ఎల్అండ్టీలో ప్రభుత్వం1.63 శాతం వాటా విక్రయం
సర్కారుకు రూ.2,100 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగ అగ్రగామి కంపెనీ ఎల్‌అండ్‌టీలో కేంద్ర ప్రభుత్వం తనకున్న వాటాలో 1.63 శాతాన్ని విక్రరుుంచింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,100 కోట్ల ఆదాయం సమకూరింది. స్పెసిఫైడ్ అండర్ టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యూయూటీఐ) ద్వారా శుక్రవారం ఈ విక్రయం జరిగింది. బ్లాక్ డీల్స్ మార్గంలో ప్రైవేటు సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను కొనుగోలు చేశారు. దీంతో ఎల్‌ఐసీ సాయం అవసరం లేకపోరుుంది.
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయానికి మార్కెట్ నుంచి సరైన స్పందన రాని సమయాల్లో... ఎల్‌ఐసీ ముందుకు వచ్చి ఆ మేరకు వాటాలను కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. ఎస్‌యూయూటీఐ ద్వారా ఎల్‌అండ్‌టీలో కేంద్ర సర్కారుకు మొత్తం 8.16 శాతం వాటా ఉంది. ఇందులో 1.63 శాతం మేర వాటాలను విక్రరుుంచింది.
బీఎస్‌ఈలో ఎల్‌అండ్‌టీ షేరు గురువారం క్లోజింగ్ ధర రూ.1,444.55 కంటే 2 శాతానికి పైగా తక్కువకే రూ.1,415కే ఒక్కో షేరును ప్రభుత్వం ఆఫర్ చేసిం ది. కాగా, శుక్రవారం ఈ షేరు బీఎస్‌ఈలో 2 శాతం నష్టంతో 1418.90వద్ద ముగిసింది. ఎస్‌యూయూటీఐ ద్వారా మొత్తం 51 కంపెనీల్లో కేంద్రానికి వాటాలున్నారుు. అత్యధికంగా ఐటీసీలో 11.17 శాతం, యాక్సిక్ బ్యాంకులో 11.53 శాతం వాటాలున్నారుు.