హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ ప్రాజెక్టు
హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ ప్రాజెక్టు
Published Sun, Mar 19 2017 8:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: నగరంలో భారీ కమర్షియల్ ఆఫీస్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మై హోమ్ గ్రూప్ తాజాగా రియల్ ఎస్టేట్ డెవలపింగ్ సంస్థ ఆర్‌ఎంజెడ్ కార్ప్‌తో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్టుపై బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నారు. సుమారు 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండబోయే ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ కార్యకలాపాలు మై హోమ్ గ్రూప్, ఆర్‌ఎంజెడ్ గ్రూప్ సంయుక్తంగా చేపడతాయి. హైటెక్ సిటీకి దగ్గర్లో 3.5 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో తొలి దశ ’స్కైవ్యూ’ సముదాయం 2018 డిసెంబర్ ఆఖరు నాటికి అందు బాటులోకి రానుంది.
దేశీయంగా నివసించేందుకు ఉత్తమ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఆఫీస్ ప్రాజెక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలున్నాయని మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు తెలిపారు. దేశ, విదేశ కంపెనీలు హైదరాబాద్ మార్కెట్ వైపు దృష్టి సారించే విధంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు ఆర్‌ఎంజెడ్ కార్ప్ కార్పొరేట్ చైర్మన్ మనోజ్ మెండా పేర్కొన్నారు.
Advertisement
Advertisement