
ఆ కథనాలు దురదృష్టకరం....
హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందకు ఈనెల 22న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నట్లు వైఎస్ఆర్ సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో కోట్లాదిమంది వైఎస్ఆర్ సీపీ అభిమానులకు, పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తామన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఎల్అండ్టీ వెనక్కి తగ్గినట్లు వస్తున్న కథనాలు దురదృష్టకరమని పొంగులేటి బుధవారమిక్కడ అన్నారు. ఇటువంటి వార్తలతో తెలంగాణకు నెగిటివ్ ఇమేజ్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే ఎల్అండ్టీతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు.