my home
-
రామేశ్వర్‌రావుకు సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ టైకూన్, మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావును సీఐఐ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. గురువారం హెచ్ఐసీసీలో జరిగిన సీఐఐ గ్రీన్ సిమెంటెక్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. రామేశ్వర్రావు తరఫున ఆయన కుమారుడు వైస్ చైర్మన్ జూపల్లి రామురావు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వీడియో కాల్లో రామేశ్వర్రావు సీఐఐ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. -
సౌర విద్యుత్‌లోకి మై హోమ్
ప్యూరెనర్జీతో ఎంవోయూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ, సిమెంట్, విద్యుత్, విద్యా రంగంలో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న మై హోమ్ గ్రూప్.. తాజాగా సౌర విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టింది. అబ్జా పవర్ (గతంలో మై హోమ్ పవర్ ప్రై.లి.), ఐఐటీ–హైదరాబాద్‌లో ఇంక్యుబేట్ అయిన ప్యూరెనర్జీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో మై హోమ్ గ్రూప్ సౌర విద్యుత్ రంగంతో పాటూ రూఫ్‌టాప్, యుటిలిటీ స్కేల్ ప్రాజెక్ట్స్‌తో నివాస, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సౌర విద్యుత్ అవసరాలను తీరుస్తుందని మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు జూపల్లి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోలార్ సిస్టమ్స్, ఐఓటీ ఆధారిత విద్యుత్ నిర్వహణ, సౌర ప్లాంట్ల పర్యవేక్షణ, అభివృద్ధి, పరిశోధన వంటి వాటిల్లో ఉమ్మడి ప్రాజెక్ట్‌లను చేస్తామని పేర్కొన్నారు. అబ్జా పవర్ ప్రాజెక్ట్ నిర్వహణపై దృష్టి కేంద్రీకరిస్తే, ప్యూరెనర్జీ మాత్రం డిజైన్, అభివృద్ధి విభాగాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందంలో ౖమై హోమ్ పవర్ ప్రై.లి. ఈడీ జగపతిరావు జూపల్లి, అబ్జా పవర్ డైరెక్టర్ అండ్ సీఈఓ రాయ్ చౌదరి, ప్యూరెనర్జీ ఫౌండర్, ఐఐటీ–హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిశాంత్ దొంగరీ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ ప్రాజెక్టు
హైదరాబాద్: నగరంలో భారీ కమర్షియల్ ఆఫీస్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మై హోమ్ గ్రూప్ తాజాగా రియల్ ఎస్టేట్ డెవలపింగ్ సంస్థ ఆర్ఎంజెడ్ కార్ప్‌తో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్టుపై బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నారు. సుమారు 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండబోయే ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ కార్యకలాపాలు మై హోమ్ గ్రూప్, ఆర్ఎంజెడ్ గ్రూప్ సంయుక్తంగా చేపడతాయి. హైటెక్ సిటీకి దగ్గర్లో 3.5 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో తొలి దశ ’స్కైవ్యూ’ సముదాయం 2018 డిసెంబర్ ఆఖరు నాటికి అందు బాటులోకి రానుంది. దేశీయంగా నివసించేందుకు ఉత్తమ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఆఫీస్ ప్రాజెక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయని మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు తెలిపారు. దేశ, విదేశ కంపెనీలు హైదరాబాద్ మార్కెట్ వైపు దృష్టి సారించే విధంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు ఆర్ఎంజెడ్ కార్ప్ కార్పొరేట్ చైర్మన్ మనోజ్ మెండా పేర్కొన్నారు. -
'కేసీఆర్ సొంత వ్యవహారంగా చూడటం సరికాదు'
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపై విపక్షాలు విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మెట్రో పనుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత వ్యవహారంగా చూడటం సరికాదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి అన్నారు. ప్రాజెక్ట్‌పై అనుమానాలన్నింటినీ కేసీఆర్ నివృత్తి చేయాలని ఆయన గురురవామిక్కడ డిమాండ్ చేశారు. డీఎల్ఎఫ్కు కేటాయించిన 31 ఎకరాలు 'మైహోం'కు బదలాయించటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్టు వివాదాస్పదం కావటం దురదృష్టకరమన్నారు. మెట్రో సమస్యలపై కేసీఆర్ సమీక్షించకపోవటం సరికాదన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న కేసీఆర్ దీనిపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే తెలంగాణ పీసీసీ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు పొన్నాల తెలిపారు.