
మెట్రో తొలి, మలిదశ మార్గాలిలా
మొదటి దశ
మియాపూర్ - ఎల్బీనగర్ 29కి.మీ.
జూబ్లీబస్‌స్టేషన్ - ఫలక్‌నుమా15 కి.మీ.
నాగోల్ - రహేజాఐటీపార్క్ 28 కి.మీ.
రెండో దశ
ఎల్బీనగర్ - హయత్‌నగర్ 7 కి.మీ.
మియాపూర్ - పటాన్‌చెరు 13 కి.మీ.
ఫలక్‌నుమా - శంషాబాద్ 28 కి.మీ.
తార్నాక - ఈసీఐఎల్ 7 కి.మీ.
రాయదుర్గం-గచ్చిబౌలి-శంషాబాద్ 28 కి.మీ.
గ్రేటర్ వాసుల కలల ప్రాజెక్టు... మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వనగరాల్లో ఉన్న 200 మెట్రో రైలు ప్రాజెక్టులకు భిన్నంగా నగరంలో అత్యాధునిక ప్రాజెక్టు ఈ ఏడాది ప్రథమార్థంలో అందుబాటులోకి రాబోతోంది. సుమారు రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో... ఈ ప్రాజెక్టు తొలిదశలో 72 కి.మీ మార్గంలో మూడు కారిడార్లలో పనులు చేపడుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలిదశ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ చెబుతోంది. కాగా రెండోదశ మార్గం ఐదు కారిడార్లలో 83 కి.మీ మార్గంలో ఏర్పాటుకానుంది. మెట్రో తొలి, మలిదశ మార్గాల వివరాలు గ్రాఫ్‌లో...