న్యూఢిల్లీ: ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో భారీ ఆర్డర్ ను చేజిక్కించుకుంది. వివిధ వ్యాపార భాగాల్లో దాదాపు వెయ్యికోట్ల రూపాయల ఆర్డను పొందింది. ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు రూ.1,167 కోట్ల ఆర్డర్ ను అందుకున్నట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో సంస్థ తెలిపింది. విజయవాడ నగరానికి నీటి సరఫరాకు గాను ఏపీ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంనుంచి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని రెండవ వాటర రిజర్వాయర్ ప్లాంట్ నిర్మాణంకోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) నుంచి ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ నుంచి రూ.843 కోట్ల విలువ చేసే ఆర్డర్ కైవసం చేసుకుంది. కర్నాటక అర్బన్ వాటర్ సప్లై అండ్ పంపిణీ బోర్డు నుంచి మరో రూ. 259 కోట్ల విలువచేసే ఆఫర్ అందుకుంది. దీంతోపాటుగా ప్రతిష్టాత్మక వినియోగదారులనుంచి లోహశోధన మరియు మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యాపారంలో ఆర్డర్ ను హల్దియా లో పెట్ కోక్ నిర్వహణ వ్యవస్థ నిర్మాణానికి గానుఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో అదనపు ఆర్డర్లను అందుకున్నట్టు చెప్పింది. అలాగే వివిధ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల నుంచి రూ. 65 కోట్లను ఆర్డర్ ను కూడా అందుకుంది.
అయితే బలహీన ఫలితాల ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో సంస్థ షేర్లలో మదుపర్లు అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో షేర్ ధర4 శాతం క్షీణించింది. సుమారు 63.85 నష్టంతో 1,495 దగ్గర నిలిచింది.