న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో ఉన్న బెంగళూరు కంపెనీ ఆర్‌ఎంజడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. డేటా సెంటర్ ఆపరేటర్ కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్‌తో సమాన వాటాగా సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్‌ఎంజడ్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్ట్‌నర్స్ ద్వారా భారత డేటా సెంటర్ మార్కెట్లో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆర్‌ఎంజడ్ వెల్లడించింది.
ఈ నిధులతో తొలుత నవీ ముంబై, చెన్నైలోని అంబత్తూర్‌లో ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తారు. భవిష్యత్తులో అదనంగా మూడవ కేంద్రాన్ని జోడిస్తారు. అన్ని దశలు పూర్తి అయితే డేటా సెంటర్ల పూర్తి సామర్థ్యం 250 మెగావాట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. యూరప్, జపాన్‌తోపాటు భారత్‌లో కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్ 25 ఏళ్లుగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment