దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నియామకాల పునరుద్ధరణకు టీసీఎస్‌లో పరిణామాలు సంకేతంగా నిలుస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11,000 మంది ట్రైనీలను చేర్చుకున్నామని, మార్చి 2025తో ముగిసే సంవత్సరానికి 40,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.
దేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హెడ్‌కౌంట్ (ఉద్యోగుల సంఖ్య) మొదటి త్రైమాసికంలో 5,452 పెరిగి 6,06,998కి చేరుకుందని కంపెనీ తెలిపింది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో దీని హెడ్‌కౌంట్ 13,249 తగ్గింది. క్రితం త్రైమాసికంలో ఉన్న 12.5%తో పోలిస్తే క్యూ1లో అట్రిషన్ 12%కి తగ్గింది.
రెండో త్రైమాసికంలో అట్రిషన్ స్థిరపడుతుందని క్యూ1 ఎర్నింగ్స్ కాల్‌లో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. "ప్రతిభను పెంపొందించడానికి టీసీఎస్‌కు ట్రైనీలు కీలకమైన వ్యూహం. అది ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది" అని ఆయన చెప్పారు.
40 వేల జాబ్స్
2025 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలో ఉన్నామని టీసీఎస్ తెలిపింది. అయితే ఇది బాహ్య కారకాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.
కంపెనీ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్‌ని కూడా ముగించి క్వాలిఫైడ్ అభ్యర్థులను ప్రాసెస్ చేస్తోంది. టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది అభ్యర్థి సామర్థ్యాలు, నైపుణ్యాలను అంచనా వేసే సామర్థ్య పరీక్ష. కంపెనీ నైపుణ్య అంతరాలను అంచనా వేస్తుందని, అవసరాల ఆధారంగా నియామకాలు చేపడుతోందని లక్కాడ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment