గట్టిపోటీ: ఒరాకిల్ భారీగా ఉద్యోగాలు
గట్టిపోటీ: ఒరాకిల్ భారీగా ఉద్యోగాలు
Published Mon, Aug 28 2017 8:23 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM
ప్రముఖ మల్టినేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్‌తో గట్టిపోటీకి సిద్దమైంది. ఈ పోటీలో భాగంగా ఒరాకిల్ భారీగా ఉద్యోగ నియామకాలకు గంట మోగించింది.. తమ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ బిజినెస్‌లో మరో ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రిలో సేల్స్‌ఫోర్స్ ఇంక్‌కు గట్టి పోటీగా నిలబడి మార్కెట్ షేరును దక్కించుకోవాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్వార్టర్‌లో ఒరాకిల్ రెవెన్యూలు 58 శాతం మేర పైకి ఎగిశాయి. ఇండస్ట్రిలో గట్టిపోటీతో పాటు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ సంస్థలు నియామకాల జోరును కొనసాగిస్తున్నాయి. 2018 వరకు అమెజాన్.కామ్ ఇంక్ కూడా లక్ష మంది వర్కర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఆపిల్ ఇంక్ కూడా అమెరికా మానుఫ్రాక్ట్ర్చరింగ్‌లో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తెలిపింది.
Advertisement