'దొంగే దొంగ అన్నట్లుంది రేవంత్ వ్యవహారం'
Published Sun, Mar 5 2017 5:18 PM | Last Updated on Tue, Sep 4 2018 4:54 PM
హైదరాబాద్‌సిటీ: ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం దొంగే దొంగ అన్నట్టుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు తెలంగాణ పై విషం గక్కుతున్నాడు..ముందు దాని మీద రేవంత్ రెడ్డి మాట్లాడాలన్నారు. చంద్రబాబుకు కసి ఎవరి మీద ? అని ప్రశ్నించారు ప్రభాకర్. రేవంత్ రెడ్డిని తుపాకీ రాముడిగా అభివర్ణించారు..ఈటెల, ఇంద్రకరణ్ రెడ్డి ల నిజాయితీ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
చంద్రబాబు, రేవంత్ రెడ్డి సోషియోపతి అనే వింత మానసిక జబ్బుతో బాధ పడుతున్నట్టుంది అని ఎద్దేవా చేశారు. .జైలు నుంచి వచ్చిన తర్వాత రేవంత్ వికృత చేష్టలు పెరిగాయన్నారు. ఈటెల రాజేందర్ నిప్పు లాంటోడు..నిప్పుతో ఆడుకుంటే రేవంత్ మసి కావడం ఖాయమన్నారు. ఈటెల మంత్రి అయిన తర్వాత పౌర సరఫరాల శాఖలో రూ.వెయ్యి కోట్ల ఆదా అయ్యే సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు యేలుబడిలో ఉన్న ఏపీలో అవినీతి గురించి మాట్లాడిన తర్వాతనే ఇక్కడ స్పందించాలని రేవంత్ రెడ్డిని కోరారు. ఏపీలో చంద్రన్న కానుకల్లో ఎంత అవినీతి జరిగిందో మీడియాలో ఎన్ని కథనాలు వచ్చాయో అందరికీ తెలుసని..రేవంత్ రెడ్డి ఇకనైనా గాలి మాటలు కట్టిపెట్టాలన్నారు.
Advertisement
Advertisement