
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజి దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎల్‌టీఐమైండ్‌ట్రీ చోటు సాధించనుంది. మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ స్థానే ఇండెక్స్‌లో చేరనుంది. ఈ నెల 13 నుంచి ఇండెక్స్‌లో ప్రాతినిధ్యం వహించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ దిగ్గజాల విలీనం నేపథ్యంలో నిఫ్టీ–50తోపాటు..నిఫ్టీ 100, నిఫ్టీ–500 ఇండెక్స్‌లలోనూ సవరణలు చేపట్టినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది.
నిఫ్టీ–100లో హెచ్‌డీఎఫ్‌సీకి బదులు జిందాల్ స్టీల్ అండ్ పవర్‌కు చోటు లభించనుంది. ఎన్‌ఎస్‌ఈ ఇండెక్సుల నిర్వహణ ఉపకమిటీ(ఈక్విటీ) ఈ మేరకు మార్పులు చేపట్టినట్లు ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. ఈ బాటలో నిఫ్టీ–500లో హెచ్‌డీఎఫ్‌సీ స్థానంలో మ్యాన్‌కైండ్ ఫార్మా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ స్థానంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్రాతినిధ్యం వహించనున్నాయి. తాజా సవరణలు 2023 జూలై 13 నుంచి అమలుకానున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment