Salesforce
-
భారత్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు: సేల్స్‌ఫోర్స్
శాన్ ఫ్రాన్సిస్కో: భారత్‌లో వ్యాపార అవకాశాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని, దేశంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ చైర్మన్, సీఈవో మార్క్ బెనియాఫ్ తెలిపారు. ప్రపంచం అంతా ’భారతీయ శకం’లోకి మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తమకు భారత్‌లో 11,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో చాలా మంది అంతర్జాతీయ క్లయింట్లకు సర్వీసులు అందిస్తున్నారని బెనియాఫ్ చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ భారత వ్యాపార విభాగం కూడా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బజాజ్ గ్రూప్ వంటి దిగ్గజ కస్టమర్లకు కూడా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహించిన వార్షిక ’డ్రీమ్‌ఫోర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బెనియాఫ్ ఈ విషయాలు చెప్పారు.సేల్స్‌ఫోర్స్ భారత విభాగం చీఫ్‌గా ఉన్న ఎస్బీఐ మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య సారథ్య సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు. కార్యక్రమం సందర్భంగా ఏజెంట్‌ఫోర్స్ సొల్యూషన్‌ను ఆవిష్కరించారు. వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగుల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. -
ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ..
Tech layoffs 2024: ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులకు లేఆఫ్‌లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ ప్రముఖ కంపెనీలు ఒక దాని వెంట మరొకటి లేఆఫ్‌లను ప్రకటిస్తూనే ఉన్నాయి. యూఎస్‌కు చెందిన క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు ప్రకటించిన లేఆఫ్‌లతో ఇప్పటికే అమెరికాలో తొలగింపుల తరంగం కొనసాగుతుండగా ఇందులో తాజాగా సేల్స్‌ఫోర్స్ చేరింది. సేల్స్‌ఫోర్స్ గత సంవత్సరం 10 శాతం ఉద్యోగాలను తగ్గించింది. కొన్ని కార్యాలయాలను మూసివేసింది. అయితే మార్జిన్లను పెంచడానికి 3,000 మందికి పైగా ఉద్యోగులను తీసుకుంటామని గడిచిన సెప్టెంబరులో కంపెనీ తెలిపింది. వరుస లేఆఫ్‌లు కొత్త ప్రారంభమైనప్పటి నుంచి టెక్ పరిశ్రమలో వరుస లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. Layoffs.fyi పోర్టల్ ప్రకారం.. 2024 ప్రారంభం నుంచి 85 టెక్ కంపెనీలు 23,770 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ వారం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్ యాక్టివిజన్ బ్లిజార్డ్‌లో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆన్లైన్ రిటైలర్ ఈబే దాదాపు 1,000 మంది ఉద్యోగుల తొలగింపులను కూడా ప్రకటించింది. -
భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న హెచ్‌సీఎల్ టెక్
ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech) భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్ (Banco do Brasil) సేల్స్‌ఫోర్స్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్లను మెరుగుపరిచేందుకు హెసీఎల్ టెక్నాలజీస్‌ను ఎంచుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సేల్స్‌ఫోర్స్‌తో భాగస్వామ్యం ద్వారా హెచ్‌సీఎల్ టెక్.. బ్యాంకో డో బ్రెజిల్ కస్టమర్ రిలేషన్స్, సర్వీస్ సొల్యూషన్లను మెరుగుపరచనుంది. తమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వనరులు, డేటా ఇంటిగ్రేషన్, ఇంటెలిజెంట్ గైడ్‌లైన్స్‌ను ఉపయోగించి కస్టమర్ సంతృప్తి, ఎంగేజ్‌మెంట్‌ను పెంచడంలో సహాయపడుతుంది. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థ లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థలలో ఒకటైన బ్యాంకో డో బ్రెజిల్ దాని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సేల్స్‌ఫోర్స్ అమలుకు హెచ్‌సీఎల్ టెక్‌ను పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంచుకుంది. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) బ్యాంకో డో బ్రెజిల్ అవసరాలకు అనుగుణంగా సేల్స్‌ఫోర్స్ సొల్యూషన్స్‌ను అమలు చేయడానికి హెసీఎల్ టెక్ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అనుభవం ఉన్న ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే సంపూర్ణ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నాలుగు సేల్స్‌ఫోర్స్ పరిష్కారాలను ఉపయోగించనుంది. అయితే ఈ భారీ ఒప్పందం విలువ ఎంత అనేది వెల్లడించలేదు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
‘మంచి రోజులు వచ్చాయి’.. లేఆఫ్స్ ఉద్యోగులకు బంపరాఫర్!
ఈ ఏడాది మాస్ లేఆఫ్స్, పింక్ స్లిప్స్‌తో జాబ్ మార్కెట్ కుదేలవుతూ ఎటు చూసినా కొలువుల కోతలు కలవరానికి గురిచేశాయి. ఆర్ధిక మాంద్యం భయాలు, మందగమనంతో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ ఉద్యోగులను ఎడాపెడా తొలగించాయి. అయితే తొలగించిన ఉద్యోగులను ఇప్పుడు ఆయా కంపెనీలు రా రమ్మని పిలుస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి పలు నివేదికల ప్రకారం.. మెటా, సేల్స్ ఫోర్స్ సంస్థలు తొలగించిన ఉద్యోగుల్ని రీ హైయర్ చేసుకుంటున్నట్లు తేలింది. ఈ సందర్భంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ సాండ్రా ఎస్క్యూర్ మాట్లాడుతూ.. కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి. అనంతరం కొత్త ప్రాజెక్ట్‌లను డెడ్‌లైన్ లోపు పూర్తి చేయడం విఫలం అవుతున్నాయి. కాబట్టే సంస్థలు ఉద్యోగం నుంచి తీసేసిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నాయని అన్నారు. మాజీ ఉద్యోగులు తిరిగి సంస్థలో చేరేలా ఒప్పించడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ మాజీ ఉద్యోగులకు పిలుపు ఈ ఏడాది జనవరిలో సేల్స్ ఫోర్స్ సేల్స్, ఇంజనీరింగ్, డేటా క్లౌడ్ వంటి విభాగాల్లో 10 శాతం మేర అంటే సుమారు 3 వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారినే ఇప్పుడు మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపింది. ఉద్వాసన పలికే సమయంలో ఆ కంపెనీ సీఈవో మార్క్ బెనియోఫ్ ఉద్యోగులకు లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. అమెరికాలో ఫైర్ చేసిన ఉద్యోగులకు కనీసం ఐదు నెలల జీతం, హెల్త్ ఇన్సూరెన్స్, మరో సంస్థలో ఉద్యోగం దొరికేలా సహాయంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. యూఎస్ మినహా ఇతర దేశాల చట్టాలకు అనుగుణంగా ఉద్యోగులకు ప్రయోజనాల్ని అందిస్తామని అన్నారు. మెటాలో ఉద్యోగుల తొలగింపు మెటా గతేడాది నవంబర్‌లో 11,000 మందిని తొలగించింది. ఈ ఏడాది మార్చిలో 10,000ని ఫైర్ చేసింది. దీంతో నెలల వ్యవధిలో 21,000 మంది మెటా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటప్పుడు తొలగించడం ఎందుకో ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్ లకు భారీ బోనస్ లు చెల్లించాలని నిర్ణయించుకున్నారు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్. అదే సమయంలో పలువురు మాజీ ఉద్యోగుల్ని రీహైయర్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తొలగించిన ఉద్యోగుల పనితీరు పట్ల సంతృప్తి చెందడం వల్లే తాము అలా చేశామని చెప్పారు. కానీ సీఈవో స్పందనపై ఉద్యోగులు అసంతృత్తిని వ్యక్తం చేశారు. పనితీరు బాగుంటే మమ్మల్ని ఎందుకు తొలగించారని గుసుగుసలాడుతున్నారు. కాగా, ఉన్న ఉద్యోగం ఊడి.. కొత్త ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతున్న మాజీ ఉద్యోగులు కంపెనీల రీహైయర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
హైదరాబాద్‌లో సేల్స్‌ఫోర్స్ కార్యాలయం ప్రారంభం
ప్రముఖ టెక్నాలజీ సంస్థ సేల్స్ ఫోర్స్ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. Great going @salesforce 👏#HappeningHyderabad https://t.co/GCPYlweC7r — KTR (@KTRBRS) March 16, 2023 అనంతరం సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీని తల్లా ప్రగడ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను చేయవచ్చని అన్నారు. -
రిమోట్ వర్కింగ్ బిజినెస్‌లో అతిపెద్ద డీల్
న్యూయార్క్: వర్క్‌ప్లేస్ మెసేజింగ్ యాప్ స్లాక్ టెక్నాలజీస్ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకు సేల్స్‌ఫోర్స్.కామ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ విలువ 27.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 2.05 లక్షల కోట్లు). క్లౌడ్ కంప్యూటింగ్ సేవల దిగ్గజం సేల్స్‌ఫోర్స్ కుదుర్చుకున్న అతిపెద్ద డీల్ ఇది. తద్వారా రిమోట్ వర్కింగ్ సేవలకు మరింత బూస్ట్నివ్వనుంది. అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రత్యర్ధి సంస్థ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు పోటీనివ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ డీల్ ద్వారా సేల్స్‌ఫోర్స్.. ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములతో బిజినెస్‌ల కనెక్టివిటీకి యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు కానున్నట్లు విశ్లేషకులు వివరించారు. యాప్‌ల వినియోగం ద్వారా రెండువైపులా కనెక్టివిటీకి వీలు కలగనున్నట్లు తెలియజేశారు. టీమ్స్ జూమ్ కోవిడ్-19 కారణంగా తలెత్తిన రిమోట్ వర్కింగ్ పరిస్థితులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో పోటీలో స్లాక్ టెక్నాలజీస్ వెనుకబడినట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. రియల్ టైమ్ మెసేజింగ్ ద్వారా గ్రూప్‌ల మధ్య సంభాషణలకు వీలు కల్పిస్తూ స్లాక్ సర్వీసులను అందిస్తోంది. మరోపక్క మైక్రోసాఫ్ట్ టీమ్స్ ప్రొడక్ట్‌లో భాగంగా వీడియో, వాయిస్ కాలింగ్‌కు వీలు కల్పిస్తూ బిజినెస్‌ను భారీగా పెంచుకున్నట్లు పేర్కొన్నారు. ఆఫీస్ ప్యాకేజీలతోపాటు.. టీమ్స్‌ను అందించడం ద్వారా మైక్రోసాఫ్ట్ లబ్ది పొందినట్లు తెలియజేశారు. కాగా.. సేల్స్‌ఫోర్స్‌తో డీల్ కుదుర్చుకోవడం ద్వారా టెక్నాలజీయేతర కంపెనీలకూ స్లాక్ సర్వీసులు విస్తరించే వీలున్నట్లు వివరించారు. డీల్ తీరిలా స్లాక్‌తో సేల్స్‌ఫోర్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఎలాగంటే.. యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో మంగళవారం సేల్స్‌ఫోర్స్ షేరు 45.5 డాలర్ల వద్ద ముగిసింది. దీని ఆధారంగా స్లాక్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకి 26.79 డాలర్ల నగదు లభించనుంది. అంతేకాకుండా 0.0776 సేల్స్‌ఫోర్స్ షేర్లు సొంతంకానున్నాయి. గత వారం డీల్‌పై చర్చలు బయటపడ్డాక అంచనా వేసిన విలువతో పోలిస్తే ఈ ఆఫర్‌ను 54 శాతం ప్రీమియంగా నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ ముగిశాక డీల్ వివరాలు వెల్లడికావడంతో ఫ్యూచర్స్‌లో సేల్స్‌ఫోర్స్ షేరు 4 శాతం పతనంకాగా.. స్లాక్ షేరు నామమాత్ర నష్టంతో 43.73 డాలర్లకు చేరింది. కాగా.. ఈ ఏడాది మూడో క్వార్టర్లో సేల్స్‌ఫోర్స్ ఆదాయం అంచనాలను మించుతూ 5.42 బిలియన్ డాలర్లకు చేరింది. సీఎఫ్‌వో మార్క్ హాకిన్స్ జనవరిలో పదవీ విరమణ చేయనున్నట్లు సేల్స్‌ఫోర్స్ తాజాగా పేర్కొంది. సీఎఫ్‌వో బాధ్యతలను ప్రస్తుత చీఫ్ లీగల్ ఆఫీసర్‌ను అమీ వీవర్ చేపట్టనున్నట్లు తెలియజేసింది. -
ఐటీ దిగ్గజం ‘సేల్స్ ఫోర్స్’ భారీ సహాయం
బెంగుళూరు: ప్రముఖ క్లౌడ్, ఐటీ దిగ్గజం సేల్స్‌ఫోర్స్ దేశంలోని డిజిటల్ నైపుణ్యాలను పెంచేందుకు 6 ఎన్జీఓ సంస్థలకు భారీ సహాయాన్ని ప్రకటించింది. డిజిటల్ నైపుణ్యాల పెంపు కోసం (2లక్షల 40వేల డాలర్ల) నిధులను కేటియించి ఔదార్యాన్ని చాటుకుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి మనిషికి డిజిటల్ నైపుణ్యాలు ఎంతో అవసరమని సేల్స్‌ఫోర్స్ ఇండియా సీఈఓ అరందతి బట్టాచార్య తెలిపారు. దేశ వ్యాప్తంగా అత్యుత్తమ సేవలందిస్తున్న ఆరు ఎన్జీఓ(అక్షయ పాత్ర ఫౌండేషన్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, ఆంథిల్ క్రియేషన్స్ ఫౌండేషన్, గూంజ్, ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా, ప్రోత్సాహాన్ ఇండియా ఫౌండేషన్ సంస్థలకు నిధులు కేటాయించింది. అయితే ఈ సంస్థలు 15,000 మంది డిజిటల్ నైపుణ్యాలకు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా కరోనా సంక్షోభంలోను తమ సంస్థ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించినట్లు తెలిపారు. సేల్స్‌ఫోర్స్ సంస్థలో ఖర్చు తక్కువతో మెరుగైన సేవలు అందిస్తుందని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా 1999 సంవత్సరంలో ఏర్పాటయిన సేల్స్‌ఫోర్స్ కంపెనీ 1,700 కోట్ల డాలర్ల తో క్లౌడ్ విభాగంలో అగ్రగామి సంస్థగా నిలిచింది. సేల్స్‌ఫోర్స్ సంస్థ కేవలం క్లౌడ్ విభాగంలో మాత్రమే కాకుండా మొబైల్, సోషల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్) తదితర రంగాలలో మెరుగైన సేవలతో దూసుకెళ్తుంది. -
విప్రో కొనుగోళ్ల రూటు
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ఒకానొక అతిపెద్ద సేల్స్‌ఫోర్స్ పార్ట్నర్ కంపెనీ ‘4సీ’ని విప్రో సొంతం చేసుకోనుంది. ఇందుకోసం 68 మిలియన్ యూరోలను (సుమారు రూ.589 కోట్లు) చెల్లించనున్నట్టు విప్రో గురువారం ప్రకటించింది. బెల్జియంలోని మెకెలెన్ కేంద్రంగా 1997లో 4సీ ఏర్పాటైంది. ఇప్పటి వరకు 500కు పైగా కస్టమర్లకు 1,500 ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చింది. లండన్, ప్యారిస్, బ్రసెల్స్, దుబాయి తదితర దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, బెనెలక్స్, నార్డిక్స్, యూఏఈ ప్రాంతాల్లో సేల్స్‌ఫోర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2020 జనవరి చివరితో ముగిసిన ఏడాది కాలంలో కంపెనీ 31.8 మిలియన్ యూరోల ఆదాయాన్ని (రూ.275 కోట్లు) నమోదు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఈ డీల్ పూర్తవుతుందని విప్రో భావిస్తోంది. 4సీ కొనుగోలుతో సంబంధిత ప్రాంతాల్లో సేల్స్‌ఫోర్స్ సొల్యూషన్లను అందించే కీలకమైన కంపెనీ గా తాము అవతరించొ చ్చని విప్రో పేర్కొంది. విప్రో ఇప్పటికే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల్లోని మార్కెట్లలో సేల్స్‌ఫోర్స్ సొల్యూషన్లను అందిస్తోంది. -
1,377 కోట్లకు టైమ్ మేగజీన్ అమ్మకం
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్ మేగజీన్ యాజమాన్యం మరోసారి మారింది. క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ మార్క్ బెనియాఫ్కు టైమ్ మేగజీన్‌ను రూ.1,377 కోట్లకు (190 మిలియన్ డాలర్లు) అమ్ముతున్నట్లు మెరిడిత్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా పూర్తి నగదును చెల్లించనున్నట్లు వెల్లడించింది. టైమ్ మేగజీన్ రోజువారీ వార్తలకు సేకరణ, ప్రచురణలకు సంబంధించి నూతన యాజమాన్యం జోక్యం చేసుకోబోదని పేర్కొంది. ఈ కొనుగోలు పూర్తిగా బెనియాఫ్ వ్యక్తిగతమనీ, దీనికి సేల్స్‌ఫోర్స్ కంపెనీతో సంబంధం లేదంది. గతేడాది టైమ్ మేగజీన్ సహా పలు ప్రచురణలను టైమ్ కంపెనీ నుంచి మెరిడిత్ కొనుగోలు చేసింది. ఈ విషయమై బెనియాఫ్ దంపతులు స్పందిస్తూ.. ప్రపంచంపై గణనీయమైన ప్రభావం చూపగల కంపెనీలో తాము పెట్టుబడి పెడుతున్నామని వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 1923, మార్చిలో యేల్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థులు హెన్రీ లూస్, బ్రిటాన్ హడెన్‌లు కలసి టైమ్ మేగజీన్‌ను ప్రారంభించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇదే తరహాలో 2013లో వాషింగ్టన్ పోస్ట్ పత్రికను రూ.1,811 కోట్లకు కొన్నారు. -
గట్టిపోటీ: ఒరాకిల్ భారీగా ఉద్యోగాలు
ప్రముఖ మల్టినేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్‌తో గట్టిపోటీకి సిద్దమైంది. ఈ పోటీలో భాగంగా ఒరాకిల్ భారీగా ఉద్యోగ నియామకాలకు గంట మోగించింది.. తమ క్లౌడ్ సాఫ్ట్వేర్ బిజినెస్‌లో మరో ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రిలో సేల్స్‌ఫోర్స్ ఇంక్‌కు గట్టి పోటీగా నిలబడి మార్కెట్ షేరును దక్కించుకోవాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్వార్టర్లో ఒరాకిల్ రెవెన్యూలు 58 శాతం మేర పైకి ఎగిశాయి. ఇండస్ట్రిలో గట్టిపోటీతో పాటు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ సంస్థలు నియామకాల జోరును కొనసాగిస్తున్నాయి. 2018 వరకు అమెజాన్.కామ్ ఇంక్ కూడా లక్ష మంది వర్కర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఆపిల్ ఇంక్ కూడా అమెరికా మానుఫ్రాక్ట్ర్చరింగ్లో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తెలిపింది. -
హైదరాబాద్‌లో సేల్స్‌ఫోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యకలాపాల విస్తరణలో భాగంగా సాఫ్ట్వేర్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్ తాజాగా హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ని ప్రారంభించింది. 2020 నాటికల్లా ఈ కేంద్రంలో 1,000 ఉద్యోగాల మేర కల్పించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు పార్కర్ హ్యారిస్ మంగళవారమిక్కడ తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో వెలుపల ఇది తమకు అతి పెద్ద కార్యాలయమని ఆయన పేర్కొన్నారు. సేల్స్‌ఫోర్స్‌కి ప్రస్తుతం భారత్‌లో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబైలలో కూడా కార్యాలయాలు ఉన్నాయి.