'బ్రోకర్లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి' | Revanth Reddy behave like a Broker, says Karne Prabhakar | Sakshi
Sakshi News home page

'బ్రోకర్లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి'

Published Thu, Sep 18 2014 5:31 PM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

'బ్రోకర్లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి' - Sakshi

'బ్రోకర్లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి'

హైదరాబాద్: టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి అక్రమాలను ప్రజల ముందు పెడతామని ఆయన తెలిపారు. ఏపీ సీఏం భూదందాను కూడా నిరూపిస్తామని అన్నారు. ఎల్ అండ్ టీ సంస్థకు కేటాయించిన భూములను ఇతరులకు ఇవ్వలేదని, దీనిపై అనవర రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ మెట్రో రైలుకు గచ్చిబౌలిలో కేటాయించిన 32 ఎకరాల విలువైన భూమిని సీఎం కేసీఆర్ తన ప్రయోజనాల కోసం మైహోమ్స్ రామేశ్వర్‌రావుకు ధారాదత్తం చేయడం వల్లనే వివాదం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి నిన్న అన్నారు. గచ్చిబౌలి స్థలానికి బదులుగా నాగోల్‌లోనే భూమి ఇచ్చేందుకు ఎల్ అండ్‌టీకి ఆఫర్ ఇచ్చారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement