
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లాభం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండింతలైంది. లాభం రూ.13.6 కోట్ల నుంచి రూ.26 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.89 కోట్ల నుంచి రూ.121 కోట్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు రూ.319 కోట్ల టర్నోవరుపై రూ.54 కోట్ల నికరలాభం నమోదైంది. బీఎస్‌ఈలో మంగళవారం కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 5.84 శాతం పెరిగి రూ.175.85 వద్ద స్థిరపడింది