గాయత్రి ప్రాజెక్ట్స్ కు రైల్వే కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ అవకాశాలున్న రైల్వే లైన్ల నిర్మాణ రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎల్‌అండ్‌టీ, సోజిజ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో కలిసి రూ. 4,744 కోట్ల భారీ రైల్వే ఈపీసీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. ఇక్బాల్‌ఘర్- వడోదర మధ్య నిర్మిస్తున్న వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీసీ) ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్, సివిల్ బిల్డింగ్స్, వంతెనలు, రైల్వే ట్రాక్ నిర్మాంచాల్సి ఉంది. కేవలం సరుకు రవాణా కోసం ముంబై - ఢిల్లీ మధ్య 1,483 కి.మీ మధ్య ప్రత్యేక రైల్వే లైన్ నిర్మిస్తుండగా, అందులో 304 కి.మీ కాంట్రాక్టును గాయత్రి కన్సార్షియం దక్కించుకుంది.