ్వర్లు బదులివ్వగా, మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా పునాది కింద దృఢత్వం కోసం కటాఫ్ పైల్స్ వేయాల్సి ఉంటుందని, వీటిని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడానికే 45 రోజుల సమయం పడుతుందని ఎల్ అండ్ టీ ప్రతినిధులు వివరించారు. అనుభవం కోసమే సర్టిఫికెట్ ఇచ్చి ఇరుక్కున్నారు.. మేడిగడ్డ పనులు చేసిన అనుభవం వాడుకుని కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవడానికి ఎల్ అండ్ టీ సంస్థ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోరగా, ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ జారీ చేసేయడంతోనే సమస్య ఉత్పన్నమైందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒప్పందం ప్రకారం పనులన్నీ పూర్తికాకుండానే ఎలా జారీ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సర్టిఫికెట్‌ను అడ్డంపెట్టుకుని ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. కారణమేంటో తేల్చండి! మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న అంశంపై వివాదాన్ని పక్కనపెట్టి అసలు బ్యారేజీ కుంగడానికి కారణాలను వెలికి తీయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు మూల కారణం తెలిసిన తర్వాత పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించాలని, ఇందుకోసం నిర్మాణ సంస్థలను పిలిపించి మాట్లాడాలని ఆదేశించారు. తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రితో సమావేశం అనంతరం కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులను ప్రారంభించే అంశంపై ఎల్ అండ్ టీ బృందంతో ఈఎన్సీలు చర్చించారు. తక్షణమే పనులు ప్రారంభించాలని, అదనపు పనులకు ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. -
వారికే చెప్పుకోండి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని.. ప్రాజెక్టును నిర్మించిన అధికారులు, ఇంజనీర్లు ఏం చెప్తారో కమిషన్‌కే చెప్పుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడిన ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, కొత్తగూడెం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావు తదితరులతో సీఎం ఆదివారం రాత్రి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నంబర్ బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోగా.. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యతతమదేనని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మరుసటి రోజే ప్రకటించిందని, ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం ఏమిటని ఈ సందర్భంగా రేవంత్ నిలదీసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో సొంత ఖర్చుతో మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు నిర్వహించేందుకు స్వచ్ఛందంగా అంగీకరించిన ఎల్అండ్టీ.. ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ అంశంలో జ్యుడిషియల్ కమిషన్‌కు వివరణ ఇచ్చుకోవాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో నిబంధనల మేరకు ఎల్‌అండ్‌టీపై చర్యలకు ఉపక్రమించాలని, అందుకు ఉన్న అవకాశాలను నివేదించాలని ఆదేశించినట్టు సమాచారం. కొత్త ప్రాజెక్టుల ఖర్చు వివరాలివ్వండి గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులపై పూర్తి వివరాలు అందజేయాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఇక యాసంగి పంటలకు నీళ్లిచ్చే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోయాయని, ఈ రెండు ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని సీఎంకు ఈఎన్సీలు నివేదించారు. దీంతో హైదరాబాద్ జంట నగరాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాకు వేసవిలో తాగునీటి సమస్య ఎదురవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎగువన ఉన్న నారాయణపూర్ జలాశయం నుంచి కృష్ణానదిలో ఊట నీళ్లు వస్తాయని, మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి ఇబ్బందులు ఉండవని ఈఎన్సీలు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఎండాకాలంలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌లోని నిల్వలను పరిరక్షించాలని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. శాసనసభలో ప్రకటించి.. ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో నీటిపారుదల శాఖపై కీలక ప్రకటన చేస్తానని.. అన్ని వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో నీరు ఇవ్వలేని పరిస్థితి, దీనికి కారణాలు, బాధ్యులు ఎవరన్న అంశంపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లోనే జ్యుడిషియల్ కమిషన్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. సాగర్ కింద క్రాప్ హాలిడే! నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు యాసంగిలో సాగునీటి సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రమే అధికారులతో సమీక్షించారు. సాగర్‌లో నిల్వలు అడుగంటిన నేపథ్యంలో యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాలని ఈఎన్సీలు సూచించినట్టు తెలిసింది. -
మేడిగడ్డపై ఎల్ అండ్ టీ యూ–టర్న్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకును సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తామని గతంలో చేసిన ప్రకటనపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ యూ–టర్న్ తీసుకుంది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. సొంత ఖర్చుతోనే బ్యారేజీ పునరుద్ధరణ చేపడతామని మరుసటి రోజు ఎల్అండ్టీ జనరల్ మేనేజర్ సురే‹Ùకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. బ్యారేజీ కుంగిన ఘటనపై నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్ కుమార్‌తో అక్టోబర్ 23న జలసౌధలో సమీక్ష నిర్వహించారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ నిబంధనలో భాగంగా బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఎల్అండ్టీ సొంత ఖర్చుతో చేసేందుకు ఒప్పుకుందని ఆయన మీడియాకు వెల్లడించారు. బ్యారేజీకి సంబంధించిన రెండేళ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్ 29తో ముగిసిన నేపథ్యంలో పునరుద్ధరణ బాధ్యత తమది కాదని తాజాగా ఎల్అండ్టీ సంస్థ మాట మార్చింది. బ్లాకు పునర్నిర్మాణం పనుల కోసం ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకోవాలని చెప్పింది. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థ నుంచి ఈ నెల 5న తమకు లేఖ అందిందని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతే ఎల్ అండ్ టీ నుంచి లేఖ అందినట్టు చెప్పాయి. బ్యారేజీ పునరుద్ధరణ పనుల కోసం తొలుత ఎగువ నుంచి వస్తున్న వరదను దారి మళ్లించడం కోసం రూ.55.75 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుందని, ఈ మేరకు వ్యయం భరించేందుకు ప్రభుత్వం ముందుకొస్తేనే పనులు ప్రారంభిస్తామని లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టం చేయడం గమనార్హం. బ్యారేజీ పునరుద్ధరణ పనులకు మరో రూ.500 కోట్ల వ్యయం కానుందని ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించామని ఎల్ అండ్ టీ పేర్కొంది. లేఖను దాచిపెట్టారు! ఎల్ అండ్ టీ రాసిన లేఖను నీటిపారుదల శాఖ రహస్యంగా ఉంచడంపై ఆరోపణలు చెలరేగాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ నెల 11న జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై ఈఎన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఉత్తమ్‌తో సహా మరో నలుగురు మంత్రులు నీటిపారుదల శాఖపై సమీక్ష జరిపారు. వాస్తవాలు దాస్తున్నారని రెండు సమీక్షల్లోనూ ఈఎన్సీలపై మంత్రులు మండిపడ్డారు. మంత్రులు రెండుసార్లు సమీక్షలు నిర్వహించినా, ఎల్ అండ్ టీ లేఖ విషయాన్ని అధికారులు ప్రస్తావించలేదని తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. -
ఎల్అండ్టీ చైర్మన్‌గా వైదొలిగిన ఎ.ఎం. నాయక్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ.ఎం. నాయక్ లార్సెన్ & టూబ్రో (L&T) నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా అధికారికంగా వైదొలిగారు. 23 బిలియన్ డాలర్ల వ్యాపార సమ్మేళనం నాయకత్వ బాధ్యతలను ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌కు అందించారు. 81 ఏళ్ల నాయక్ ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగుల ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉంటారని, గత కొన్నేళ్లుగా ఆయన చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను మరింత పెంచడంపై దృష్టి సారిస్తారని ఎల్ అండ్ టీ ఒక ప్రకటనలో తెలిపింది. దాతృత్వంతో ప్రత్యేక గుర్తింపు ఎ.ఎం. నాయక్ పారిశ్రామిక, దాతృత్వ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఇండియన్ పోస్ట్ సంస్థ ఈ సందర్భంగా ఆయనపై ఒక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది. త్వరలో ప్రచురితం కానున్న ఎ.ఎం.నాయక్ జీవిత చరిత్ర పుస్తకం ‘ది మ్యాన్ హూ బిల్ట్ టుమారో’ ముఖచిత్రాన్ని ఎల్ అండ్ టీ మాజీ డైరెక్టర్లు, నాయక్ కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో అణగారిన వర్గాల విద్య, నైపుణ్యాలను పెంపొందించడానికి ఎ.ఎం.నాయక్ కృషి చేస్తున్నారు. అలాగే నిరాలీ మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ద్వారా రాయితీ ధరకు సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ను పేదలకు అందిస్తన్నారు. గుజరాత్లో ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చిన నాయక్, 1965లో ఎల్అండ్టీ కంపెనీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఆరు దశాబ్దాలు ఆ సంస్థలో పనిచేసిన ఆయన 1999లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా, 2003లో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కంపెనీ బోర్డు ఆయనకు ఛైర్మన్ ఎమిరిటస్ హోదాను సైతం ప్రదానం చేసింది. -
నిఫ్టీలో ఎల్‌టీఐమైండ్‌ట్రీ హెచ్డీఎఫ్సీ స్థానంలో చోటు
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజి దిగ్గజం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎల్‌టీఐమైండ్‌ట్రీ చోటు సాధించనుంది. మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ స్థానే ఇండెక్స్‌లో చేరనుంది. ఈ నెల 13 నుంచి ఇండెక్స్‌లో ప్రాతినిధ్యం వహించనుంది. హెచ్డీఎఫ్సీ దిగ్గజాల విలీనం నేపథ్యంలో నిఫ్టీ–50తోపాటు..నిఫ్టీ 100, నిఫ్టీ–500 ఇండెక్స్లలోనూ సవరణలు చేపట్టినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. నిఫ్టీ–100లో హెచ్‌డీఎఫ్‌సీకి బదులు జిందాల్ స్టీల్ అండ్ పవర్‌కు చోటు లభించనుంది. ఎన్ఎస్ఈ ఇండెక్సుల నిర్వహణ ఉపకమిటీ(ఈక్విటీ) ఈ మేరకు మార్పులు చేపట్టినట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. ఈ బాటలో నిఫ్టీ–500లో హెచ్డీఎఫ్సీ స్థానంలో మ్యాన్‌కైండ్ ఫార్మా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ స్థానంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్రాతినిధ్యం వహించనున్నాయి. తాజా సవరణలు 2023 జూలై 13 నుంచి అమలుకానున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. -
ఎల్అండ్టీ రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ మార్చి త్రైమాసికానికి నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,621 కోట్ల నుంచి రూ.3,987 కోట్లకు చేరింది. ఆదాయం రూ.52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.24 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19 శాతం అధికంగా రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లను పొందడం ఇదే మొదటిసారి అని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం ఆర్డర్ల పుస్తకం మార్చి చివరికి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఎల్అండ్టీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2022–23లో 17 శాతం వృద్ధితో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకోగా, లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లుగా నమోదైంది. చైర్మన్‌గా తప్పుకోనున్న ఏఎం నాయక్ ఎల్అండ్టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఏఎం నాయక్ 2023 సెప్టెంబర్ 30 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఈవో, ఎండీగా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యం చైర్మన్, ఎండీగా 2023 అక్టోబర్ 1 నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్అండ్టీ ప్రకటించింది. గౌరవ చైర్మన్‌గా నాయక్ కొనసాగుతారని తెలిపింది. -
వాటాదారులకు మరింత విలువ
న్యూఢిల్లీ: వాటాదారులకు విలువ చేకూర్చడంపై దృష్టిపెట్టిన మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ ఇందుకు మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించింది. కీలకంకాని ఆస్తుల విక్రయం, వ్యయ నియంత్రణలు పాటించడం, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి అంశాలను అమలు చేయనున్నట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏంఎ నాయక్ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా పలు విభాగాలలోగల వ్యాపార పోర్ట్‌ఫోలియో, ప్రాంతాలవారీ విస్తరణ, పటిష్ట బ్యాలన్స్‌షీట్, వృద్ధిలో ఉన్న ఆర్డర్‌బుక్ తదితరాలు కంపెనీ పురోభివృద్ధికి దోహదం చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీ సాధారణ సర్వసభ్య సమావేశం సందర్భంగా వాటాదారులనుద్దేశించి నాయక్ ప్రసంగించారు. తద్వారా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) లో కంపెనీ పనితీరుపై అప్రమత్తతతోకూడిన ఆశాభావంతో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. గతేడాది(2020–21)కిగాను వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రూ. 18 మధ్యంతర డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 1,624 వద్ద ముగిసింది. -
ఎల్అండ్టీ లాభం రూ.537 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని దిగ్గజ కంపెనీ ఎల్అండ్టీ గ్రూపు కార్యకలాపాలు జూన్ త్రైమాసికంలో గణనీయమైన ప్రభావానికి గురయ్యాయి. కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 68 శాతం పడిపోయి రూ.537 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 27 శాతం తగ్గిపోయి రూ.22,037 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,698 కోట్లు, ఆదాయం రూ.30,271 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా రూ.27,616 కోట్ల నుంచి రూ.21,368 కోట్లకు పరిమితమయ్యాయి. ‘‘కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ కారణంగా గ్రూపు కార్యకలాపాలు, ఆర్థిక ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడింది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి కార్మికులు, ఉద్యోగులతో కార్యకలాపాలను క్రమంగా, తగిన జాగ్రత్తల మధ్య ఆరంభించాము’’అని ఎల్అండ్టీ తెలిపింది. గ్రూపులో అధిక వ్యాపారాలపై కరోనా ప్రభావం ఉందని.. కస్టమర్లు, ఉద్యోగులు, సబ్ కాంట్రాక్టర్ల పరిధిలో పనిచేసే కార్మికులు, భాగస్వాములు, వెండర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.23,574 కోట్ల విలువ చేసే నూతన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఇందులో రూ.8,872 కోట్ల మేర అంతర్జాతీయ ఆర్డర్లే. గ్రూపు కన్సాలిడేటెడ్ ఆర్డర్ల విలువ జూన్ ఆఖరుకు రూ.3,05,083 కోట్లుగా ఉంది. -
కరోనాపై కార్పొరేట్ల యుద్ధం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ అనే ప్రత్యేక నిధికి కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ.5 కోట్లను కేటాయించింది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కూడా పీఎం కేర్స్‌కు రూ.150 కోట్లను ప్రకటించింది. అలాగే, లౌక్‌డౌన్ సమయంలో ఎల్అండ్టీ తన కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించనుంది. ఇందు కోసం ప్రతి నెలా రూ.500 కోట్లను పక్కన పెట్టనున్నట్టు ఎల్అండ్టీ గ్రూపు చైర్మన్ ఏఎం నాయక్ తెలిపారు. ఇప్పటికే టాటాసన్స్, టాటా గ్రూపు కలసి రూ.1,500 కోట్లను పీఎంకేర్స్ కోసం ప్రకటించాయి. ఇక హీరో గ్రూపు సైతం కరోనా వైరస్ నివారణ చర్యల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఇందులో రూ.50 కోట్లను పీఎం కేర్స్‌కు, మరో రూ.50 కోట్లను నివారణ చర్యలకు ఖర్చు చేయనుంది. పేటీఎం సైతం రూ.500 కోట్లు: పేటీఎం సైతం పీఎం కేర్స్ సహాయనిధికి రూ.500 కోట్లు అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తోటి పౌరుల నుంచి విరాళాలు అందించాలని ఈ సంస్థ కోరింది. యూజర్లు ఇచ్చే ప్రతీ రూ.10కి అదనంగా తాను రూ.10కూడా కలిపి పీఎం కేర్స్‌కు అందించనున్నట్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్లు... కరోనా సహాయ చర్యల్లో భాగంగా పీఎం కేర్స్ నిధికి రూ.50 కోట్లను విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరో రూ.50 కోట్లను సొంతంగా ఖర్చుచేయనుంది. ఎన్ఎండీసీ రూ.150 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్ధతుగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.150 కోట్లు విరాళంగా అందించింది. దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఇదే అతిపెద్ద సహాయమని ఈ మేరకు ఎన్ఎండీసీ సీఎండీ బైజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అమర్‌రాజా గ్రూప్ రూ.6 కోట్లు..: బ్యాటరీ తయారీ సంస్థ అమర్‌రాజా గ్రూప్ కరోనా నియంత్రణకు రూ.6 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో కంపెనీ ఉద్యోగుల ఒక రోజు వేతనం కూడా కలిపి ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్లు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సిగ్నిటీ రూ.50 లక్షలు..: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్ తెలంగాణ ప్రభుత్వ కోవిడ్ సహాయ నిధికి రూ.50 లక్షల విరాళంగా అందించింది. ఈ మేరకు సిగ్నిటీ సీఎండీ సీవీ సుబ్రహ్మణ్యం మంత్రి కేటీ రామారావుకు చెక్‌ను అందజేశారు. మ్యాన్‌కైండ్ రూ. 51 కోట్లు..: న్యూఢిల్లీకి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ మ్యాన్‌కైండ్ కరోనా వైరస్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా రూ.51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇం దులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ జునెజా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీసీ రూ.కోటి..: కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఎన్సీసీ లిమిటెడ్ కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి నిధులను అందజేసింది. ఈ మేరకు కంపెనీ ఎండీ రంగరాజు సీఎం కే చంద్రశేఖర్ రావుకు చెక్‌ను అందజేశారు. పరిష్కారాలకు రూ. 2.5 కోట్లు పారిశ్రామిక దిగ్గజం హర్ష మారివాలా ఆఫర్ ముంబై: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వచ్చే నెల రోజుల్లో వినూత్న పరిష్కారమార్గాలు కనుగొనే వారికి రూ. 2.5 కోట్ల బహుమతి ఇవ్వనున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో అధినేత, పారిశ్రామికవేత్త హర్‡్ష మారివాలా ప్రకటించారు. రెండు లాభాపేక్షరహిత సంస్థలతో కలిసి వ్యక్తిగత హోదాలో తాను ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇన్నోవేట్2బీట్కోవిడ్ పేరిట నిర్వహిస్తున్న పోటీలో మెడ్–టెక్ ఎంటర్‌ప్రెన్యూర్స్, కార్పొరేటర్లు, నూతన ఆవిష్కర్తలు పాల్గొనాలంటూ మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆహ్వానించింది. స్వల్ప సమయంలోనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అనువైన సొల్యూషన్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు మారివాలా తెలిపారు. -
గనులశాఖ మెమో అమలు నిలిపివేత
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం నెక్కల్లు, ఐనవోలు, నేలపాడు గ్రామాల్లో లార్సన్ అండ్ టోబ్రో (ఎల్ అండ్ టీ) నిల్వచేసిన ఇసుకను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటిస్తూ గనులశాఖ డైరెక్టర్ జారీచేసిన మెమో అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. నాలుగు వారాల పాటు మెమో అమలును నిలిపేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఇసుక తరలింపు విషయంలో యథాతథస్థితి(స్టేటస్ కో)ని కొనసాగించాలని గనుల శాఖాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉచిత ఇసుక పథకం కింద తీసుకున్న ఇసుకను నెక్కల్లు, ఐనవోలు, నేలపాడు గ్రామాల్లోని తమ స్టాక్ యార్డ్‌ల్లో నిల్వ చేశామని, ఆ ఇసుకను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించడంతో పాటు, ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు మెట్రిక్ టన్నుకు రూ.375 చెల్లించాలంటూ గనుల శాఖాధికారులు మెమో జారీచేశారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఎల్ అండ్ టీ అదీకృత అధికారి జి.రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. -
నవీ ముంబై విమానాశ్రయ పనులు ఎల్అండ్టీ చేతికి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే అనుబంధ కంపెనీ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టును ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్కు అప్పగించింది. ఇందులో భాగంగా 3.7 కిలోమీటర్ల పొడవైన రన్‌వే, డిపార్చర్, అరైవల్ టెర్మినల్, అప్రాన్ సిస్టమ్స్, ట్యాక్సీవే సిస్టమ్స్, ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, యుటిలిటీస్ తదితర పనులను ఎల్అండ్టీ చేపడుతుంది. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ పనులను జహా హాదిద్ ఆర్కిటెక్ట్స్ దక్కించుకుంది. -
ఎల్ అండ్ టీ లాభం రూ.1,473 కోట్లు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ దిగ్గజం, ఎల్ అండ్ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,473 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం, రూ.1,215 కోట్లతో పోల్చితే 21% వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. నికర అమ్మకాలు 27,005 కోట్ల నుంచి కోట్ల నుంచి 10% వృద్ధితో రూ.29,636 కోట్లకు పెరిగాయని ఎల్అండ్టీ సీఈఓ ఆర్.శంకర్ రామన్ చెప్పారు. వ్యయాలు రూ.25,216 కోట్ల నుంచి రూ.27,365 కోట్లకు పెరిగాయని తెలిపారు. నిర్వహణ లాభం 20 శాతం అప్... మొత్తం ఆదాయంలో దాదాపు సగం ఉండే మౌలిక రంగ సెగ్మెంట్ ఆదాయం 14% ఎగసి రూ.14,038 కోట్లకు పెరిగిందని రామన్ తెలిపారు. నిర్వహణ లాభం 20 శాతం వృద్ధితో రూ.3,319 కోట్లకు పెరిగిందని, నిర్వహణ లాభ మార్జిన్ 1% పెరిగి 11.2 శాతానికి చేరిందని పేర్కొన్నారు. 11 శాతం పెరిగిన ఆర్డర్లు.... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో తమ గ్రూప్ కంపెనీలన్నీ కలసి రూ.38,700 కోట్ల ఆర్డర్లు సాధించాయని రామన్ వెల్లడించారు. ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందాయని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జూన్ 30 నాటికి మొత్తం ఆర్డర్లు రూ.2,94,014 కోట్లకు చేరాయని, వీటిల్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 21 శాతమని పేర్కొన్నారు. క్యూ2 నుంచి మైండ్‌ట్రీ..... ఈ ఏడాది జూన్ నాటికి మైండ్‌ట్రీ కంపెనీలో తమకు 28.86 శాతం వాటా ఉందని, ఈ క్వార్టర్ పూర్తయిన తర్వాత ఆ కంపెనీలో తమ వాటా 60.59 శాతానికి చేరిందని రామన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ నుంచి తమ అనుబంధ సంస్థగా మైండ్‌ట్రీ కొనసాగుతుందని వివరించారు.మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు బాగానే ఉంటాయనే అంచనాలతో బీఎస్ఈలో ఎల్ అండ్ టీ షేర్0.4% లాభంతో రూ.1,410 వద్ద ముగిసింది. -
ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన ఎల్ అండ్ టీ
బెంగళూరు/న్యూఢిల్లీ: మైండ్ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.980కు (మంగళవారం ముగింపు ధర, రూ.950 కంటే ఇది రూ.30 అధికం) కొనుగోలు చేస్తామని ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఓపెన్ ఆఫర్లో భాగంగా 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం ఎల్ అండ్ టీ రూ.5,030 కోట్లు కేటాయించింది. ఈ ఓపెన్ ఆఫర్ మే 14న ఆరంభమై అదే నెల 27న ముగుస్తుంది. అవసరానికి మించి బిడ్లు వస్తే, ఇష్యూ మేనేజర్లతో సంప్రదించి తగిన దామాషా ప్రాతిపదికన బిడ్లను అంగీకరిస్తారు. కాగా ఈ బలవంతపు ఓపెన్ ఆఫర్‌పై కసరత్తు చేయడానికి ఇండిపెండెంట్ డైరెక్టర్లతో కూడిన ఒక ప్యానెల్‌ను మైండ్‌ట్రీ కంపెనీ ఏర్పాటు చేసింది. మరోవైపు షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పక్కన బెట్టింది. మైండ్ ట్రీని ఎల్ అండ్ టీ టేకోవర్ చేయడాన్ని మైండ్ ట్రీ వ్యవస్థాపకులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
ఎల్ అండ్ టీ మెగా బై బ్యాక్: చరిత్రలో తొలిసారి
సాక్షి, ముంబై: దేశీయ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు (బై బ్యాక్)కు చరిత్రలోనే తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో బై బ్యాక్ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుని వాటాదారులకు గుడ్ న్యూస్ అందించింది. రూ. 9వేలకోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. వాటాదారులు కంపెనీ పట్ల చూపిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నామని ఎల్ అండ్ టి ఛైర్మన్ ఏఎం నాయక్ చెప్పారు. ఒక్కో ఈక్విటీ షేరువిలువు 1500రూపాయల వద్ద సుమారు 6వేల షేర్లు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఎల్ అండ్‌టీ బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్ అండ్ టీ షేరు ధర మంగళవారం నాటి ముగింపు రూ.1,322 తోలిస్తే 13శాతం ఎక్కువ.దీంతో ఫ్లాట్‌మార్కెట్‌లో ఈ కౌంటర్ 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
ప్లేట్లో అన్నం తిన్నందుకే..
ఉప్పల్: ఉప్పల్ ఎల్అండ్టీ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడిపై ఇద్దరు యువకులు దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చిన సంగతి విదితమే. అయితే హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్అండ్టీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న రాజేష్ మహతో ఎల్అండ్టీ లేబర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతని గది పక్కనే ఉంటున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మంగరముండ (36) ఇదే కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు మంగరముండ రాజేష్ ప్లేట్లో అన్నం వడ్డించుకొని తిన్నాడు. దీనిని జీర్ణించుకోలేని రాజేష్ బిహార్ రాష్ట్రానికి చెందిన వినోద్‌తో కలిసి మంగరముండను గత నెల 21న గడ్డిచేనులోకి తీసుకెళ్లి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగక టవల్‌తో ఉరివేసి హత్య చేసి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు. నిందితుడు వినోద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడించాడు. గురువారం రాజేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఎల్ అండ్ టీ లాభం రూ.3,167 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజ కంపెనీ ఎల్ అండ్ టీ 2017–18 జనవరి–మార్చి క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,167 కోట్ల నికర లాభం సాధించింది. 2016–17 క్యూ4లో రూ.3,025 కోట్ల నికర లాభం ఆర్జించామని, 5 శాతం వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. కంపెనీ నికర లాభం విశ్లేషకుల అంచనాలను మించింది. ఈ కంపెనీ నికర లాభం రూ.2,994 కోట్లకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేశారు. స్థూల ఆదాయం 36,828 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.40,678 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు కూడా రూ.33,464 కోట్ల నుంచి రూ.36,198 కోట్లకు పెరిగాయి. ట్రెజరీ కార్యకలాపాల లాభాల వల్ల ఇతర ఆదాయం 5 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభం 24% పెరిగి రూ.5,390 కోట్లకు, నిర్వహణ లాభ మార్జిన్ 13.2%కి చేరాయి. ఒక్కో షేర్‌కు రూ.16 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. ఐటీ, టెక్నాలజీ సర్వీసుల సెగ్మెంట్ ఆదాయం 24% వృద్ధితో రూ.3,075 కోట్లకు పెరిగింది. జోరుగా ఆర్డర్లు... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొత్తం ఆర్డర్లు 5 శాతం వృద్ధితో రూ.49,557 కోట్లకు పెరిగాయని ఎల్ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆర్డర్లలో 18 శాతంగా ఉన్న అంతర్జాతీయ ఆర్డర్లు రూ.8,678 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఆర్డర్లు రూ.2,63,107 కోట్లకు పెరిగాయని, దీంట్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 24 శాతంగా ఉందని వివరించింది. మౌలిక రంగ ఆర్డర్లు 27 శాతం ఎగసి రూ.33,455 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఈ రంగం ఆర్డర్లు రూ.1,95,419 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. విద్యుత్తు విభాగం ఆర్డర్లు 32 శాతం తగ్గి రూ.9,357 కోట్లకు తగ్గగా, భారీ ఇంజనీరింగ్ ఆర్డర్ బుక్ 13 శాతం పెరిగి రూ.13,523 కోట్లకు ఎగసిందని తెలిపింది. హైడ్రోకార్బన్ సెగ్మెంట్ ఆర్డర్లు 7 శాతం వృద్ధితో రూ.26,590 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12.–15 శాతం రేంజ్లో, ఆర్డర్లు 10–12 శాతం రేంజ్లో పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. మెరుగుపడుతున్న పెట్టుబడి వాతావరణం.. జీఎస్టీ, రెరా, దివాలా చట్టం వంటి సంస్కరణలు దీర్ఘకాలంలో వృద్ధికి దోహదపడతాయి కానీ గత ఏడాది ప్రతికూల ప్రభావమే చూపించాయని ఎల్ అండ్ టీ పేర్కొంది. ఈ సంస్కరణలతో పాటు, వివిధ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడం, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రభుత్వ విధానాలు, మౌలిక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం.. ఈ అంశాలన్నీ దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తంచేసింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎల్ అండ్ టీ షేర్ 2.5 శాతం లాభంతో రూ.1,378 వద్ద ముగిసింది. -
ష్నిడర్ చేతికి ఎల్–టీ ఆటోమేషన్
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) తన ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ (ఈ అండ్ ఏ) వ్యాపారాన్ని విక్రయిస్తోంది. ఈ వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ష్నిడర్ ఎలక్ట్రిక్ కంపెనీ, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ టెమసెక్ హోల్డింగ్స్‌లు రూ.14,000 కోట్లకు అంతా నగదులోనే కొనుగోలు చేస్తున్నట్లు ఎల్ అండ్ టీ తెలిపింది. ఈ మేరకు ష్నిడర్ ఎలక్ట్రిక్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలియజేసింది. ‘‘కీలకం కాని కార్యకలాపాల నుంచి వైదొలగాలనే దీర్ఘకాల వ్యూహంలో భాగంగా ఈ వ్యాపారాన్ని విక్రయించాం. ఒప్పందంలో భాగంగా మా ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపార విభాగాన్ని, దీనికి అనుబంధంగా విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను కూడా ష్నిడర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ష్నిడర్ ఎలక్ట్రిక్ జేవీ హోల్డింగ్స్‌కు విక్రయిస్తున్నాం. ఈ విక్రయం నుంచి మెరైన్ స్విచ్‌గేర్, సర్వోవాచ్ సిస్టమ్స్‌ను మినహాయిస్తున్నాం. అయితే దీనికి ప్రభుత్వ పరమైన ఆమోదాలు పొందాల్సి ఉంది’’ అని ఎల్ అండ్ టీ తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం ఒప్పందం కుదిరిందని, 18 నెలల్లో వాటా విక్రయం పూర్తవుతుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎమ్డీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ష్నిడర్ ఎలక్ట్రిక్ ఇండియాలో ష్నిడర్ కంపెనీకి 65 శాతం, టెమసెక్కు 35 శాతం చొప్పున వాటాలున్నాయి. రూ.5,038 కోట్ల ఆదాయం... ఈ ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపారం ఆదాయం 2016–17లో రూ.5,038 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.3,590 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎల్ అండ్ టీ మొత్తం ఆదాయంలో ఇది 4.5 శాతానికి సమానం. కాగా ఈ విక్రయంలో భాగంగా ఎల్అండ్టీ ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపార విభాగం కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ అనుబంధ సంస్థలు– టామ్‌కో స్విచ్‌గేర్ మలేషియా, టామ్‌కో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియా, టామ్‌కో ఇండోనేషియా, ఎల్ అండ్ టీ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ సౌదీ అరేబియా, ఎల్ అండ్ టీ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ మలేషియా, కన కంట్రోల్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ కువైట్‌లు... ఇక నుంచి ష్నిడర్ పరమవుతాయి. ఈ లావాదేవీకి సలహాదారులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటిగ్రూప్లు వ్యవహరిస్తున్నాయి. కాగా ఫ్రాన్స్ కేంద్రంగా ష్నిడర్ ఎలక్ట్రిక్ ఎస్ఈ కంపెనీ 180 ఏళ్ల నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంధన మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ తదితర సేవలతో కూడిన ఆటోమేషన్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
ఎల్అండ్టీలో ఆర్థిక అవకతవకలు..!
న్యూఢిల్లీ: ఇన్ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ రాజ్యసభ ఎంపీ కెహ్కషాన్ పర్వీన్ ఆరోపించారు. ఈ మేరకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో)కి ఫిర్యాదు చేశారు. రహదారి ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రూప్ తీసుకున్న రూ. 8,000 కోట్ల పైగా రుణాలు .. మొండిబాకీలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎల్అండ్టీ హలోల్ షామ్లాజీ టోల్‌వే (ఎల్అండ్టీ హలోల్), ఎల్అండ్టీ చెన్నై తడ ప్రాజెక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఎస్ఎఫ్ఐవో ముంబై ప్రాంతీయ కార్యాలయానికి చెసిన ఫిర్యాదులో పర్వీన్ ఆరోపించారు. ఇది విచారణార్హమైనదిగా పేర్కొంటూ సదరు ఫిర్యాదు గురించి ప్రధాన కార్యాలయానికి ముంబై కార్యాలయం తెలియజేసింది. మరోవైపు, ఎల్అండ్టీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. విచారణ గురించి తమకేమీ సమాచారం రాలేదని పేర్కొంది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో తాము అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని ఎల్అండ్టీ వివరించింది. -
అ‘గమ్య’గోచరం!
గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ప్రారంభ ముహూర్తం సమీపిస్తుండగా...లాస్ట్ మైల్ కనెక్టివిటీపై స్పష్టత లేకుండాపోయింది. సురక్షిత, పర్యావరణ హితమైన ప్రయాణమని, ఇంటి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేరుకునేలా ఘనమైన ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. ప్రతి ప్రయాణికుడు ఇంటికి క్షేమంగా చేరేలా ‘ఎల్ అండ్ టీ మెర్రీగో అరౌండ్’ (మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు) మినీ బస్సులు నడుపుతామని ప్రకటించారు. కానీ ఆ దిశగా ఇప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు చేయనేలేదు. బస్సుల ఊసే లేదు...బస్‌బేలు..క్యాబ్ స్టాండ్ల నిర్మాణమే పూర్తికాలేదు. మరి ‘మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ ఎలా సాధ్యమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: సురక్షిత, కాలుష్య రహిత, పర్యావరణ హితమైన ప్రయాణ సదుపాయం అన్నారు. ఇంటి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేరుకొనేందుకు అనువైన ‘లాస్ట్‌మైల్ కనెక్టివిటీ’ ఉంటుందని చెప్పారు. సొంత వాహనాల అవసరం లేకుండా ఎల్ అండ్ టీ మెర్రీ గో అరౌండ్ (మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు) మినీ బస్సులను కాలనీలకు నడుపుతుందని చెప్పారు. మెట్రో రైల్ నిర్మాణ సమయంలో జరిగిన ఒప్పందంలో ఇవన్నీ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ముంచుకొస్తున్నా ఈ ఒప్పంద అంశాల అమలుకు చర్యలు కన్పించడం లేదు. ఇప్పటి వరకు మెర్రీ గో అరౌండ్ బస్సుల ఊసే లేదు. సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు తిరిగేందుకు బస్‌బేలు, ఆటోస్టాండ్లు, క్యాబ్ స్టాండ్లు కూడా లేవు. దీంతో మెట్రోరైలు లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై నీలినీడలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది. అటకెక్కిన ‘మెర్రీ గో అరౌండ్’ బస్సులు.. మెట్రో నిర్మాణ ఒప్పందం(2010) ప్రకారం ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం కారిడార్లలోని 64 స్టేషన్ల నుంచి నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సుమారు 840 మినీ బ్యాటరీ బస్సులను నడపాలని ప్రతిపాదించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కాగితాలకే పరిమితమైంది. దీంతో ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, తిరిగి ఇంటి వరకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ఇస్తుందని భావించిన మెర్రీ గో అరౌండ్ అటకెక్కినట్లయింది. ఇప్పుడు ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు లేదా ప్రైవేటు ఆటోలు, క్యాబ్‌లు తప్ప మరో సదుపాయం లేదు. మెట్రో స్టేషన్లకు సమీపంలోని కాలనీల నుంచి పెద్ద బస్సులను నడపడం తమకు నష్టదాయకమని ఆర్టీసీ భావిస్తోంది. మరోవైపు క్యాబ్‌లు, ఆటోరిక్షాల వల్ల ప్రయాణికులపైన భారం అధికమయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో కాలుష్యం గణనీయంగా తగ్గించాలన్న ఉద్దేశంతోనే మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన తెరమీదకు వచ్చిన విషయం విదితమే. ఇదే క్రమంలో ప్రతి స్టేషన్ వద్ద కాలుష్యానికి తావులేని రీతిలో 13 మెర్రీ గో బస్సుల చొప్పున 20 సీట్ల సామర్థ్యంగల బ్యాటరీ బస్సులను సమీప కాలనీలు, బస్తీలకు నిరంతరం రాకపోకలు సాగించేలా చూడాలని నిర్మాణ ఒప్పందం సమయంలో నిర్ణయించారు. ఇదే అంశంపై అశోక్లీల్యాండ్ అనే సంస్థతో ఎల్అండ్టీ, మెట్రో అధికారులు అధ్యయనం కూడా చేయించారు. కానీ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణ వ్యయం తడిసిమోపడవుతుందన్న ఉద్దేశంతో నిర్మాణ సంస్థ మెర్రీ గో అరౌండ్ బస్సులను నడిపే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ భారం ఆర్టీసీపైన పడింది. కానీ మెట్రో స్టేషన్ల నిర్మాణం పెద్ద బస్సులు తిరిగేందుకు అనువుగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే చాలా చోట్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మెట్రో అందుబాటులోకి వస్తే రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. బెంగళూరు..చెన్నైలలోనూ ఇదే తీరు.. మన పొరుగునే ఉన్న బెంగళూరు, చెన్నై మహానగరాల్లోనూ మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు వెళ్లేందుకు మినీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆయా నగరాల్లోనూ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య ఏమాత్రం పెరగడంలేదు. మన నగరంలోనూ ఆయా విభాగాలు లాస్ట్‌మైల్ కనెక్టివిటీని పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. తొలిదశ మెట్రో ప్రాజెక్టులో నాగోల్–అమీర్‌పేట్(17కి.మీ), మియాపూర్–ఎస్.ఆర్.నగర్(13కి.మీ)మార్గంలోని 24 స్టేషన్ల నుంచి నిత్యం 15–20 మినీ బస్సులను సమీప కాలనీలు, బస్తీలకు నిరంతరాయంగా నడపాలని సిటీజనులు కోరుకుంటున్నారు. బస్‌బేలు, టర్మినళ్ల కొరత... ప్రస్తుతం నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మొత్తం 30 కిలోమీటర్ల మేర అందుబాటులోకి రానున్న మెట్రో మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి. నాగోల్, ఉప్పల్, స్టేడియం, మెట్టుగూడ, మియాపూర్ వంటి కొన్ని స్టేషన్లకు మాత్రమే బస్‌బేలు ఉన్నాయి. నాగోల్, ఉప్పల్, మియాపూర్ స్టేషన్ల చుట్టూ తిరిగేందుకు కావలసిన సదుపాయం ఉంది. కానీ కొన్ని స్టేషన్లు మాత్రం నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు, దిగేందుకు అనువైన బస్‌బేలు లేక ఇబ్బందిగా ఉన్నట్లు గ్రేటర్ ఆర్టీసీ సర్వే స్పష్టం చేసింది. ♦ ఆర్టీసీ సర్వే ప్రకారం మెట్టుగూడ స్టేషన్ నుంచి మల్కాజిగిరి, లాలాగూడ వైపు రాకపోకలు సాగించేందుకు అనువుగా బస్బే ఉంది. కానీ నాగోల్ వైపు వెళ్లే బస్సులు మెట్రో స్టేషన్ వద్ద ఆగేందుకు స్థలం లేదు. అలాగే సికింద్రాబాద్ వైపు కూడా బస్బే లేదు. స్టేషన్‌కు కొద్ది దూరంలో బస్టాపు ఉంది. దీంతో ప్రయాణికులు మెట్రో స్టేషన్ దిగి నడవాల్సి ఉంటుంది. ♦ సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ ఎదురుగా ప్రస్తుతం బస్ బే చాలా ఇరుకుగా ఉంది. బస్సులు నిలపడం వల్ల వాహనాల రద్దీ తీవ్రమవుతుంది. దీంతో ఈ ప్రాంతంలో రైల్వే స్థలంలో బస్‌బేలను విస్తరించి ఇవ్వాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. ♦ అలాగే జెన్టీయూ నుంచి నిజాంపేట్ వైపు వెళ్లేందుకు, ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వైపు వెళ్లేందుకు బస్సుల రాకపోకలకు అనువుగా బస్‌బేలను విస్తరించాలి. ఈఎస్ఐ వద్ద ప్రయాణికులు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు స్కై వే అవసరం. ♦ బేగంపేట్ మెట్రో స్టేషన్ వద్ద బస్సులు ఆపేందుకు బస్‌బేలు లేవు. నిత్యం వాహనాల రద్దీ, ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రయాణికులు మెట్రో స్టేషన్ దిగి బస్సెకేందుకు బస్టాపు లేదు. ఎక్కడ బస్సులు ఆపినా ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. ♦ మెట్రో స్టేషన్ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. స్టేషన్‌కు రెండు వైపులా నుంచి వచ్చే బస్సులు ఎక్కడ ఆపాలనేది సమస్య. ♦ మైత్రీవనం అతి పెద్ద కూడలి. బేగంపేట్ తరువాత భారీగా రద్దీ ఉండే ప్రాంతం. ఇక్కడ కూడా బస్‌బేలు లేవు. బెంగళూరు పర్యటనలో ఆర్టీసీ అధికారులు నగరంలో మెట్రో రైలు రాకపోకలు ప్రారంభమవనున్న నేపథ్యంలో బెంగళూరులో మెట్రో–సిటీ బస్సు సదుపాయాలపైన అధ్యయనం చేసేందుకు ఆర్టీసీ అధికారులు సోమవారం అక్కడికి బయలుదేరి వెళ్లారు. తమ పర్యటన అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల నిర్వహణపై కార్యాచరణ వెల్లడించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ మేనేజర్ కొమరయ్య ‘సాక్షి’ తో చెప్పారు. -
హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ ధరలు ఎంత ?
-
ఎల్ అండ్ టీకి భారీ ఆర్డర్
ముంబై: ఇంజనీరింగ్ మేజర్ లార్సన్ అండ్ టర్బో భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. విదేశీ ప్రభుత్వంనుంచి వేలకోట్ల విలువైన ప్రాజెక్టును సాధించింది. మారిషస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెట్రోఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నుంచి ఈ భారీ ఆఫర్ కొట్టేసింది. రైలు ఆధారిత పట్టణ రవాణా వ్యవస్థ రూపకల్పన,మరియు నిర్మాణానికిగాను రూ. 3,375 కోట్ల రూపాయల కాంట్రాక్టును గెలుచుకుంది. ఇది తమకు చాలా కీలకమైన ఆర్డర్‌ని ఎల్ అండ్ టీ బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది. ఆఫ్రికన్ ద్వీప దేశంలో సమీకృత లైట్ రైలు ఆధారిత రవాణా వ్యవస్థకు ప్రధాన పురోగతి ఈ ఒప్పందమని పేర్కొంది. 26 కిలోమీటర్ల మార్గం క్యూరీపైప్ తో పోర్ట్ లూయిస్‌లోని ఇమ్మిగ్రేషన్ స్క్వేర్ కు అనుసంధానిస్తుందని, 19 స్టేషన్లను కలిగి ఉంటుందని తెలిపింది. మారిషస్ ప్రధాన మంత్రి ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్ సమక్షంలో జూలై 31 న ఒప్పందంపై సంతకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. తమ నైపుణ్యంపై విశ్వాసం ఉంచిన మారిషస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఈ కొత్త లైట్సిస్టం ద్వారా రూటు అభివృద్ధితోపాటు పరిపుష్టమైన ఆర్థిక లాభాలను గణనీయంగా ఆర్జించనుందని ఎల్ అండ్ ఎండీ, సీఈవో ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ తెలిపారు. -
80 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో పాటు ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచడంతో ఉదయం సెషన్ నుంచి అస్థిరంగా ట్రేడైన మార్కెట్లు చివరికీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టంలో 31,075 వద్ద, నిఫ్టీ 40.10 పాయింట్ల నష్టంలో 9,578 వద్ద క్లోజయ్యాయి. టీసీఎస్, రిలయన్స్ 2 శాతం మేర, ఎల్ అండ్ టీ 1 శాతం మేర పడిపోయాయి. వాటితో పాటు ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ కూడా రెండు సూచీల్లో నష్టాలు పాలయ్యాయి. అదేవిధంగా రిలయన్స్, అరబిందో ఫార్మా, సిప్లాలు లాభాలు పండించాయి. వడ్డీరేట్లను పావుశాతం పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వు నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు పతనమయ్యాయి. నేటి ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 236 రూపాయల మేర పడిపోయి 28,794 రూపాయలుగా ఉన్నాయి.. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా 13 పైసల నష్టంతో 64.43గా నమోదయ్యాయి. -
జియోపై జీహెచ్ఎంసీ ఫిర్యాదు
హైదరాబాద్ లో రాత్రి కురిసిన కుండపోత వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు మేల్కొన్నారు. ఎల్ అండ్ టీ, జియోలు గతకొంతకాలంగా తవ్వుతున్న గుంతలపై నేడు కేసు నమోదుచేశారు. యూసఫ్ గూడలో గుంతలు తవ్వ వదిలేశారంటూ జూబ్లిహిల్స్ పీఎస్ లో తమ ఫిర్యాదును దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిని అనవసరంగా డ్యామేజ్ చేశారంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల క్వార్టర్స్ నుంచి యూసఫ్ గూడ వెళ్లే దారిలో మెట్రో పిల్లర్ల కోసం ఎల్ అండ్ టీ గుంతలు తీసింది. వారి పనులు పూర్తయినా వాటిని పూడ్చలేదు. అంతేకాక ఇటు జియో సైతం తమ టవర్ల కోసం గుంతలు తవ్వింది. గత రాత్రి కురిసిన వర్షానికి ఈ గుంతలన్నీ నీరు నిండిపోయాయి. నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.. నాలాల్లో నిండిన చెత్త వీరి పనులకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తోంది. -
ఎల్ అండ్ టీ సీఈవోగా సుబ్రమణ్యన్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కొత్త సీఈవోగా ఎస్ఎన్ సుబ్రమణ్యన్ నియమితులయ్యారు. జూలై 1 నుంచి ఆయన సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం సుబ్రమణ్యన్ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. 1984లో ఎల్అండ్టీలో చేరిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇటు భారత్ అటు మధ్యప్రాచ్యంలో పలు ఇన్ఫ్రా ప్రాజెక్టులను పర్యవేక్షించారు. మరోవైపు, దాదాపు 17 ఏళ్లుగా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎం నాయక్.. సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు 52 ఏళ్లుగా ఎల్అండ్టీలో నాయక్ వివిధ హోదాల్లో పనిచేశారు. 1999లో సీఈవో, ఎండీగా నియమితులైన ఆయన .. 2003లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. నాయక్ సారథ్యంలో ఎల్అండ్టీ గ్రూప్ 16 బిలియన్ డాలర్ల దిగ్గజంగా ఎది గింది. ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలతో పాటు టెక్నాలజీ, తయారీ, ఆర్థిక సేవల రంగాల్లోకి కూడా ప్రవేశించింది. 30 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1999లో రూ. 4,400 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 1.58 లక్షల కోట్లకు చేరింది. -
ఎల్ అండ్‌టీ కి భారీ ఆర్డర్లు
ముంబై: దేశీయ నిర్మాణం, ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ లార్సెన్ & టుబ్రో (ఎల్ అండ్ టి) భారీ ఆర్డర్లను సాధించింది. మార్చిలో మొత్తం రూ. 18,549 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు వెల్లడించిన మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కౌంటర్ బలపడింది. . ప్రస్తుతం బీఎస్ఈలో 1.6 శాతం పెరిగి,52 వారాల గరిష్ఠానికి చేరువలోఉంది. ఈ నెలలో ఇప్పటివరకూ సెన్సెక్స్ 3 శాతం పుంజుకోగా.. ఎల్అండ్టీ షేరు 8 శాతం పెరగడం విశేషం. కాగా.. ఈ షేరు ఇంతక్రితం 2016 ఆగస్ట్‌లో ఈ స్థాయికి చేరింది. -
ఎల్అండ్టీలో ప్రభుత్వం1.63 శాతం వాటా విక్రయం
సర్కారుకు రూ.2,100 కోట్లు న్యూఢిల్లీ: మౌలిక రంగ అగ్రగామి కంపెనీ ఎల్అండ్టీలో కేంద్ర ప్రభుత్వం తనకున్న వాటాలో 1.63 శాతాన్ని విక్రరుుంచింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,100 కోట్ల ఆదాయం సమకూరింది. స్పెసిఫైడ్ అండర్ టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యూయూటీఐ) ద్వారా శుక్రవారం ఈ విక్రయం జరిగింది. బ్లాక్ డీల్స్ మార్గంలో ప్రైవేటు సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను కొనుగోలు చేశారు. దీంతో ఎల్ఐసీ సాయం అవసరం లేకపోరుుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి మార్కెట్ నుంచి సరైన స్పందన రాని సమయాల్లో... ఎల్ఐసీ ముందుకు వచ్చి ఆ మేరకు వాటాలను కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. ఎస్‌యూయూటీఐ ద్వారా ఎల్అండ్టీలో కేంద్ర సర్కారుకు మొత్తం 8.16 శాతం వాటా ఉంది. ఇందులో 1.63 శాతం మేర వాటాలను విక్రరుుంచింది. బీఎస్ఈలో ఎల్అండ్టీ షేరు గురువారం క్లోజింగ్ ధర రూ.1,444.55 కంటే 2 శాతానికి పైగా తక్కువకే రూ.1,415కే ఒక్కో షేరును ప్రభుత్వం ఆఫర్ చేసిం ది. కాగా, శుక్రవారం ఈ షేరు బీఎస్ఈలో 2 శాతం నష్టంతో 1418.90వద్ద ముగిసింది. ఎస్‌యూయూటీఐ ద్వారా మొత్తం 51 కంపెనీల్లో కేంద్రానికి వాటాలున్నారుు. అత్యధికంగా ఐటీసీలో 11.17 శాతం, యాక్సిక్ బ్యాంకులో 11.53 శాతం వాటాలున్నారుు. -
ఎల్అండ్ టీ, సర్కారు నిర్లక్ష్యానికి బాలుడు బలి
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: మెట్రో పిల్లర్ గుంతలో పడి మరణించిన చిన్నారి నరసింహ(9) కుటుం బాన్ని ప్రభుత్వం, మెట్రో అధికారులు ఆదుకోవాలని తెలంగాణ ప్రజావేదిక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఎల్అండ్టీ అధికారుల నిర్లక్ష్యమే బాలుడిని బలిగొందన్నారు. శుక్రవారం వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. బాలుడి తల్లి జ్యోతి, అమ్మమ్మలను ఓదార్చారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ మెట్రో పనుల్లో ఎల్అండ్టీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, 40 అడుగుల గుంత తవ్వి 9నెలలుగా వదిలే శారన్నారు. రూ.4లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి ఎల్అండ్టీ, ప్రభుత్వం చేతులు దులుపుకున్నాయన్నారు. మరింత ఆర్థిక సహాయం అందించాలని, జ్యోతికి ఎల్అండ్టీలో ఉద్యోగం, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కేటారుుంచాలన్నారు. ప్రజావేదిక ఉపాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు ఎం నాగరాజు, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి కె.రాజు ఎల్లయ్య మాదిగ, రాష్ట్ర కార్యదర్శి రమేష్ కుమార్ మాదిగ పాల్గొన్నారు. చేతులు కాలాక.. చిన్నారి ప్రాణం బలిగొన్న తర్వాత మెట్రో అధికారులు నిద్ర లేచారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా శుక్రవారం గుంత చుట్టూ ఫెన్సింగ్ ఏర్పా టు చేశారు. ఐరన్ షీట్స్‌తో కంచె వేశారు. ఈ జాగ్రత్తలు ముందే తీసుకుని ఉంటే పసివాడి ప్రాణం బలయ్యేది కాదని స్థానికులు వ్యాఖ్యానించారు. -
సకాలంలో మెట్రో పూర్తి
ఎల్అండ్టీ మెట్రో రైల్ డిప్యూటీ ఎండీ సుబ్రమణ్యన్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మెట్రో రైల్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సకాలంలో పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రో రైల్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టులో 67 శాతం పనులు పూర్తయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో పనులకు ఎదురవుతున్న ఆటంకాలను గుర్తించి వాటిని అత్యున్నత స్థాయిలో పరిష్కరిస్తున్నామన్నారు. తద్వారా పనుల జాప్యం లేకుండా చూస్తున్నామన్నారు. నాగోల్-రహేజా ఐటీపార్క్, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మెట్రో ప్రాజెక్టును 2018 డిసెంబరులోగా పూర్తిచేస్తామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతి ఇలా... * నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్ఆర్నగర్ రూట్లో మొత్తం 20 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలకు వీలుగా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ పత్రాలు అందాయి. * ఇప్పటికే 59 కి.మీ. మార్గంలో పునాదులు, 56.61 కి.మీ. మార్గంలో పిల్లర్లు, 35.70 కి.మీ. మార్గంలో రైళ్ల రాకపోకలు సాగించేందుకు ట్రాక్ సిద్ధమైంది. హా అమీర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్గ్రౌండ్స్ల వద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. * మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల్లో 57 మెట్రో రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. * భరత్‌నగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. మరో 7 ఆర్ఓబీల పని శరవేగంగా జరుగుతోంది. * సుల్తాన్‌బజార్, మలక్‌పేట్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో పనులు ఊపందుకున్నాయి. -
మెట్రోరైల్ పూర్తి చేస్ధం:L&T
-
లార్సన్ అండ్ టుబ్రో చేతికి భారీ ఆర్డర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో భారీ ఆర్డర్ ను చేజిక్కించుకుంది. వివిధ వ్యాపార భాగాల్లో దాదాపు వెయ్యికోట్ల రూపాయల ఆర్డను పొందింది. ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు రూ.1,167 కోట్ల ఆర్డర్ ను అందుకున్నట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో సంస్థ తెలిపింది. విజయవాడ నగరానికి నీటి సరఫరాకు గాను ఏపీ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంనుంచి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని రెండవ వాటర రిజర్వాయర్ ప్లాంట్ నిర్మాణంకోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) నుంచి ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ నుంచి రూ.843 కోట్ల విలువ చేసే ఆర్డర్ కైవసం చేసుకుంది. కర్నాటక అర్బన్ వాటర్ సప్లై అండ్ పంపిణీ బోర్డు నుంచి మరో రూ. 259 కోట్ల విలువచేసే ఆఫర్ అందుకుంది. దీంతోపాటుగా ప్రతిష్టాత్మక వినియోగదారులనుంచి లోహశోధన మరియు మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యాపారంలో ఆర్డర్ ను హల్దియా లో పెట్ కోక్ నిర్వహణ వ్యవస్థ నిర్మాణానికి గానుఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో అదనపు ఆర్డర్లను అందుకున్నట్టు చెప్పింది. అలాగే వివిధ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల నుంచి రూ. 65 కోట్లను ఆర్డర్ ను కూడా అందుకుంది. అయితే బలహీన ఫలితాల ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో సంస్థ షేర్లలో మదుపర్లు అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో షేర్ ధర4 శాతం క్షీణించింది. సుమారు 63.85 నష్టంతో 1,495 దగ్గర నిలిచింది. -
ఆరోజు ఎప్పుడో!
*‘మెట్రో’ ప్రారంభ తేదీపై మల్లగుల్లాలు *ఇటు సర్కారు.. అటు నిర్మాణ సంస్థ.. *పాతనగరం అలైన్‌మెంట్‌పై తేలని పేచీ *ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద స్టీలు వారధికి తొలగిన అడ్డంకి సాక్షి: నగరవాసుల కలల మెట్రో ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించే తేదీపై ఇటు సర్కారు.. అటు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఎటూ తేల్చడం లేదు. దీనిపై ఎవరి దారి వారిదే అన్న చందంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగోల్–మెట్టుగూడ, మియాపూర్, ఎస్ఆర్నగర్ మార్గాల్లో 20 కి.మీ మేర మెట్రో ప్రారంభానికి అవసరమైన సాంకేతిక పనులు పూర్తయ్యాయి. నాగోల్ మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భద్రతా ధృవీకరణ సైతం జారీ చేసింది. కానీ,రైళ్ల రాకపోకలను ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారన్న అంశం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఏడాది చివరినాటికైనా ప్రారంభమవుతుందా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. మొండికేస్తున్న నిర్మాణ సంస్థ.. మెట్రో నిర్మాణ ఒప్పందం (2011) కుదిరినప్పుడు నాగోల్ రహేజా ఐటీపార్క్, ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఫలక్‌నుమా కారిడార్లలో 72 కి.మీ పనులను.. 2017 జూన్ నాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంది. కానీ ఆస్తుల సేకరణ, ప్రధాన రహదారులపై పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే సమస్యలు తలెత్తడం, అలైన్మెంట్ మార్పుపై అనిశ్చితితో ప్రాజెక్టు పూర్తిచేసే గడువును 2018 డిసెంబరుకు పొడిగించారు. గడువు పెరగడంతో తమపై సుమారు రూ. 2500 కోట్ల మేర తమపై ఆర్థిక భారం పెరిగిందని నిర్మాణ సంస్థ చెబుతోంది. ఈ నిధులను ప్రభుత్వమే తమకు చెల్లించాలని, ఇతరత్రా రాయితీలు కల్పించాలని పట్టుబడుతూ నాగోల్–మెట్టుగూడ మార్గంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో మెలికి పెట్టినట్టు సమాచారం. ఈ విషయంలో సర్కారు జోక్యం చేసుకుంటేనే ఈ ఏడాది చివరినాటికైనా మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తుంది. మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో మెట్టుగూడ, ఆలుగడ్డ బావి, ఒలి ఫెంటా బ్రిడ్జి ప్రాంతాల్లో ఇప్పటికే నెలకొన్న ద.మ రైల్వే పట్టాల పైనుంచి రైలు ఓవర్ బ్రిడ్జిలను వచ్చే ఏడాది జనవరి నాటికి వేస్తామని అధికారులు చెబుతున్నారు. అలైన్‌మెంట్‌పై తేలని పేచీ.. జేబీఎస్,ఫలక్‌నుమా మార్గంలో ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గంలో పను లు జరుగుతున్నాయి. పాతనగరంలో ప్రార్థనా స్థలాలకు నష్టం కలగని రీతిలో మెట్రో అలైన్‌మెంట్‌ను మార్చుతున్నట్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశంపై గడచిన శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగింది. దీంతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసి పాతనగరం అలైన్మెంట్ ఖరారు చేస్తామని నిండు సభలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ మూడు నెలలుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోగా.. అలైన్‌మెంట్‌పై ఎటూ తేల్చలేదు. దీంతో ఎం జీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 3.5 కి.మీ మార్గంలో మెట్రో పనులు నిలిచిపోయాయి. దీనివల్ల పాతనగరానికి మరో రెండేళ్లు ఆల స్యంగా మెట్రో రైళ్లు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మెట్రో పనులకు ఇప్పటికి 45 కి.మీ మేర పూర్తయినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఇనుప వారధికి తొలగిన అడ్డంకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ద.మ.రైల్వే పట్టాల పైనుంచి మెట్రో పట్టాలు పరిచేందుకు వీలుగా నిర్మించ తలపెట్టిన భారీ ఇనుప వారధికి అడ్డంకులు తొలిగాయి. ఈ ప్రాంతంలో పనులు జరిగేందుకు వీలుగా ద.మ.రైల్వేకు చిలకలగూడ వద్ద ఉన్న ఒక ఎకరం స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు జీఎం రవీందర్ గుప్తా అంగీకరించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చోట్ల రైలు ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. తొలుత స్టీలు వారధిని పిల్లర్లపై నిలిపే గడ్డర్లను గోపాలపురం పోలీస్‌స్టేçÙన్ నుంచి తరలించాలని భావించారు. అయితే, పనుల్లో ఆలస్యం జరగకుండా చిలకలగూడ వైపు నుంచి గడ్డర్లను తరలిస్తున్నామన్నారు. స్టీలు వారధి విశేషాలివీ.. *వారధి ఏర్పాటు చేసే ప్రదేశం: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒలిఫెంటా బిడ్జి *ఇనుప వారధి పొడవు 275 అడుగులు, బరువు 1100 టన్నులు *రోడ్డు పైనుంచి వారధి ఎత్తు: 60 అడుగులు *వారధి వంపు: 128 మీటర్లు రోడ్ కర్వ్ *నిర్మాణ విశిష్టత: ఈ స్టీలు వారధిని ఢిల్లీ సమీపంలోని గజియాబాద్‌లో తయారు చేశారు. హై స్ట్రెంత్ ఫ్రిక్షన్ గ్రిప్ దీని సొంతం *వారధి నగరానికి చేరుకునేది: జూలై 2016 ఏర్పాటు చేసే విధానం: గజియాబాద్ నుంచి ముక్కలుగా నగరానికి తరలించి చిలకలగూడ వద్ద లాంచింగ్ గడ్డర్ల సహాయంతో పిల్లర్లపై ప్రీ కాస్టింగ్ విధానంలో ఏర్పాటు చేస్తారు. -
2018 కల్లా మెట్రో ప్రాజెక్ట్ పూర్తి: గాడ్గిల్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును డిసెంబర్-2018 కల్లా పూర్తి చేస్తామని ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ..జూన్ 2 నాటికి మెట్రో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. సివిల్ వర్స్క్లో వివాదాల వల్లే ప్రాజెక్ట్ పనులు పూర్తి అవ్వడానికి జాప్యం జరుగుతుందని చెప్పారు. -
గాయత్రి ప్రాజెక్ట్స్ కు రైల్వే కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ అవకాశాలున్న రైల్వే లైన్ల నిర్మాణ రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎల్అండ్టీ, సోజిజ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో కలిసి రూ. 4,744 కోట్ల భారీ రైల్వే ఈపీసీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. ఇక్బాల్‌ఘర్- వడోదర మధ్య నిర్మిస్తున్న వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీసీ) ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్, సివిల్ బిల్డింగ్స్, వంతెనలు, రైల్వే ట్రాక్ నిర్మాంచాల్సి ఉంది. కేవలం సరుకు రవాణా కోసం ముంబై - ఢిల్లీ మధ్య 1,483 కి.మీ మధ్య ప్రత్యేక రైల్వే లైన్ నిర్మిస్తుండగా, అందులో 304 కి.మీ కాంట్రాక్టును గాయత్రి కన్సార్షియం దక్కించుకుంది. -
‘పాలమూరు’కు పోటాపోటీ
♦ రూ. 29,924 కోట్ల పనులకు టెండర్లు వేసిన పెద్ద సంస్థలు ♦ పోటీలో ఎల్అండ్టీ, నవయుగ, గాయత్రి, కేఎన్ఆర్, పటేల్, మెగా ఇంజనీరింగ్ సంస్థలు ♦ సాంకేతిక కారణంతో తెరుచుకోని ప్యాకేజీ-4, ప్యాకేజీ-15 టెండర్లు ♦ చివరి నిమిషం వరకు టెండర్ల దాఖలుకు పోటీపడ్డ కాంట్రాక్టర్లు ♦ టెక్నికల్ బిడ్‌ను తెరిచిన అధికారులు.. ఈ నెల 29న ప్రైస్‌బిడ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు భారీగా పోటీ నెలకొంది. ఈ పనులకు సాంకేతిక టెండర్లను శనివారం సాయంత్రం బహిర్గతం చేశారు. మొత్తంగా రూ.29,924.78 కోట్ల విలువైన 18 ప్యాకేజీల పనులు దక్కించుకునేందుకు పేరుపొందిన కాంట్రాక్టు సంస్థలు క్యూ కట్టాయి. సాంకేతిక కారణాలతో ప్యాకేజీ-4, ప్యాకేజీ-15ల టెండర్లను తెరవలేదు. మిగతా 16 ప్యాకేజీలకు ఎల్అండ్టీ, నవయుగ, గాయత్రి, మెగా, కేఎన్ఆర్, పటేల్ ఇంజనీరింగ్ వంటి సంస్థలు పోటీపడ్డాయి. ఆయా సంస్థలు సాంకేతిక నిబంధనల మేరకు అర్హత సాధించాయా, లేదా? అన్న అంశాలను పరిశీలిస్తామని... దీనికి సుమారు 9 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ నెల 29న ప్రైస్‌బిడ్‌ను తెరుస్తారు. అందులో తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఎల్-1గా గుర్తించి వారికి టెండర్ ఖరారు చేయనున్నారు. భారీగా పనులు.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 62 మండలాల్లోని 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులకు గత నెల 17న నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించిన టెక్నికల్ బిడ్లను శనివారం సాయంత్రం ఆరున్నరకు తెరిచారు. బిడ్ సమయం ముగిసే కొద్ది నిమిషాల ముందు వరకూ కూడా టెండర్లు దాఖలు కావడం గమనార్హం. పెద్ద ప్యాకేజీల వైపే బడా సంస్థల మొగ్గు ప్రాజెక్టులోని పెద్ద ప్యాకేజీల పనులను దక్కించుకునేందుకు పటేల్, నవయుగ, ఎల్ అండ్‌టీ, మెగా వంటి సంస్థలు పోటీలో నిలిచాయి. రూ. 3,226.46 కోట్లు విలువైన పనులున్న ప్యాకేజీ-1 కోసం పటేల్, నవయుగ కంపెనీలు టెండర్ వేయగా... రూ. 5,027.90 కోట్ల విలువైన ప్యాకేజీ -5 పనులకు మెగా, ఎల్అండ్టీ, నవయుగ సంస్థలు టెండర్లు వేశాయి. ప్యాకేజీ-8లో ఉన్న రూ. 4,303.37 కోట్ల పనులకు, రూ. 2వేల కోట్ల పైచిలుకు విలువున్న ప్యాకేజీ-7, ప్యాకేజీ-16, ప్యాకేజీ-18ల పనులకు సైతం ఇవే సంస్థలు పోటీ పడుతున్నాయి. రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువ విలువైన ప్యాకేజీల పనులకు మాత్రం నాలుగు నుంచి ఐదేసి సంస్థలు పోటీ పడ్డాయి. రూ. 1,669.99 కోట్ల విలువైన ప్యాకేజీ-4, రూ. 838.30 కోట్ల విలువైన ప్యాకేజీ-15ల టెండర్లను ఆదివారం తెరిచే అవకాశముంది. -
ఎల్&టీకి 4,షాపుర్జీ పల్లోంజీకి 2..
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి టెండర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సీఆర్డీఏ సలహామండలితో సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పలు కంపెనీలు అధికమొత్తంలో టెండర్లు దక్కించుకున్నాయి. నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ ఎల్ అండ్ టీ..సచివాయంలో నాలుగు భవనాలు...అలాగే షాపుర్జీ పల్లోంజీ సంస్థ రెండు భవనాలు నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్నాయి. చదరపు అడుగుకు రూ.3,350కి నిర్మించేందుకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.350 అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా నోటిఫికేషన్ ప్రకారం చదరపు అడుగు రూ.3వేలుగా ప్రభుత్వం నిర్థారించగా, 5 శాతానికి మించి ఎక్కువ చెల్లించకూడదనే నిబంధన ఉన్నా సర్కార్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. కాగా ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 180 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా మంగళగిరి మండంలోని వెలగపుడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టనుంది. 26 ఎకరాల స్థలంలో ఏపీ తాత్కాలిక సచివాయలం నిర్మాణం జరగనుంది. -
మెట్రో తొలి, మలిదశ మార్గాలిలా
మొదటి దశ మియాపూర్ - ఎల్బీనగర్ 29కి.మీ. జూబ్లీబస్‌స్టేషన్ - ఫలక్‌నుమా15 కి.మీ. నాగోల్ - రహేజాఐటీపార్క్ 28 కి.మీ. రెండో దశ ఎల్బీనగర్ - హయత్‌నగర్ 7 కి.మీ. మియాపూర్ - పటాన్చెరు 13 కి.మీ. ఫలక్‌నుమా - శంషాబాద్ 28 కి.మీ. తార్నాక - ఈసీఐఎల్ 7 కి.మీ. రాయదుర్గం-గచ్చిబౌలి-శంషాబాద్ 28 కి.మీ. గ్రేటర్ వాసుల కలల ప్రాజెక్టు... మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వనగరాల్లో ఉన్న 200 మెట్రో రైలు ప్రాజెక్టులకు భిన్నంగా నగరంలో అత్యాధునిక ప్రాజెక్టు ఈ ఏడాది ప్రథమార్థంలో అందుబాటులోకి రాబోతోంది. సుమారు రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో... ఈ ప్రాజెక్టు తొలిదశలో 72 కి.మీ మార్గంలో మూడు కారిడార్లలో పనులు చేపడుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలిదశ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ చెబుతోంది. కాగా రెండోదశ మార్గం ఐదు కారిడార్లలో 83 కి.మీ మార్గంలో ఏర్పాటుకానుంది. మెట్రో తొలి, మలిదశ మార్గాల వివరాలు గ్రాఫ్‌లో... -
ఎల్ అండ్ టీ లాభం రూ.996 కోట్లు
* 16% వృద్ధి * ఆదాయం 11% అప్ న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 16 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.862 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.996 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. నికర అమ్మకాలు రూ. 21,159 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ. 23,393 కోట్లకు, కన్సాలిడేటెడ్ స్థూల ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.23,605 కోట్లకు పెరిగి నట్లు వివరించింది. మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం రూ.7,658 కోట్లని(32%) పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.19,374 కోట్ల నుంచి రూ.21,495 కోట్లకు ఎగిశాయని తెలిపింది. ఈ క్యూ2లో రూ.28,620 కోట్ల తాజా ఆర్డర్లు సాధించామని, వీటిల్లో 38 శాతం(రూ.10,973 కోట్లు) విదేశాల నుంచి వచ్చినవేనని తెలిపింది. ఈ ఏడాది 30 నాటికి కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 14 శాతం వృద్ధితో రూ.2,44,097 కోట్లకు చేరిందని వివరించింది. లాభదాయక ప్రాజెక్టులపైనే దృష్టి ఈ క్యూ2లో పెట్టుబడుల వాతావరణం మందగమనంలో ఉందని కంపెనీ తెలిపింది. ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా ఉన్నాయని, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. తమ ఆర్డర్ బుక్ భారీగా ఉందని, లాభదాయక ప్రాజెక్టులపైననే దృష్టి కేంద్రీకరిస్తున్నామని, ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటే మంచి వృద్ధిని సాధించగలమని ధీమా వ్యక్తం చేసింది. -
ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్డీలా?
మొన్నటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన ఐఐటీలకు ఇప్పుడు ఆదరణ అంతగాలేదు. ఆ సంస్థలలో మునుపటి ప్రమాణాలు లేవు. అధ్యయనం లేదు. పరిశోధనలేదు. ఈరోజు ప్రపంచంలోని అత్యుత్తమమైన 200 విద్యాసంస్థలను పేర్కొంటే ఆ జాబితాలో మన విద్యాసంస్థ ఒక్కటీ ఉండదు. కొన్ని వాస్తవాలు అభూతకల్పనల కంటే ఆశ్చర్యకరంగా, నమ్మశక్యం కాకుం డా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 368 ప్యూన్ (చప్రాసీ) పోస్టులు నింప డానికి ప్రకటన జారీ చేస్తే 23 లక్షల దరఖాస్తులు వచ్చినట్టూ, అందులో 250 పీహెచ్డీ చేసిన నిరుద్యోగుల నుంచి వచ్చినట్టూ వార్త. ఈ పరిస్థితి దేనికి సంకే తం? మన ఆర్థికవ్యవస్థ అనారోగ్యానికా లేక మన విద్యావ్యవస్థ దుస్థితికా లేక రెండింటికా? ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌కి పరిమితమైన వ్యవహారం కాదు. దేశం అంతటా ఇదే పరిస్థితి. చదువుకు తగిన ఉద్యోగం రాదు. చదివినంత మాత్రాన ఉద్యో గానికి అవసరమైన మెలకువలు తెలియవు. చదువు వేరు. ఉద్యోగం వేరు. బతుకుతెరువు నేర్పే చదువులు చెప్పడం లేదు. ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్డీ పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవడం ఏమిటి? పీహెచ్డీ చేసినవారికి ఉద్యో గాలు ఎందుకు రాలేదు? పొట్టనింపని పీహెచ్డీ విలువ ఏపాటిది? దాదాపు మూడు దశాబ్దాలుగా సగటున ఏటా ఆరు శాతం స్థూల జాతీయ ఉత్పత్తి పెరు గుదల నమోదు చేసుకుంటూ వచ్చిన దేశంలో ఉద్యోగాల సృష్టి గణనీయంగానే జరుగుతోంది. తగిన అభ్యర్థులు లభించని కారణంగా కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఒక విచిత్రమైన స్థితి. పీహెచ్డీ చేసిన నిరుద్యోగులు ఒక వైపు, అర్హులు లేని కారణంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మరో వైపు. ఉద్యో గాలకు పనికి వచ్చే చదువులు (ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్) నేర్పాలనే ఇంగి తాన్ని మన విధాన నిర్ణేతలు పాటించని ఫలితం ఈ విషాదం. ఉబుసుపోక పీహెచ్డీ పట్టా తీసుకున్న తర్వాత ఉద్యోగం దొరకని యువకుడు లేదా యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం, అప్పటికీ ఉద్యోగం రాకపోతే ఊరకనే ఉండటం ఎందుకని పీహెచ్‌డీకి రిజిస్టర్ చేయించుకోవడం, సమాజానికి ఎటువంటి సంబంధం కానీ ప్రయోజనం కానీ లేని అల్పమైన విషయంపైన పరిశోధన చేయడం, గైడు సహాయంతోనో, అధ్యాపకుల సహకారంతోనో థీసిస్ రాయ డం, పీహెచ్డీ పుచ్చుకోవడం మన దేశంలో రివాజు. పెద్దగా శ్రమించకుండానే పీహెచ్డీ పట్టా చేతికి వస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ, పీహెచ్డీ పూర్తయ్యేనాటికీ తేడా ఏమిటి? వయస్సు పెరుగుతుంది కానీ జ్ఞానం అంతగా పెరగదు. ఉద్యోగాలకు వివిధ సంస్థలు నిర్వహించే పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. ఉత్తీర్ణులు కారు. ఇంటర్వ్యూలలో ఎంపిక కారు. ఏ ఉద్యోగం ఖాళీ ఉన్నదని తెలిసినా తమ చదువుతో, అర్హతతో నిమిత్తం లేకుండా దరఖాస్తు చేసు కుంటారు. ప్యూను ఉద్యోగమైనా అది ప్రభుత్వ ఉద్యోగం కనుక పరవాలేదను కుంటారు. అమెరికాలో కానీ యూరప్‌లో కానీ ఒక విద్యార్థి చేతికి పీహెచ్డీ పట్టా రావాలంటే అయిదేళ్ళ కఠోర పరిశ్రమ చేయాలి. ప్రవీణుల బృందం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. తమ థీసిస్‌లో రాసిన అంశాలనూ, చేసిన నిర్ధారణలనూ సమర్థించుకోవాలి. అటువంటి పరిశోధనలను ప్రభు త్వాలు విధాన నిర్ణాయక క్రమంలో పరిశీలనాంశాలుగా స్వీకరిస్తాయి. పీహెచ్డీ పూర్తి కాగానే అధ్యాపకులుగానో, శాస్త్రజ్ఞులుగానో ఉద్యోగాలలో చేరతారు. పరిశ్రమలకూ, విద్యాసంస్థలకూ మధ్య అనుసంధానం మన దేశంలో తక్కువ. పరిశ్రమల అవసరాలకు తగిన ప్రవీణులను విద్యాసంస్థలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. అందుకే ఎల్ అండ్ టీ వంటి సంస్థలు తమ సిబ్బందిని తయారు చేసుకోవడానికి స్వయంగా శిక్షణసంస్థలు నిర్వహిస్తున్నాయి. మీడి యా సంస్థలు సైతం విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే పట్టాలపట్ల విశ్వాసం లేక ప్రవేశ పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైనవారికి ఆరు మాసాలకు తగ్గకుండా మీడియా మెలకువలలో శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఉద్యోగంలో పెట్టుకుంటు న్నాయి. ప్రభుత్వ రంగంలోని విద్యాసంస్థలే కాదు ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా ప్రమాణాలు అంతంత మాత్రమే. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో ‘యాస్పైరింగ్ మైండ్స్’ అనే సంస్థ విద్యార్థుల యోగ్యతలపైన ఒక అధ్యయనం చేసింది. ఇందుకోసం 55,000 మంది ఇంజనీరింగ్ పట్టభదులను ప్రశ్నించింది. వారిలో మూడు శాతం మందికి మాత్రమే ఐటీ సంస్థలలో ఉద్యోగాలు పొందే అర్హత ఉన్నదని నిర్ధారించింది. 17 శాతం మందికి కనీసమైన ప్రావీణ్యం లేదు. 92 శాతం మందికి ప్రోగ్రామింగ్‌లో ప్రవేశం లేదు. 78 శాతం మందికి ఇంగ్లీ షులో భావవ్యక్తీకరణ సమస్య. 56 శాతం మందికి విశ్లేషణ సామర్థ్యం (ఎనలిటికల్ స్కిల్స్) లేదు. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ దేశంలో ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించు కుంటున్నారు. అమెరికాలోనో, యూరప్‌లోనో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారికి కొంత ప్రావీణ్యం అబ్బుతుంది. స్వతహాగా తెలివితేటలు ఉండటం వల్ల వారు విదేశాలలో ఉద్యోగాలలో రాణిస్తున్నారు. అటువంటివారిని చూపించి ‘భారత యువతీయువకులలాగా మీరు కూడా సాంకేతిక ప్రావీణ్యం సంపాదించుకో వాలి’ అంటూ అమెరికా యువతకు బరాక్ ఒబామా ఉద్బోధిస్తూ ఉంటారు. విద్యే ఉపాధికి సోపానం తీరం దాటి అంతర్జాతీయ వేదికపైన పోటీలో నిలిచి గెలుస్తున్నవారికంటే దేశం లోనే నిరుద్యోగులుగా కునారిల్లుతున్న ఇంజనీరింగ్ పట్టభద్రుల సంఖ్య చాలా రెట్లు అధికం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ కళాశాలలు లేని చోట్ల కూడా ఇంజనీరింగ్ కళాశాలలను వేలంవెర్రిగా ప్రోత్సహించి లక్షలాది మంది పట్టభద్రులను తయారు చేసి వీధులలోకి వదిలిన తర్వాత ఏ ఉద్యోగం ఖాళీ ఉన్నా దర ఖాస్తుదారులలో సగానికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉంటున్నారు. కాలక్రమంలో విద్య ఉపాధికి సోపానం అన్న దృక్పథం జన సామాన్యంలో బలపడింది. ప్రతి కుటుంబం తన ఆదాయంలో 7.5 శాతం విద్యపైన ఖర్చు చేస్తున్నది. ఇది ఇతర ‘బ్రిక్స్’ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో కంటే అధికం. ఆదాయం పెరగడం, వెనకబడినవర్గాల విద్యా ర్థుల ఫీజు ప్రభుత్వాలు చెల్లించడం కారణంగా ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణులైన వారిలో 2004లో 11 శాతం మంది ఉన్నత విద్యాసంస్థలలో చేరగా 2014 నాటికి 23 శాతం మంది చేరారు. విద్యాహక్కు చట్టం ఫలితంగా అక్షరాస్యత 1991లో 54 శాతం నుంచి 2014 నాటికి 74 శాతానికి పెరిగింది. ఈ దశాబ్దం చివరికి మన దేశంలో 25 నుంచి 34 సంవత్సరాలలోపు వయస్సు గల పట్టభద్రులు 2.40 కోట్ల మంది ఉంటారు. ఇది ప్రపంచంలోని పట్టభద్రులలో 12 శాతం. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన యువకులు ఇంజనీరింగ్ చదివిన తర్వాత వ్యవసాయ పనులలో పాల్గొనకుండా, ఉద్యోగం లేకుండా రికామిగా మిగిలిపోయి అటు కుటుంబానికీ, ఇటు సమాజానికీ సమస్యగా పరిణమిస్తు న్నారు. మన విద్యావిధానంపైనా, విద్యాసంస్థల ప్రమాణాలపైనా, ఇంజనీరింగ్ పట్టభద్రుల ప్రావీణ్యరాహిత్యంపైనా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేయడం ఈ నేపథ్యంలోనే. మొన్నటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఆదరించిన ఐఐటీలకు ఇప్పుడు ఆదరణ అంతగాలేదు. ఆ సంస్థ లలో మునుపటి ప్రమాణాలు లేవు. అధ్యయనం లేదు. పరిశోధన లేదు. ఈ రోజు ప్రపంచంలోని అత్యుత్తమమైన 200 విద్యాసంస్థలను పేర్కొంటే ఆ జాబి తాలో మన విద్యాసంస్థ ఒక్కటీ ఉండదు. ఇంత పెద్ద దేశం, 2050 నాటికి అమె రికా, చైనాల సరసన నిలుస్తుందని ప్రవీణులు అంచనా వేస్తున్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచస్థాయి విద్యాసంస్థను ఒక్కదానిని కూడా నెలకొల్పలేకపోవడం ఘోర మైన వైఫల్యం. ఇందుకు సమాజాన్నీ, ఇంతకాలం దేశాన్ని ఏలిన రాజకీయ పార్టీలనూ నిందించాలి. విపణి నియంత్రించే ఆర్థిక వ్యవస్థ (మార్కెట్ ఎకానమీ) ఉన్న దేశాలలో సైతం ప్రాథమిక విద్య, ఆరోగ్యం ప్రభుత్వ నిర్వహణలోనే ఉంటాయి. ఉన్నత విద్య మాత్రం ప్రైవేటురంగంలో ఉంటుంది. మన దేశంలో ప్రాథమిక, ఉన్నత అన్న తేడా లేకుండా ఆరోగ్య, విద్యారంగాల నుంచి ప్రభుత్వం క్రమంగా నిష్ర్క మించింది. ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారిలో 60 శాతం మంది ప్రైవేటు విద్యాసంస్థలలోనే చదువుతున్నారు. దేశంలోని 14 లక్షల విద్యాసం స్థలలో అయిదు లక్షల సంస్థలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. మూడు కోట్ల మంది విద్యార్థులు ఈ సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలూ, విశ్వవిద్యాలయాలూ కొన్ని ఫక్తు వ్యాపార సరళిలో నడుస్తున్నప్పటికీ, కొన్ని మాత్రం విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు అంకితభావంతో కృషి చేస్తు న్నాయి. విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్‌జీ పేరుతో నెలకొల్పిన విశ్వ విద్యాలయం, హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడి పేరు మీద స్థాపించిన శివ్ నాడార్ విశ్వవిద్యాలయం, ఉక్కు పారిశ్రామికవేత్త జిందాల్ పేరుతో వెలసిన యూనివ ర్సిటీ, ఢిల్లీలోని అశోకా యూనివర్సిటీ ఈ కోవలోకి వస్తాయి. అయిదారేళ్ళలో వీటిలో కొన్ని ప్రపంచస్థాయి విద్యాసంస్థలుగా పరిగణన పొందే అవకాశం ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాలు మంచి పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలతో పొత్తు పెట్టుకున్నాయి. ఐటీ, మేనేజ్మెంట్ విద్యలో ఇప్పటికే కొన్ని సంస్థలు ఉన్నతమైన సేవలు అందిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రకటించిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్‌కు ఈ ఏడాది కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ సంస్థ 62 లక్షల మందికి వివిధ రంగాలలో ఉద్యోగాలకు అవసర మైన శిక్షణ ఇస్తుంది. విద్యకు పౌరులు ఇస్తున్న ప్రాధాన్యం ప్రభుత్వాలు ఇవ్వక పోవడం మన దౌర్భాగ్యం. విద్యావిధానంలో చీటికీమాటికీ మార్పులు తీసుకు రావడం, ప్రమాణాల విషయంలో పట్టింపు లేకపోవడం, అధ్యాపకుల పని తీరును సమీక్షించాలన్న నియమంలేకపోవడం, విద్యార్థులకు నియమావళి లేక పోవడం మన విద్యావ్యవస్థను వేధిస్తున్న ప్రధానమైన సమస్యలు. అపారమైన అవకాశాలు ఆర్థికాభివృద్ధికీ, పరిశ్రమల విస్తరణకూ అవసరమైన నైపుణ్యం ప్రసాదించే విద్యాసంస్థలకు భవిష్యత్తు ఉంది. ప్రముఖ శాస్త్రజ్ఞుడు రఘునాథ్ ఎ మషేల్కర్ (ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ మాజీ అధ్యక్షడు) అన్నట్టు మన దేశంలోని వనరులను విజ్ఞతతో వినియోగించుకోగలిగితే మరో పదేళ్ళలో మన దేశం ప్రపంచంలోనే మేటి విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందగలదు. విద్యారంగంలో అవసరమైన సంస్కరణలు అమలు చేస్తూ, అధ్యాపకులకు మంచి జీతాలు ఇస్తూ, పరిశోధనకు పెద్దపీట వేసినట్లయితే దేశంలో ఉన్న అపారమైన అభివృద్ధి అవకాశాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవచ్చు. మరో రెండు దశాబ్దా లలో ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా గల దేశంగా ఇండియా చైనాను అధిగ మించబోతోంది. ఆర్థికంగా కూడా చైనాను అధిగమించాలన్నా లేదా కనీసం చైనా సరసన సగర్వంగా నిలవాలన్నా శాస్త్ర, సాంకేతిక విద్యావ్యవస్థను పెంపొం దించుకోవాలి. అటు పారిశ్రామిక, సేవా రంగాలకూ, ఇటు విద్యారంగానికి మధ్య అనుసంధానం సాధించాలి. అప్పుడు పీహెచ్డీ డిగ్రీలు అంత తేలికగా చేతికి అందవు. పీహెచ్డీ నిజంగా చేసినవారికీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారికీ ప్యూన్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవలసిన దుస్థితి ఉండదు. చదువు సార్థకం అవుతుంది. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ -
మెట్రో రైలు.. పరుగులకు సిద్ధమౌతూ..!
-
ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాలకు విఘాతం లేకుండా..
* మెట్రో అలైన్మెంట్ మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ * మూడు చోట్ల మార్పులకు ప్రతిపాదన * పాతబస్తీలో మెట్రో అలైన్మెంట్ మార్పుపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ముస్లింల ప్రార్థనామందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇతర చిహ్నాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ‘మెట్రో’ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మూడుచోట్ల మెట్రోరైలు మార్గాన్ని మార్చాలని ఇదివరకే తాము ఎల్ అండ్ టీకి స్పష్టం చేసినట్లు వివరించారు. పాతబస్తీలో అలైన్మెంట్ మార్పునకు సంబంధించి ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శులతో సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో సూచించిన మార్పులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఎక్కడెక్కడ మార్పులు అవసరం, మెట్రో రైలు ఏ మార్గం నుంచి వెళ్లాలనే వివరాలను ఎల్ అండ్ టీకి అధికారికంగా తెలియజేసేందుకు ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ భవనంతోపాటు, ప్రజల మనోభావాలతో ముడిపడివున్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అసెంబ్లీ వెనుకవైపు నుంచి వెళ్లేలా మొదటి మార్పు... వ్యాపార కేంద్రంగా పేరొందిన సుల్తాన్‌బజార్, బడిచౌడి మధ్యనుంచి కాకుండా ఉమెన్స్ కళాశాల వెనుకవైపు నుంచి వెళ్లేలా రెండో మార్పు ఉండాలని సూచించినట్టు తెలిపారు. ఇక, పాతబస్తీలో ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ ప్రకారం నిర్మాణం జరిగితే ఏడు హిందూ దేవాలయాలు, 28 ముస్లింల ప్రార్థనా మంది రాలు, వెయ్యి నివాసగృహాలు దెబ్బతింటాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. ఇక్కడ అలైన్మెంట్ మార్పుతో అక్కన్న మాదన్న దేవాలయం, జగదీష్ టెంపుల్, బంగారు మైసమ్మ, లక్ష్మి నర్సింహ దేవాలయంతోపాటు ఆజాఖానా జోపురా, అసుర్ఖానా నాల్ ముబారక్, ఇత్తెబార్చౌక్ మసీదు. కోట్లా మసీదు తదితర ఆధ్యాత్మిక కట్టడాలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి అలైన్మెంట్ వివరాలను ప్రభుత్వం అధికారికంగా ఎల్ అండ్‌టీకి అందించనుంది. ఇదిలాఉండగా, పాతబస్తీలో మెట్రోరైలు అలైన్‌మెంట్‌కు సంబంధించి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. అభివృద్ధిలో భాగస్వాములవుతాం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో తామూ భాగస్వాములవుతామని ఎల్అండ్టీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎఎం నాయక్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన రాసిన లేఖ విశేషాలను సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్, మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తామని, ఉభయ ప్రయోజనం ఉండాలన్నది తమ అభిమతమని నాయక్ వివరించారు. ఈ నెల 15న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఆయన ప్రదర్శించిన దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలు, ముందుచూపు నచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన సుదీర్ఘ పోరాటం తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధితోపాటు సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ముఖ్యమంత్రి విజన్ తమను ప్రభావితం చేసిందన్నారు. గుజరాత్‌లోని హజిరాలో ఎల్అండ్టీ నిర్మించిన ప్రసిద్ధ తయారీ రంగ సంస్థను సందర్శించాలని ఆ లేఖలో కేసీఆర్‌ను కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వివరించింది. -
గడువులోగా మెట్రో పనులు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న హైదరాబాద్ నగర మెట్రోరైలు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వపరంగా చర్యలు ముమ్మరమయ్యాయి. రైలు మార్గం ఏర్పాటుకు అడ్డంకుగా ఉన్న ప్రభుత్వ ఆస్తుల అప్పగింతకు గడువు విధించింది. వివిధ ప్రభుత్వ విభాగాలు, హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులతో సచివాలయంలో గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మెట్రో ప్రాజెక్టును గడువు ప్రకారం 2017 చివరి నాటికి పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎస్ ఆదేశించారు. ప్రధాన రహదారులపై పనులు జరిగేందుకు వీలుగా మూడు మెట్రో కారిడార్ల పరిధిలో 283 సమస్యాత్మక ఆస్తులను డిసెంబర్ చివరి నాటికి తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు నిర్దేశించారు. మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో మార్గంలో ప్రస్తుతానికి 45 కి.మీ మార్గంలో పనులు పురోగతిలో ఉన్నట్లు ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ అధికారులు ఆయనకు వివరించారు. మొత్తం మూడు కారిడార్లలో 65 స్టేషన్లకుగాను 27 స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయని సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. నాగోల్-మెట్టుగూడ(మొదటి దశ) ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో వయాడక్ట్, ట్రాక్, ట్రాక్షన్ సిస్టం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ మార్గంలో ఏడు మెట్రో రైళ్లకు ప్రతిరోజూ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎస్‌కు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు, ఎల్అండ్టీ మెట్రో రైలు చైర్మన్ దియోస్థలి, ఎండీ గాడ్గిల్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, జలమండలి, రైల్వేశాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ.. సికింద్రాబాద్‌లోని తార్నాక మార్గంలో ఉన్న లేఖాభవన్, ఒలిఫెంటా బ్రిడ్జి ప్రాంతాల్లోని రైల్వే స్థలాలను మెట్రో స్టేషన్ నిర్మాణానికి కేటాయించాలని ఆదేశించారు. ఆలుగడ్డబావి వద్ద రోడ్ అండర్‌బ్రిడ్జికి సైతం స్థలం కేటాయించాలని సూచించారు. ఇమ్లీబన్(ఎంజీబీఎస్) వద్ద ఇంటర్ ఛేంజ్ మెట్రో స్టేషన్‌కు అవసరమైన స్థలాన్ని ఆర్టీసీ అధికారులు ఒప్పందం ప్రకారం తక్షణం అప్పగించాలని ఆదేశించారు. చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, గోపాలపురం పోలీస్‌స్టేషన్ భవనాలను పోలీసు శాఖ తక్షణం జీహెచ్ఎంసీకి అప్పజెప్పాలని ఆదేశించారు. -
మెట్రో రైలు ప్రాజెక్టుపై నీలి నీడలు!
-
ఢమాల్స్
మెట్రోకారిడార్లలో బడా వాణిజ్య సంస్థల నిర్మాణంపై డోలాయమానం అదనంగా రూ.1,500 కోట్ల వీజీఎఫ్ నిధులు కోరుతున్న ఎల్అండ్టీ నిర్మాణ పరమైన అనుమతుల్లోనూ జాప్యం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలు మెట్రో ప్రాజెక్టుకు శాపంలా పరిణమించాయి. అంచనాలు తలకిందులు కావడం, జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన అనుమతులు జాప్యం కారణంగా కారిడార్లలో బడామాల్స్ నిర్మాణంపై ఎల్అండ్టీ సంస్థ డోలాయమానంలో పడింది. పూర్తి స్థాయి ఆక్యుపెన్సీపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రవాణా ఆధారిత అభివృద్ధి(ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్కు)కి కేంద్రం నుంచి అదనంగా రూ.1,500 కోట్ల సర్దుబాటు నిధులు (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) కోసం యత్నాలు చేస్తోంది. ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, అమీర్‌పేట్ ప్రాంతాల్లో తొలివిడతగా ఎల్అండ్టీ నిర్మించాలనుకున్న భారీ మెట్రో షాపింగ్ మాల్స్‌కు నాటి ఉమ్మడి ఏపీ సర్కార్ స్థలాలను కేటాయించింది. మెట్రో ప్రాజెక్టు తొలిదశ పూర్తయ్యే నాటికే సుమారు 60 లక్షల చదరపు మీటర్ల మేర బడా మెట్రో మాల్స్ (వాణిజ్య స్థలాలు) నిర్మించాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ 2010 సెప్టెంబరు 4కు ముందే (ఒప్పందం కుదిరిన రోజు) నిర్ణయించింది. దశలవారీగా 2017 నాటికి 18.5 మిలియన్ చదరపు మీటర్ల స్థలాల్లో వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలన్నది సంస్థ లక్ష్యం. తొలివిడత చేపట్టాలనుకున్న మాల్స్‌కు జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిర్మాణ పరమైన అనుమతులు ఆలస్యమవుతుండడం, మరోవైపు తాము తొందరపడి మాల్స్ నిర్మించినప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో భర్తీ (ఆక్యుపెన్సీ) చేసే అవకాశం ఉంటుందా? అన్న అంశంపై సదరు సంస్థ ప్రస్తుతం డోలాయమానంలో పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెట్రో కారిడార్లలో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్కు)కి కేంద్రం నుంచి అదనంగా రూ.1,500 కోట్ల సర్దుబాటు నిధులు (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) రాబట్టేందుకు తమకు సహకరించాలని ఎల్అండ్టీ సంస్థ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం. ఇదే అంశంపై చర్చించేందుకు ఎల్అండ్టీ సంస్థలో ఉన్నత స్థాయి చైర్మన్ ఏఎం నాయక్ త్వరలో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు తెలిసింది. రూ.1,500 కోట్ల వీజీఎఫ్ నిధుల కోసం పట్టు.. మెట్రో ప్రాజెక్టుకు గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,458 కోట్లు వీజీఎఫ్ (సర్దుబాటు నిధులు) మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తరువాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మెట్రో కారిడార్లలో రవాణా ఆధారిత ప్రాజెక్టులు, మాల్స్ అభివృద్ధికి అదనంగా మరో రూ.1,500 కోట్లు కేటాయించాలని ఎల్అండ్టీ సంస్థ పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుత తరుణంలో మెట్రో ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరికొన్ని ప్రభుత్వ స్థలాలు, వాణిజ్య ప్రకటన పన్ను మినహాయింపు వంటి రాయితీలు కావాలని ఎల్అండ్టీ తెలంగాణ సర్కార్‌ను కోరుతుండడం గమనార్హం. మెట్రోనా.. రియల్టీ ప్రాజెక్టా..? అందరూ పైకి చెబుతున్నట్లుగా మహానగర మెట్రో రైలు ప్రాజెక్టు కేవలం ప్రయాణికులకు అత్యుత్తమ ప్రయాణ సాధనమే కాదు... ఇది ముమ్మాటికీ రియల్టీ ప్రాజెక్టేనన్న వాదనలు తెరపైకి వచ్చాయి. దేశంలో తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.12,674 కోట్లను ఎల్అండ్టీ సంస్థ పలు జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా సేకరించి వ్యయం చేస్తోంది. నాలుగేళ్లుగా సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ చేసే వ్యయాన్ని దశలవారీగా సమకూర్చుకునేందుకు నాటి ఉమ్మడి ప్రభుత్వం.. ఒప్పంద పత్రంలో నగరం నడిబొడ్డునున్న ప్రధాన ప్రాంతాల్లో రూ.కోట్లు విలువచేసే 269 ఎకరాలప్రభుత్వ స్థలాలను నిర్మాణ సంస్థకు కట్టబెట్టింది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.3,380 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఇంత విలువైన స్థలాలను సుమారు 60 ఏళ్లపాటు ఎలాంటి లీజు లేకుండా సదరు సంస్థకు కట్టబెట్టడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. 269 ఎకరాల్లో 57 ఎకరాల్లో రియల్టీ ప్రాజెక్టులే.. నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లో మొత్తం 72 కిలోమీటర్ల మార్గంలో మెట్రో ప్రాజెక్టు నిర్మితమవుతున్న విషయం విదితమే. ఈ కారిడార్ల పరిధిలో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి నాటి ఉమ్మడి ప్రభుత్వం 269 ఎకరాల ప్రభుత్వ స్థలాలను కేటాయించింది. ఇందులో 57 ఎకరాల్లో వాణిజ్య స్థలాలు, మాల్స్, కార్పొరేట్ సంస్థలు కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా బహుళ అంతస్తుల భవంతులను నిర్మించి బడా కార్పొరేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంటే మొత్తం సంస్థకు కేటాయించిన స్థలాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రూపేణా 57 ఎకరాల స్థలాన్ని వినియోగించాలన్నది నిర్మాణ సంస్థ లక్ష్యం. అంటే మియాపూర్ మెట్రో డిపోకు కేటాయించిన 104 ఎకరాల స్థలంలో 99 ఎకరాలు డిపో అవసరాలకు వినియోగించనున్నారు. మరో ఐదు ఎకరాల్లో రియల్టీ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఇక ఉప్పల్ మెట్రో డిపోకు నాగోల్‌లో కేటాయించిన వంద ఎకరాల స్థలంలో 97 ఎకరాల్లో డిపో, మరో మూడు ఎకరాల్లో వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలని నిర్మాణ సంస్థ సంకల్పించింది. ఫలక్‌నుమా ప్రాంతంలో 17 ఎకరాల స్థలంలో 80 శాతం స్థలంలో మెట్రో డిపో, మరో 20 శాతం స్థలంలో వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయనుంది. ఇక అమీర్‌పేట్, పంజగుట్ట, ఎల్బీనగర్, ఓల్డ్ గాంధీ ఆస్పత్రి, రాయదుర్గం, నాంపల్లి, బాలానగర్, పరేడ్ గ్రౌండ్స్, ఎర్రమంజిల్, మలక్‌పేట్, యూసుఫ్‌గూడా, ఎంజీబీఎస్, కూకట్పల్లి, హైదర్‌నగర్ ప్రాం తాల్లోనూ వాణిజ్యస్థలాల ఏర్పాటుకు వీలుగా నిర్మాణ సంస్థకు స్థలాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలాలకు గాను నిర్మాణ సంస్థ (ఎల్అండ్టీ) నుంచి సుమారు 60 ఏళ్లపాటు ఎలాం టి లీజు మొత్తాన్ని వసూలు చేయరాదని ఒప్పంద పత్రంలోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డైలమా ఇక్కడే.. మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 45 శాతం మాత్రమే. మిగతా 55 శాతం రెవెన్యూ రియల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. మూడు మెట్రో కారిడార్లలో సుమారు 57 ఎకరాల్లో చేపట్టబోయే వాణిజ్య స్థలాల అభివృద్ధి, రవాణా వసతిసదుపాయాల కల్పన, మాల్స్ నిర్మాణంతో వచ్చే లీజులు, అద్దెల రూపేణా మాత్రమే నిర్మాణ సంస్థకు ఆదాయం సమకూరనుంది. రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్థిక కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. రియల్టీ, టూరిజం, నిర్మాణరంగం తదితర మఖ్యమైన రంగాల్లో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో మాల్స్ నిర్మిస్తే వాటికి కార్పొరేట్ సంస్థల ఆదరణ ఉంటుందా..? తమ లక్ష్యం నెరవేరి ఆశించిన స్థాయిలో రెవెన్యూ ఆదాయం లభిస్తుందా? అన్న అంశంపై నిర్మాణ సంస్థ మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇదే అంశంపై తాజాగా మరోమారు లెక్కలు వేసుకుంటుందని తెలిసింది. నిర్మాణ అనుమతుల్లోనూ జాప్యమే.. తొలివిడతగా ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, అమీర్‌పేట్ ప్రాంతాల్లో నిర్మించాలనుకున్న మెట్రో మాల్స్ నిర్మాణానికి సంబంధించి ఏడాదిగా జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన నిర్మాణపరమైన అనుమతులు, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు అందడం లేదు. దీంతో వీటి నిర్మాణం కూడా డైలమాలోనే పడింది. -
వయాడక్ట్‌ట్రాక్‌పై మెట్రో పరుగులు
అర్ధరాత్రి ట్రయిల్ రన్ సాక్షి,సిటీబ్యూరో: విద్యుత్ దీపకాంతుల మధ్య నాగోల్-మెట్టుగూడా రూట్లో (వయాడక్ట్‌ట్రాక్‌పై 8 కి.మీ) రెండో మెట్రోరైలుకు బుధవారం రాత్రి 9.30 గంటల నుంచి గురువారం తెల్లవారు ఝాము 2 గంటల వరకు టెస్ట్న్రవిజయవంతంగా నిర్వహించారు. ఉప్పల్ మెట్రో డిపోలో ఏడు మెట్రో రైళ్లుండగా నెలరోజులుగా ఒకే మెట్రో రైలుకు 14రకాల పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. బుధవారం రాత్రి మాత్రం రెండో రైలును ట్రాక్‌పై విజయవంతంగా నడిపినట్లు ఎల్అండ్టీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. తొలిరైలుకు రైల్వేసేఫ్టీ ధ్రువీకరణ కూడా లభించిందన్నారు. మొత్తం ఏడు రైళ్లకు వేర్వేరుగా ప్రయోగ పరీక్షలు నిర్వహించిన అనంతరమే ఈ రూట్లో నిరంతరాయంగా ట్రయల్న్ రనిర్వహిస్తామన్నారు. కాగా బుధవారం రాత్రి ప్రయోగ పరీక్ష నిర్వహించిన మెట్రో రైలుకు లోడు సామర్థ్యం, సిగ్నలింగ్, ట్రాక్,వేగం, తదితర అంశాలను పరీక్షించారు. డిపోలో నిర్వహించాల్సిన సామర్థ్య పరీక్షలను ఇప్పటికే పూర్తిచేశామని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. -
విషాదంలో మరో భారతీయ కుటుంబం
దుబాయి: దుబాయి ఒమన్ లోని మరో భారతీయ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. తండ్రి తన కూతురుతోపాటు వెళ్తున్న వాహానాన్ని ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనాదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు ఎంతకు స్పందించలేదు. దాంతో ఫోన్ నెంబర్ ఆధారంగా చిరునామా సేకరించి... మృతుల ఇంటికి వెళ్లగా అక్కడ మృతుడి భార్య కూడా మృతి చెందిందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మృతుడు సోహార్ స్టిల్ కంపెనీలో, అతడి భార్య ఎల్ అండ్ టీలతో పని చేస్తున్నారని తెలిపారు. వారి కుమార్తె స్థానిక భారతీయులకు చెందిన పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుందని పోలీసులు వెల్లడించారు. భారత్ లోని వారి బంధువులు వీరి మృతిపై సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. -
'బ్రోకర్లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి'
హైదరాబాద్: టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి అక్రమాలను ప్రజల ముందు పెడతామని ఆయన తెలిపారు. ఏపీ సీఏం భూదందాను కూడా నిరూపిస్తామని అన్నారు. ఎల్ అండ్ టీ సంస్థకు కేటాయించిన భూములను ఇతరులకు ఇవ్వలేదని, దీనిపై అనవర రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలుకు గచ్చిబౌలిలో కేటాయించిన 32 ఎకరాల విలువైన భూమిని సీఎం కేసీఆర్ తన ప్రయోజనాల కోసం మైహోమ్స్ రామేశ్వర్‌రావుకు ధారాదత్తం చేయడం వల్లనే వివాదం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి నిన్న అన్నారు. గచ్చిబౌలి స్థలానికి బదులుగా నాగోల్‌లోనే భూమి ఇచ్చేందుకు ఎల్ అండ్‌టీకి ఆఫర్ ఇచ్చారని పేర్కొన్నారు. -
మెట్రో రైలు వివాదంపై స్పందించిన కేసీఆర్
-
ఆ కథనాల వెనకున్న ఉద్దేశమేంటి?
హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టుపై రెండు పత్రికల్లో వచ్చిన కథనాలు తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కథనాలు రాయటం ఏమేరకు సమంజసమని ఆయన అడిగారు. ప్రైవేటు కంపెనీకి వత్తాసు పలికేలా కథనాలు రాయటం వెనకున్న ఉద్ధేశాలను ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్ట్ వివాదంపై తెలంగాణ సీఎం కార్యాలయం కూడా ప్రెస్‌నోటు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా రెండు పత్రికలు మెట్రోపై కథనాన్ని ప్రచురించాయని పేర్కొన్నారు. మెట్రోరైలు ఎల్ అండ్ టీ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వసాధారణమని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించేలా రెండు పత్రికల కథనాలు ఉన్నాయని పేర్కొంది. -
మెట్రో రైలుపై వదంతులు నమ్మొద్దు!
-
ఆ కథనాలు దురదృష్టకరం....
హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందకు ఈనెల 22న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నట్లు వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో కోట్లాదిమంది వైఎస్ఆర్ సీపీ అభిమానులకు, పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తామన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఎల్అండ్టీ వెనక్కి తగ్గినట్లు వస్తున్న కథనాలు దురదృష్టకరమని పొంగులేటి బుధవారమిక్కడ అన్నారు. ఇటువంటి వార్తలతో తెలంగాణకు నెగిటివ్ ఇమేజ్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఎల్అండ్టీతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు. -
హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రహణం
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రణహంగా మారిందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెట్రో రైలు పనులకు కేసీఆర్ ప్రభుత్వం అడ్డంకిగా మారిందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. మెట్రో అలైన్మెంట్ మార్చాలని కేసీఆర్ ఒత్తడి తేలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. డిజైన్ విషయంలో ఎల్అండ్టీని ఒప్పించలేకపోయారన్నారు. మెట్రో పనులు కొనసాగించలేమని ఎల్అండ్టీ లేఖ రాసింది వాస్తవం కాదా అని అన్నారు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వమే స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్ట్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. -
లాభాల స్వీకరణతో నష్టాల్లోకి మార్కెట్...
ముంబై: నూతన గరిష్టాలకు చేరిన అనంతరం ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడంతో సూచీలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం సెన్సెక్స్ దాదాపు 54, నిఫ్టీ 21 పాయింట్లు క్షీణించాయి. ఐటీ, చమురు, గ్యాస్ షేర్లలో లాభాలు స్వీకరించడం, బొగ్గు గనుల కేటాయింపులపై ఉత్తర్వును సుప్రీం కోర్టు రిజర్వులో ఉంచడంతో మార్కెట్లు అప్రమత్తం కావడం ఇందుకు కారణాలు. వినియోగ ధరలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారంలో వెల్లడికానుండడంతో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ అంట్ టీ, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఆర్ఐఎల్ వంటి కౌంటర్లు బలహీనంగా ఉండడం బెంచ్‌మార్క్ సూచీలపై ప్రభావం చూపింది. సిప్లా, కోల్ ఇండియా, గెయిల్, టాటా మోటార్స్, ఐటీసీ, మహింద్రా అండ్ మహింద్రా, టాటా పవర్ షేర్లు పుంజుకోవడం సూచీల నష్టాన్ని కొంతమేర అడ్డుకుంది. ఉదయం స్థిరంగా పునఃప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం అమ్మకాల ఒత్తిడితో ఓదశలో 143 పాయింట్లు తగ్గిపోయి 27,177.09 పాయింట్ల స్థాయికి చేరింది. తర్వాత పుంజుకుని 27,265.32 వద్ద ముగిసింది. సోమవారం క్లోజింగ్‌తో పోలిస్తే సెన్సెక్స్ 54.53 పాయింట్లు (0.20) శాతం తగ్గింది. నిఫ్టీ కూడా 20.95 పాయింట్లు (0.26 శాతం) క్షీణించి 8,152.95 పాయింట్లకు చేరింది. రియల్టీ, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ ఈక్విటీల్లో అమ్మకాల ఒత్తిడి కన్పించింది. ఫండ్స్‌లోకి భారీ నిధులు న్యూఢిల్లీ: వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మదుపరులు రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. జూలైలో ఈ మొత్తం రూ.1,13,216 కోట్లు కాగా, ఆగస్టులో రూ.1,00,181 కోట్లుగా నమోదయ్యింది. జూన్‌లో రూ. 59,726 కోట్లు ఫండ్స్ నుంచి ఉపసంహరణలు జరిగాయి. ‘శారదా’ ఆఫర్‌కు మంచి స్పందన... శారదా క్రాప్కెమ్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. రూ.352 కోట్ల సమీకరణకు జారీచేసిన ఐపీఓ 60 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత శుక్రవారం ప్రారంభమైన ఈ ఇష్యూ మంగళవారం ముగిసింది. -
మెట్రో ప్రాజెక్టు ఖర్చు పెరగనుందా?
-
సెన్సెక్స్ 96 పాయింట్లు ప్లస్
26,000కు పైన ముగింపు రెండు రోజుల నష్టాలకు చెక్ చివరి గంటన్నరలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. తొలుత స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 140 పాయింట్ల వరకూ జారింది. 25,850 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. రోజులో అధిక భాగం నీరసించినప్పటికీ చివర్లో జరిగిన షార్ట్ కవరింగ్ కారణంగా లాభాల్లోకి మళ్లినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ట్రేడింగ్ ముగిసేసరికి 96 పాయింట్ల లాభంతో 26,087 వద్ద నిలిచింది. వెరసి రెండు రోజుల నష్టాలకు చెక్ పడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 280 పాయింట్లు పడ్డ సంగతి తెలిసిందే. కాగా, నిఫ్టీ కూడా 43 పాయింట్లు పుంజుకుని 7,791 వద్ద ముగిసింది. జూలై డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయని నిపుణులు తెలిపారు. స్పైస్‌జెట్ షేరు 16% పతనం : కాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందన్న వార్తల కారణంగా స్పైస్‌జెట్ షేరు బీఎస్ఈలో 16% దిగజారింది. రూ. 14 వ ద్ద ముగిసింది. -
మెట్రో రైలుపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ..
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం పూర్తిచేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర కేబినెట్ అదనపు కార్యదర్శి ఆనంద స్వరూప్, సంయుక్త కార్యదర్శి జాయిస్ గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, జీఏడీ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, రైల్వే జీఎం శ్రీవాత్సవ తదితరులతో మెట్రో రైలు పురోగతిని సమీక్షించారు. మెట్రో రైలుకు అవసరమైన అన్ని అనుమతులు వెంటనే ఇచ్చేలా చూడాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. మెట్రోరైలు నిర్మాణ పురోగతిని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. మెట్రోరైలు ట్రయల్ రన్‌ను వచ్చేనెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. నేడు ఢిల్లీలో..: మెట్రో రైలు పురోగతి, వివాదాలు, ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వద్ద శుక్రవారం సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. -
మార్కెట్‌కు పోర్చుగల్ భయాలు
పాత ఒప్పందాలపైనా పన్ను విధించే చట్టాలతో కూడిన గార్ పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. బడ్జెట్లో రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని తొలగిస్తారన్న అంచనాలు తేలిపోవడంతో మార్కెట్లో నిరుత్సాహం చోటుచేసుకుంది. దీనికితోడు తాజాగా పోర్చుగల్ బ్యాంకింగ్ వ్యవస్థ చిక్కుల్లోపడటం సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. దీంతో వరుసగా నాలుగో రోజు సెన్సెక్స్ నష్టపోయింది. 348 పాయింట్లు పతనమై 25,024 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్టంకాగా, 4 రోజుల్లో 1,076 పాయింట్లను కోల్పోయింది! తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్)లో రూ. 5 లక్షల కోట్లమేర హరించుకుపోయింది!! 7,500 దిగువకు నిఫ్టీ రెండు రోజుల వ్యవధిలో మోడీ ప్రభుత్వం ప్రకటించిన రెండు బడ్జెట్లూ మార్కెట్‌ను నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో నిఫ్టీ కూడా 108 పాయింట్లు పడిపోయి కీలకస్థాయి 7,500కు దిగువన 7,460 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్ తొలుత లాభాలతో మొదలైంది. ఒక దశలో 175 పాయింట్లు పుంజుకుని 25,550 వరకూ ఎగసింది. అయితే యూరప్ దేశాల రుణ భార సమస్యలు మళ్లీ తెరపైకి రావడంతో మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు పెరిగి నష్టాలలోకి జారుకుంది. 24,978 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ నేపథ్యంలో వారం మొత్తంమీద సెన్సెక్స్ 938 పాయింట్లు పోగొట్టుకుంది. ఫలితంగా 2011 డిసెంబర్ తరువాత మళ్లీ గరిష్ట స్థాయి నష్టాలు నమోదయ్యాయి! 2015 జూన్‌కల్లా 28,800కు సెన్సెక్స్! న్యూఢిల్లీ: వచ్చే ఏడాది(2015) జూన్‌కల్లా మార్కెట్ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 28,800 పాయింట్లకు చేరుతుందని గ్లోబల్ బ్రోకరేజీ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరచడంలో విధానకర్తలు తీసుకుంటున్న సవ్యమైన నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని రీసెర్చ్ నివేదికలో వివరించింది. 2014-15లో సెన్సెక్స్ ఆర్జన 13.5% వృద్ధి చెందుతుందన్న అంచనాల ఆధారంగా దాదాపు 10% లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ బాటలో సెన్సెక్స్ ఆర్జన 2015-16లో 22.7%, 2016-17లో 23.4% చొప్పున పుంజుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. -
మెట్రో రైల్వే స్టేషన్లు రెడీ!
-
విశాఖ నౌకా నిర్మాణ కేంద్రంలో ప్రమాదం...ఒకరి మృతి
-
చోద్యం చూస్తున్న జిహెచ్ఎమ్సి అధికారులు...
-
రాష్ట్ర విభజన ప్రభావం మెట్రో రైలు ప్రాజెక్టుపై ఉండదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు గడువులోగానే గమ్యం చేరనుంది. ముందుగానే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని 2017 జనవరి 1వ తేదీ నాటికి సాధించనుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 20 లక్షల మంది ప్రయాణికులకు ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి విముక్తి కల్పించనుంది. నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం మెట్రో పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన అంశం తెరమీదకు వచ్చినప్పటికీ ఆ ప్రభావం మెట్రో పనులపై పడబోదని హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్), ఎల్అండ్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ, నిధుల కేటాయింపు, ఒప్పందాల ప్రక్రియలన్నీ 2011 చివరి నాటికే పూర్తయ్యాయని చెబుతున్నారు. ప్రాజెక్టుకు నిధులను ఎల్అండ్టీ సంస్థ పలు జాతీయ బ్యాంకుల నుంచి సేకరించనుంది. ఈ విషయంలోనూ ఎలాంటి అడ్డంకులు ఎదురు కాబోవని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం) ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకాన్ని రూ.16,112 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ప్రాజెక్టుకు ఎల్అండ్టీ సంస్థ రూ.12,674 కోట్లు వెచ్చిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు నిధి కింద రూ.1,458 కోట్లు కేటాయించనుంది. భూ సేకరణ, స్థిరాస్తులకు పరిహారం చెల్లింపు, పునరావాసం, స్కైవాక్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,980 కోట్లు ఖర్చు చేయనుంది. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 2012 మే నెలలో మొదలయ్యాయి. ప్రస్తుతం నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్ఆర్ నగర్, ఎల్బీనగర్-మలక్‌పేట్, మెట్టుగూడ-బేగంపేట మార్గాల్లో పిల్లర్లు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 700 పిల్లర్లు, 3 వేల వయాడక్ట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేశారు. ఉప్పల్ రింగ్‌రోడ్డులో మెట్రో స్టేషన్‌తోపాటు మెట్రో రైలు పట్టాలు ఏర్పాటవుతున్నాయి. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మరో 40 మాసాల్లో పూర్తికానున్నాయని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి.