శాన్ ఫ్రాన్సిస్కో: భారత్‌లో వ్యాపార అవకాశాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని, దేశంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ చైర్మన్, సీఈవో మార్క్ బెనియాఫ్ తెలిపారు. ప్రపంచం అంతా ’భారతీయ శకం’లోకి మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తమకు భారత్‌లో 11,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో చాలా మంది అంతర్జాతీయ క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నారని బెనియాఫ్ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ భారత వ్యాపార విభాగం కూడా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బజాజ్ గ్రూప్ వంటి దిగ్గజ కస్టమర్లకు కూడా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహించిన వార్షిక ’డ్రీమ్‌ఫోర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెనియాఫ్ ఈ విషయాలు చెప్పారు.
సేల్స్‌ఫోర్స్ భారత విభాగం చీఫ్‌గా ఉన్న ఎస్‌బీఐ మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య సారథ్య సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమం సందర్భంగా ఏజెంట్‌ఫోర్స్ సొల్యూషన్‌ను ఆవిష్కరించారు. వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగుల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment