హైదరాబాద్ మెట్రోపై విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెట్రో పనుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత వ్యవహారంగా చూడటం సరికాదని...
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపై విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెట్రో పనుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత వ్యవహారంగా చూడటం సరికాదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి అన్నారు. ప్రాజెక్ట్పై అనుమానాలన్నింటినీ కేసీఆర్ నివృత్తి చేయాలని ఆయన గురురవామిక్కడ డిమాండ్ చేశారు. డీఎల్ఎఫ్కు కేటాయించిన 31 ఎకరాలు 'మైహోం'కు బదలాయించటం నిబంధనలకు విరుద్ధమన్నారు.
ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టు వివాదాస్పదం కావటం దురదృష్టకరమన్నారు. మెట్రో సమస్యలపై కేసీఆర్ సమీక్షించకపోవటం సరికాదన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న కేసీఆర్ దీనిపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే తెలంగాణ పీసీసీ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు పొన్నాల తెలిపారు.