Pokarna
-
హైదరాబాద్‌లో రూ.440 కోట్లతో ప్లాంటు విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీర్డ్ స్టోన్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలోని ప్లాంటు విస్తరణకు రూ.440 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. మేకగూడ ప్లాంటులో ఇటలీకి చెందిన బ్రెటన్ ఎస్పీఏ సాంకేతిక సహకారంతో మూడవ లైన్‌ను జోడిస్తామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. 2026 మార్చిలో 8.1 లక్షల చదరపు మీటర్ల సామర్థ్యం తోడవనుందని అన్నారు.మేకగూడ కేంద్రంలో 2021 మార్చిలో యూనిట్–2 అందుబాటులోకి వచ్చిందని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ చెప్పారు. కాగా, సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లిమిటెడ్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.33 కోట్ల నుంచి రూ.45 కోట్లకు చేరింది. టర్నోవర్ రూ.197 కోట్ల నుంచి రూ.253 కోట్లకు ఎగసింది. పోకర్ణ షేరు ధర మంగళవారం 1.81% దూసుకెళ్లి రూ.1,103.20 వద్ద ముగిసింది. -
రూ. 500 కోట్లతో పోకర్ణ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలో నూతన ప్లాంటును నెలకొల్పింది. ఇటలీకి చెందిన పేటెంటెడ్ బ్రెటన్‌స్టోన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడి చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఫెసిలిటీని జూలై 31న (నేడు) ప్రారంభించనున్నారు. మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది మార్చిలో ప్లాంటులో ఉత్పత్తి మొదలైందని పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ శుక్రవారం తెలిపారు. -
తెలంగాణలో రూ.500 కోట్లతో పోకర్ణ ప్లాంటు
హైదరాబాద్: క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలో కొత్త ప్లాంటును నెలకొల్పింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడి చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఫెసిలిటీని జూలై 31న ప్రారంభించనున్నారు. మేకగూడ వద్ద 1,60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 90 లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని స్థాపించారు. ఈ తయారీ కేంద్రం ద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది మార్చి 24న ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటలీకి చెందిన పేటెంటెడ్ బ్రెటన్‌స్టోన్ టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తున్నట్టు చెప్పారు. కొత్త కేంద్రం చేరికతో సంస్థ మొత్తం వార్షిక స్థాపిత సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుందని సీఈవో పరాస్ కుమార్ జైన్ వెల్లడించారు. పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఈ కేంద్రం నుంచి రూ.400 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ జంబో, సూపర్ జంబో సైజులో స్లాబ్స్‌ను తయారు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం వద్ద ఉన్న ఏపీసెజ్‌లో 2009లో కంపెనీ క్వార్జ్ సర్ఫేసెస్ తయారీ కోసం తొలి ప్లాంటును స్థాపించింది. -
రూ. 500 కోట్లతో పోకర్ణ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాంట్రా బ్రాండ్‌లో క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సమీపంలోని మేకగూడ వద్ద 6,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. వార్షిక తయారీ సామర్థ్యం 86 లక్షల చదరపు అడుగులు. బుధవారం ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి మొదలైంది. జంబో, సూపర్ జంబో సైజులో స్లాబ్స్ తయారు చేసేందుకు ఇటలీకి చెందిన బ్రెటన్ అభివృద్ధి చేసిన బ్రెటన్‌స్టోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. స్టూడియో డిజైన్స్‌తోపాటు సహజత్వం ఉట్టిపడేలా ఉత్పత్తుల తయారీకి అత్యాధునిక రోబోలను రంగంలోకి దింపారు. క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో ప్రపంచంలోని భారీ తయారీ కేంద్రాల్లో ఇదీ ఒకటని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ తెలిపారు. ఆదాయం రూ.200 కోట్లు: కొత్త కేంద్రానికి రూ.500 కోట్లు పెట్టుబడి చేశామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ‘ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రస్తుతం 150 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నూతన ప్లాంటు ద్వారా రూ.200 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. కొత్త ఫెసిలిటీ చేరికతో సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరింది’ అని చెప్పారు. పోకర్ణ ఇప్పటికే వైజాగ్ వద్ద ఇటువంటి ప్లాంటును నిర్వహిస్తోంది. -
పోకర్ణ లాభం రెండింతలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లాభం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండింతలైంది. లాభం రూ.13.6 కోట్ల నుంచి రూ.26 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.89 కోట్ల నుంచి రూ.121 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.319 కోట్ల టర్నోవరుపై రూ.54 కోట్ల నికరలాభం నమోదైంది. బీఎస్ఈలో మంగళవారం కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 5.84 శాతం పెరిగి రూ.175.85 వద్ద స్థిరపడింది -
అపారెల్‌ను లాభాల్లోకి తెస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న పోకర్ణ గ్రూప్... కొత్త ఏడాది సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. నష్టాల్లో ఉన్న అపారెల్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్టాంజా బ్రాండ్ ఇమేజ్ను మరిన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించింది. అలాగే గుండ్లపోచంపల్లిలో ఉన్న దుస్తుల తయారీ ప్లాంటుకు పూర్వ వైభవం తీసుకొస్తామని పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. క్వార్జ్, అపారెల్ విభాగాల్లో కంపెనీ ప్రణాళికలను ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. లాభాల్లోకి తీసుకొస్తాం.. గ్రూప్ ఆదాయంలో 30 శాతం సమకూర్చిన అపారెల్ విభాగం కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తోంది. గుండ్లపోచంపల్లిలో ఉన్న దుస్తుల తయారీ ప్లాంటుకు రూ.40 కోట్లకు పైగా వెచ్చించాం. నెదర్లాండ్స్, ఇటలీ, యూఎస్, జర్మనీ కంపెనీలకు థర్డ్ పార్టీగా దుస్తులను తయారు చేసి సరఫరా చేశాం. ఉత్పాదన హై క్వాలిటీ కావడం, ఆ కంపెనీలిచ్చే ధర తయారీ ఖర్చు కంటే తక్కువగా ఉండడంతో సరఫరా మానేశాం. దీంతో నిర్వహణ భారం పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతం వినియోగానికే పరిమితమయ్యాం. ప్లాంటులో ఉత్పత్తి పెరిగితేనే నష్టాల నుంచి గట్టెక్కుతాం. యూనిట్లో వాటా విక్రయానికి, లేదా లీజుకివ్వటానికి భాగస్వామిని చూస్తున్నాం. రిటైల్‌ను విస్తరిస్తాం కనక తయారీ కూడా పెరుగుతుంది. స్టాంజా స్టోర్లు పెంచుతాం.. ఒకానొక స్థాయిలో స్టాంజా స్టోర్లు 15 దాకా ఏర్పాటయ్యాయి. కానీ నష్టాలొస్తున్న 7 స్టోర్లను మూసేశాం. ఇపుడున్న ఔట్లెట్లలో స్థలాన్ని కుదించాం. రెండేళ్లలో మరో 18 ఔట్లెట్లు ప్రారంభిస్తాం. నాణ్యతలో రాజీ లేకుండా సరైన ధరలో ఉత్పత్తులను తెస్తాం. రూ.10 కోట్లుగా ఉన్న అపారెల్ విభాగ నష్టాలిపుడు రూ.1–2 కోట్ల స్థాయికి వచ్చాయి. రిటైల్ లాభాలు సమకూరుస్తోంది కనక అపారెల్ నష్టాలు తగ్గుతూ వచ్చాయి. ఈ విభాగాన్ని త్వరలోనే లాభాల్లోకి మళ్లిస్తాం. క్వాంట్రాకు ఆదరణ.. నేచురల్ క్వార్జ్ సర్ఫేసెస్ ఉత్పాదన అయిన పోకర్ణ బ్రాండ్ ‘క్వాంట్రా’కు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ రంగంలో విజయవంతంగా యూఎస్‌లో అమ్ముడవుతున్న మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టు మాదే. ఇటలీకి చెందిన బ్రెటన్‌స్టోన్ పేటెంటెడ్ టెక్నాలజీ వాడుతున్నాం. 200 డిజైన్లు చేస్తున్నాం. పలు దిగ్గజ కంపెనీలకు థర్డ్ పార్టీగా కూడా క్వార్జ్ సర్ఫేసెస్ సరఫరా చేస్తున్నాం. కిచెన్ కౌంటర్ టాప్స్‌కు అనువైన ఈ ఉత్పాదనను భారత్‌లో ఐకియా కూడా పోకర్ణ నుంచే కొనుగోలు చేయబోతోంది. గ్రూప్ టర్నోవరులో క్వార్జ్ విభాగం వాటా 50 శాతం దాటింది. ఇందులో క్వాంట్రా 30 శాతం సమకూరుస్తోంది. హైదరాబాద్ వద్దే ప్లాంటు.. గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్‌కు విశాఖపట్నం సమీపంలో నేచురల్ క్వార్జ్ సర్ఫేసెస్ తయారీ ప్లాంటు ఉంది. ఇది పూర్తి స్థాయిలో నడుస్తోంది. మరో ప్లాంటు వస్తేనే కంపెనీ వృద్ధికి ఆస్కారముంది. అందుకే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 50 ఎకరాల్లో కొత్త ప్లాంటు ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టాం. ఈ యూనిట్‌కు రూ.325 కోట్లు ఖర్చు చేస్తాం. బ్యాంకు రూ.250 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. న్యాయపర ఒప్పందాలు పూర్తి అయ్యాక 18 నెలల్లో ప్లాంటు రెడీ అవుతుంది. 2019–20లోనే ప్లాంటు కార్యరూపం దాలుస్తుంది. -
పోకర్ణ ఉత్పత్తులకు ‘గ్రీన్‌గార్డ్’ ధ్రువీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పోకర్ణ అనుబంధ కంపెనీ పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ (పీఈఎస్‌ఎల్) తయారు చేసే క్వార్ట్జ్ సర్ఫేసెస్కు గ్రీన్‌గార్డ్, గ్రీన్‌గార్డ్ గోల్డ్ ధ్రువీకరణ లభించింది. భారత్‌లో క్వార్ట్జ్ సర్ఫేసెస్ తయారీ రంగంలో ఈ గుర్తింపు లభించిన తొలి కంపెనీ పీఈఎస్‌ఎల్ కావడం విశేషమని పోకర్ణ సీఎండీ గౌతమ్‌చంద్ జైన్ తెలి పారు. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులకు కఠిన పరీక్షల అనంతరం అండర్‌రైటర్స్ ల్యాబొరేటరీస్ ఎన్విరాన్మెంట్ ఈ ధ్రువీకరణ ఇస్తుంది.