
కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు:పొన్నాల
హైదరాబాద్: మీడియా స్వేచ్ఛను కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకోవాలని చూడటం తగదని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూచించారు. మీడియాపై ఆంక్షలు విధించడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల.. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇంతవరకూ నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అమరవీరుల ఆత్మలు క్షోభిస్తాయన్నారు.
తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి కోట్ల రూపాయలు దండుకుని..ఇప్పుడు సెటిలర్స్ బాట పట్టారన్నారు. మాట మార్చే నేత, మూఢ నమ్మకాల సీఎం అని ప్రజలు నిరసన తెలుపుతున్నారని పొన్నాల విమర్శనాస్త్రాలు గుప్పించారు.