ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ డిప్యూటీ ఎండీ సుబ్రమణ్యన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సకాలంలో పూర్తి చేస్తామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఎన్.సుబ్రమణ్యన్ చెప్పారు. ఇప్పటికే ప్రాజెక్టులో 67 శాతం పనులు పూర్తయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో పనులకు ఎదురవుతున్న ఆటంకాలను గుర్తించి వాటిని అత్యున్నత స్థాయిలో పరిష్కరిస్తున్నామన్నారు. తద్వారా పనుల జాప్యం లేకుండా చూస్తున్నామన్నారు. నాగోల్-రహేజా ఐటీపార్క్, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మెట్రో ప్రాజెక్టును 2018 డిసెంబరులోగా పూర్తిచేస్తామని తెలిపారు.
ప్రాజెక్టు పురోగతి ఇలా...
* నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్ రూట్లో మొత్తం 20 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలకు వీలుగా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ పత్రాలు అందాయి.
* ఇప్పటికే 59 కి.మీ. మార్గంలో పునాదులు, 56.61 కి.మీ. మార్గంలో పిల్లర్లు, 35.70 కి.మీ. మార్గంలో రైళ్ల రాకపోకలు సాగించేందుకు ట్రాక్ సిద్ధమైంది.
హా అమీర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్‌గ్రౌండ్స్‌ల వద్ద ఇంటర్‌చేంజ్ స్టేషన్ల నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి.
* మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల్లో 57 మెట్రో రైళ్లు సిద్ధంగా ఉన్నాయి.
* భరత్‌నగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. మరో 7 ఆర్‌ఓబీల పని శరవేగంగా జరుగుతోంది.
* సుల్తాన్‌బజార్, మలక్‌పేట్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో పనులు ఊపందుకున్నాయి.
సకాలంలో మెట్రో పూర్తి
Published Fri, Oct 7 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement