Expanding
-
హైదరాబాద్‌లో రూ.440 కోట్లతో ప్లాంటు విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీర్డ్ స్టోన్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలోని ప్లాంటు విస్తరణకు రూ.440 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. మేకగూడ ప్లాంటులో ఇటలీకి చెందిన బ్రెటన్ ఎస్పీఏ సాంకేతిక సహకారంతో మూడవ లైన్‌ను జోడిస్తామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. 2026 మార్చిలో 8.1 లక్షల చదరపు మీటర్ల సామర్థ్యం తోడవనుందని అన్నారు.మేకగూడ కేంద్రంలో 2021 మార్చిలో యూనిట్–2 అందుబాటులోకి వచ్చిందని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ చెప్పారు. కాగా, సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లిమిటెడ్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.33 కోట్ల నుంచి రూ.45 కోట్లకు చేరింది. టర్నోవర్ రూ.197 కోట్ల నుంచి రూ.253 కోట్లకు ఎగసింది. పోకర్ణ షేరు ధర మంగళవారం 1.81% దూసుకెళ్లి రూ.1,103.20 వద్ద ముగిసింది. -
భారత్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు: సేల్స్‌ఫోర్స్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత్‌లో వ్యాపార అవకాశాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని, దేశంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ చైర్మన్, సీఈవో మార్క్ బెనియాఫ్ తెలిపారు. ప్రపంచం అంతా ’భారతీయ శకం’లోకి మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తమకు భారత్‌లో 11,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో చాలా మంది అంతర్జాతీయ క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నారని బెనియాఫ్ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ భారత వ్యాపార విభాగం కూడా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బజాజ్ గ్రూప్ వంటి దిగ్గజ కస్టమర్లకు కూడా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహించిన వార్షిక ’డ్రీమ్‌ఫోర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెనియాఫ్ ఈ విషయాలు చెప్పారు.సేల్స్‌ఫోర్స్ భారత విభాగం చీఫ్‌గా ఉన్న ఎస్బీఐ మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య సారథ్య సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమం సందర్భంగా ఏజెంట్‌ఫోర్స్ సొల్యూషన్‌ను ఆవిష్కరించారు. వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగుల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. -
సిటీలో స్టైలిష్ హెయిర్ కట్కు క్రేజ్
స్టైల్‌కి, ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నగరం వృద్ధిచెందుతోంది. ఓ పక్క స్టైల్తోపాటు దానికి తగిన విధంగా కేర్ తీసుకుంటున్నారు. ఇటీవల ఓ సినిమాలో జడేసుకోపోయావా... తల్లీ.. ముడేసుకున్నా.. ముద్దుగానే ఉన్నావులే అని రావు రమేష్ అంటాడు. ఆ తరహాలోనే ప్రతిదీ స్టైలే.. ఇక హెయిర్ స్టైల్స్‌లోనూ అనేక రకాలు ఉన్నాయంటే అతిశయోక్తిలేదు.. బజ్‌కట్.. క్రూకట్, ఫాక్స్ హాక్, బాబ్, బౌల్, కోబ్ ఓవర్, ఫ్లాట్ టాప్, ముల్లె, పాంపడోర్ ఇలా పురుషులు ఫాలో అయ్యే హెయిర్ స్టైల్స్‌లో 30కి పైగా రకాలు ఉన్నాయి.. కాగా బిక్సీకట్, స్పైకీ పిక్సీ, ఒన్ లెగ్త్ మిడీ, మోవాక్ షార్ట్ కట్, యాంగిల్డ్ బాబ్, షార్ట్ వేవీ.. వంటి 60 రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. అయితే హెయిర్ స్టైల్స్ ఎప్పటి నుండో ఉన్నప్పటికీ... ప్రొఫెషనల్స్‌తో చేయించుకోవడం తక్కువ.. కానీ ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ హెయిర్ స్టైలిస్ట్‌ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో అంతర్జాతీయ బ్రాండెడ్ సెలూన్స్ విస్తరిస్తున్నాయి. అంతేకాదు.. రెగ్యులర్‌గా నెల్లో కనీసం ఒక్కరైనా హెయిర్ స్టైలిస్ట్స్ సందర్శిస్తున్నారు.. హైదరాబాద్ అందమైన నగరంగానే కాకుండా అందానికీ అత్యంత ప్రధాన్యతనిచ్చే నగరంగా ప్రసిద్ధి చెందింది. నగరం వేదికగా అంతర్జాతీయ ఫ్యాషన్ స్టూడియోలు, ప్రతీ ఏటా పదుల సంఖ్యలో నిర్వహించే గ్లోబల్ ఫ్యాషన్ ఈవెంట్స్ దీనికి నిదర్శనం..అయితే గత కొంత కాలంగా అందానికి అదనపు హంగులద్దే హెయిర్ కట్స్ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా ఫ్యాషన్ ఔత్సాహికులు సినీతాలకు ధీటుగా వినూత్న హెయిర్ స్టైల్స్‌కు మొగ్గుచూపుతున్నారు. దీనిని వేదికగా మార్చుకుని ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లు, ఫేమస్ సెలూన్స్ నగరంలో సేవలు ప్రారంభిస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ సెమినార్లకూ హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. హెయిర్ స్టైలిస్ట్ వ్యాపారం, అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉండటం విశేషం. ఫ్యాషన్ షోలు, ఫ్యాషన్ వీక్‌లతో హెయిర్ స్టైలిస్ట్‌ల అవసరం పెరిగింది. రానున్న కాలంలో ఐటీ, హిస్టారికల్తో పాటు ఫ్యాషన్ ఐకాన్‌గానూ నగరం వెలుగొందనుందని పలువురు విశ్లేషకులు అంటున్న మాట..అవకాశాలు పుష్కలం..నగరంలో నష్టపోని రంగం ఏదైనా ఉందంటే...అది హెయిర్ స్టైలింగ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ వృత్తిపరంగా మంచి అవకాశాలు పొందుతున్నారు. మన వ్యక్తిత్వాన్ని మరింత అద్భుతంగా చూపించడంలో ఫ్యాషన్ ఔట్లుక్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హంగులను అందుకోవడంలో నగరవాసులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ హెయిర్ బ్రాండ్స్, హెయిర్ కట్స్ ఇక్కడి విలాసవంతమైన జీవన విధానంలో భాగమయ్యాయి. సిటీలో బోటోసూ్మత్ ట్రీట్మెంట్ వంటి సెమినార్స్ నిర్వహిస్తే వందల మంది స్టైలిస్ట్‌లు పాల్గొని శిక్షణ పొందారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు..ఇక్కడ కురులను అందంగా చూపించుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారో. –నజీబ్ ఉర్ రెహా్మన్, ప్రముఖ అంతర్జాతీయ హెయిర్ స్టైలిస్ట్.దక్షిణాది అందాలకు అంతర్జాతీయ క్రేజ్... ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శిరోజాల అందం, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా గ్లోబల్ ఫ్యాషన్ హంగులకు హైదరాబాద్ వేదికగా మారింది. ఇటాలియన్, జపనీస్ వంటి విభిన్న హెయిర్ స్టైల్స్ ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. మొదటి సారి నగరంలో నిర్వహించిన లుక్ అండ్ లెర్న్ సెమినార్లో ఇక్కడి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్‌లకు వినూత్న స్టైల్స్‌పై అవగాహన కల్పించాను. గోద్రెజ్ ప్రొఫెషనల్ బోటోస్మూత్ ట్రీట్మెంట్పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెషన్స్‌లో ఔత్సాహికుల స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయాను. హెయిర్ కలరింగ్‌కు, స్ట్రటెనింగ్, స్టైల్ కట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. మా దేశం బ్రెజిల్లో శిరోజ సౌందర్యం పైన మాత్రమే ఆసక్తి చూపిస్తారు. కానీ ఇక్కడ అధునాతన సాంకేతికత, అందం, ఆరోగ్యం మేళవింపుగా కనిపించింది. మొదటిసారి 2008లో భారతీయ మహిళల సంస్కృతిలో భాగమైన ఒక హెయిర్ స్టైల్ నన్నెంతగానో ఆకట్టుకుంది. నేను పలు దేశాల్లో శిక్షణ అందిస్తున్న సమయంలో భారతీయ అందం గురించి, ముఖ్యంగా ఇక్కడి పొడవైన జుట్టు గురించి చాలా సార్లు విన్నాను. ఇక్కడ మహిళల సౌందర్యానికి, వినూత్నమైన వ్యక్తిత్వానికి కేశాలంకరణ ప్రతిబింబంలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడి అమ్మాయిలు ట్రెండీగా కనిపిస్తున్నారు. సాధారణంగా ప్రతి రెండు నెలలకోసారి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. అందంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కాబట్టి తక్కువ రసాయనాలు వాడటం శ్రేయస్కరం. బోటోసూ్మత్ ట్రీట్మెంట్ అందంతో పాటు ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి. –వివియన్ బెనెడెట్టో, అంతర్జాతీయ హెయిర్ మాస్ట్రో, బ్రెజిల్. (ఫార్మాల్డిహైడ్–రహిత హెయిర్‌స్టైలిస్ట్) -
భారత్, శ్రీలంకల మధ్య విజన్ డాక్యుమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాక ఆర్థిక భాగస్వామ్య విస్తరణకు ఒక విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనని విడుదల చేశారు. గత ఏడాది శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నప్పుడు భారత్ ఒక స్నేహితుడిలా ఆదుకుందని, ఇరు దేశాల మధ్య భద్రత, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. శ్రీలంకతో ఆర్థిక భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, విద్యుత్, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అనుసంధానం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. నావికా బలగం, వైమానిక దళం, ఇంధనం, ప్రజల మధ్య అనుసంధానం వంటివి కూడా బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను తీర్చడానికి సహకరించాలని ప్రధాని మోదీ విక్రమ్ సింఘేను కోరారు. మత్స్యకారుల అంశంలో మానవీయ కోణంలో ఆలోచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
-
మల్టీప్లెక్స్... బాక్సాఫీస్ హిట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరిస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల స్థానంలో ఇవి ఎంట్రీ ఇస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున మల్టీప్లెక్సుల ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. ఒ క్కో కంపెనీ ఏటా 100కుపైగా స్క్రీన్లను నెలకొల్పుతున్నాయంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలు ఒక్కో తెరకు (థియేటర్) రూ.2.5 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాయి. డాల్బీ అట్మోస్, ఓరా వంటి ఆధునిక సౌండ్ టెక్నాలజీ, లేజర్ ప్రొజెక్టర్లతో వ్యూయర్ ఎక్స్‌పీరియెన్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఇదీ పరిశ్రమ.. దేశవ్యాప్తంగా 9,000 తెరలు ఉన్నాయి. ఇందులో మల్టీప్లెక్సుల్లో 3,000 స్క్రీన్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు 6,000 దాకా నెలకొన్నాయి. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, కార్నివాల్, మిరాజ్ ఈ రంగంలో పెద్ద బ్రాండ్లుగా అప్రతిహతంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఆసియాన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రాంతీయ బ్రాండ్లు 20 దాకా ఈ రంగంలో ఉన్నాయి. మల్టీప్లెక్సుల స్క్రీన్లు ఏటా 12 శాతం వృద్ధి చెందుతున్నాయి. దేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య తగ్గుతోంది. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవి గట్టి పట్టు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,500 దాకా స్క్రీన్లుంటే, వీటిలో సింగిల్ స్రీన్లే అత్యధికం. సింగిల్ స్థానంలో మల్టీ.. భారత్‌లో 6,000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పడిపోతోంది. గతేడాది ఈ థియేటర్ల సంఖ్య 5 శాతం తగ్గాయి. వీటి స్థానంలో మల్టీప్లెక్సులు వస్తున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో ఇవి నెలకొని ఉండడం కలిసివచ్చే అంశం. పైగా పెద్ద బ్రాండ్లు సొంతంగా పెట్టుబడి పెట్టి మల్టీప్లెక్సులను నిర్మిస్తుండడంతో స్థల/థియేటర్ యజమానులకు ఎటువంటి భారం ఉండడం లేదు. పైపెచ్చు గతంలో కంటే ఏటా అదనంగా నిర్దిష్ట ఆదాయం వస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సీట్ల సామర్థ్యం 500 నుంచి 600 దాకా ఉంది. అదే మల్టీప్లెక్సు అయితే ఒక్కో స్క్రీన్ 250 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటున్నాయి. ఏటా 12 శాతం వృద్ధి.. టికెట్ల విక్రయం, ప్రకటనలు, ఫుడ్ విక్రయాల ద్వారా పరిశ్రమ ఏటా రూ.17,500 కోట్లు ఆర్జిస్తోంది. వృద్ధి రేటు 10–12 శాతం ఉంటోంది. ఈ ఆదాయంలో 60 శాతం వాటా మల్టీప్లెక్సులు కైవసం చేసుకుంటున్నాయి. మొత్తం ఆదాయంలో తెలుగు సినిమాల ద్వారా 20 శాతం, తమిళం 15, మలయాళం 5, కన్నడ 5 శాతం నమోదు అవుతోంది. పెద్ద బ్రాండ్ల మార్జిన్లు 22 శాతం వరకు ఉంటోందని సమాచారం. పరిశ్రమలో 50,000 మంది పైచిలుకు పనిచేస్తున్నారు. సగటున 2,000 సినిమాలు.. భారత్‌లో ఏటా 2,000 సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. ఇందులో 1,600 దేశీయంగా నిర్మించినవి కాగా మిగిలినవి విదేశాలకు చెందినవి. సినిమాల నిర్మాణం పరంగా ప్రపంచంలో భారత్ తొలి స్థానంలో ఉంటుంది. మొత్తం సినిమాల్లో 700 దాకా హిందీ సినిమాలు, 300–350 తెలుగు సినిమాలు ఉంటాయి. టికెట్ ధర ఎంతైనా సరే.. అల్ట్రా ప్రీమియం స్క్రీన్స్‌లో టికెట్ ధర ఊహించనంత ఉంటోంది. ఢిల్లీలో అయితే ఏకంగా రూ.3,000 వరకు ఉందని మిరాజ్ ఎంటర్టైన్మెంట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ భువనేష్ మెందిరట్ట సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సినిమా అనుభూతి కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావాల్సిందేనని చెప్పారు. ఇందుకు ఖర్చుకు వెనుకాడడం లేదన్నారు. ‘ఒక ఏడాదిలో థియేటర్ల ఆక్యుపెన్సీ (సీట్లు నిండడం) దేశ సగటు 30 శాతం ఉంది. దక్షిణాదిన ఇది అత్యధికగా 50 శాతం నమోదు చేస్తోంది. మల్టీప్లెక్స్ కల్చర్ ప్రధానంగా దక్షిణాదినే కేంద్రీకృతమైంది’ అని వివరించారు. 5 -
పీహెచ్‌సీలకు జబ్బు
వైద్యులు, సిబ్బంది కొరతతో అందని నాణ్యమైన సేవలు ప్రారంభానికి నోచుకోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అప్‌గ్రేడ్ అయిన పీహెచ్‌సీల్లో స్టాఫ్ కొరత కొత్త మండలాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు విద్యా, వైద్యంపై దృష్టి సారించిన కలెక్టర్ ప్రతిపాదనలు అమలైతే వైద్యం మెరుగుపడినట్లే మహబూబాబాద్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందడం లేదు. కొత్తగా ప్రారంభించినా పీహెచ్‌సీల్లో పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. జిల్లాలో 17 పీహెచ్‌సీల్లో 35 మంది డాక్టర్లు అవసరం ఉండగా, 12 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది 486 మందికిగాను 131 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మల్యాల, కురవి, మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లిలో పీహెచ్‌సీల నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. తొర్రూరు పీహెచ్సీ, డోర్నకల్, గార్ల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేసినా దానికి తగ్గట్టుగా సిబ్బంది, వైద్యుల భర్తీ జరగలేదు. తొర్రూరు, డోర్నకల్ సీహెచ్‌సీల్లో అదనపు భవనాల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. గార్ల సీహెచ్‌సీ భవనం పూర్తయినా సిబ్బంది నియామకం జరుగలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అనేక సమస్యలతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గంగారం మండలంలోని కోమట్లగూడెం పీహెచ్సీ, డోర్నకల్ పీహెచ్సీ, కేసముద్రం, మరిపెడ, బలపాల పీహెచ్‌సీల్లో వైద్యులు లేరు. స్టాఫ్ నర్సులు, సిబ్బందే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 108 ఏఎన్ఎం సెంటర్లు ఉండగా వాటిలో 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 35 ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా సిబ్బంది, వైద్యులను భర్తీ చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత అధికారులకు పంపామని డీఎంహెచ్ఓ, కార్యాలయం సిబ్బంది తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యలపై అన్ని విషయాలను సంబంధిత అధికారులకు తెలియపర్చినట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ తెలిపారు. ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీలు.. మానుకోట మండలంలోని మల్యాల పీహెచ్సీ, కురవి, మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లి పీహెచ్‌సీల భవనాలు పూర్తయినా నేటికి ప్రారంభానికి నోచుకోలేదు. భవన నిర్మాణాలు జరిగి నెలలు గడుస్తున్నా సిబ్బంది నియామకం జరగకపోవడంతో ఆ భవనాలు నిరుపయోగంగానే ఉన్నాయి. మానుకోట జిల్లాగా ఏర్పాటు కావడంతో త్వరలోనే ఆ పోస్టులు భర్తీ అయి పీహెచ్‌సీలు ప్రారంభమవుతాయని ఆయా మండలాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారుల ప్రతిపాదనలు.. ప్రతి మండలానికి పీహెచ్సీ, 104, 108 వాహనాలు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని భర్తీ చేయాలని, మెడికల్ అధికారులకు తప్పనిసరిగా వాహనం ఇవ్వాలని, మండలానికి రెండు ఫాగింగ్ మిషన్లు ఏర్పాటు మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలో టీబీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీల్లో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, సీహెచ్‌సీల్లో ఎక్స్‌రే, ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేసి అందజేశారు.