హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీర్డ్ స్టోన్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలోని ప్లాంటు విస్తరణకు రూ.440 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. మేకగూడ ప్లాంటులో ఇటలీకి చెందిన బ్రెటన్ ఎస్‌పీఏ సాంకేతిక సహకారంతో మూడవ లైన్‌ను జోడిస్తామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. 2026 మార్చిలో 8.1 లక్షల చదరపు మీటర్ల సామర్థ్యం తోడవనుందని అన్నారు.
మేకగూడ కేంద్రంలో 2021 మార్చిలో యూనిట్–2 అందుబాటులోకి వచ్చిందని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ చెప్పారు. కాగా, సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లిమిటెడ్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.33 కోట్ల నుంచి రూ.45 కోట్లకు చేరింది. టర్నోవర్ రూ.197 కోట్ల నుంచి రూ.253 కోట్లకు ఎగసింది. పోకర్ణ షేరు ధర మంగళవారం 1.81% దూసుకెళ్లి రూ.1,103.20 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment