Hirings
-
ఐటీ నిరుద్యోగుల కష్టాలు తీరినట్టే..!!
గతేడాదినియామకాల మందగమనం తర్వాత, భారతీయ ఐటీ రంగం 2025 ఆర్థిక సంవత్సరం కోసం నియామక ప్రణాళికలను పునరుద్ధరిస్తోంది. దాదాపు 3,50,000 ఉద్యోగాలను జోడించడానికి సిద్ధంగా ఉంది. ఈ రంగానికి డిమాండ్ వాతావరణం మెరుగుపడటంతో కంపెనీలు నియామకాలపై దృష్టి పెట్టాయని స్టాఫింగ్ సంస్థల నిపుణులు చెబుతున్నారు.గడిచిన సంవత్సరంలో స్థూల ఆర్థిక ఎదురుగాలుల కారణంగా నియామక కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. నాస్కామ్ ప్రకారం, టెక్ పరిశ్రమ 2024 ఆర్థికేడాదిలో 60,000 కొత్త ఉద్యోగాలను మాత్రమే జోడించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన 2,70,000 ఉద్యోగాల కంటే చాలా తక్కువ. ఐటీ మేజర్లు గత ఏడాది మొత్తం ఉద్యోగుల సంఖ్య వృద్ధిలో పడిపోయాయి. అయితే, నియామక ఔట్లుక్ ఇప్పుడు సానుకూలంగా మారుతోంది.ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. “హెడ్‌కౌంట్ తగ్గుదలతో FY25ని ప్రారంభించినందున, భారతీయ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు నికర హెడ్‌కౌంట్ జోడింపులను నమోదు చేయడానికి ముందు క్షీణతను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం నికర వృద్ధి కోసం ప్రస్తుత ఔట్లుక్ FY24లో చూసినట్లుగా 2,00,000-2,50,000 మధ్య ఉంది. అయితే క్షీణత, విస్తరణ నియామకాల కోసం 3,25,000-3,50,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వృద్ధిలో 60% పైగా అగ్రశ్రేణి ఐటీ సంస్థల నుంచి రావచ్చు’’ ఎక్స్‌ఫెనో ఐటీ స్టాఫింగ్ బిజినెస్ హెడ్ సుందర్ ఈశ్వర్ పేర్కొన్నారు.ఆర్థిక అనిశ్చితులు, ఖర్చు-అవసరాల కారణంగా మొత్తం నియామకాల్లో ఫ్రెషర్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ తెలిపారు. పెద్ద ఐటీ సంస్థలు ఇప్పటికే ఫ్రెషర్ హైరింగ్‌లో గణనీయమైన పెరుగుదలను సూచించాయి. FY25లో టీసీఎస్ 40,000 మంది, హెచ్‌సీఎల్ టెక్ 10,000 మంది, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 15,000-20,000 మంది విప్రో 12,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. -
ఐటీ కష్టాలు తీరినట్టేనా? నియామకాల పునరుద్ధరణ సంకేతాలు
దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నియామకాల పునరుద్ధరణకు టీసీఎస్‌లో పరిణామాలు సంకేతంగా నిలుస్తున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11,000 మంది ట్రైనీలను చేర్చుకున్నామని, మార్చి 2025తో ముగిసే సంవత్సరానికి 40,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.దేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల ఎగుమతిదారు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) హెడ్‌కౌంట్ (ఉద్యోగుల సంఖ్య) మొదటి త్రైమాసికంలో 5,452 పెరిగి 6,06,998కి చేరుకుందని కంపెనీ తెలిపింది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో దీని హెడ్‌కౌంట్ 13,249 తగ్గింది. క్రితం త్రైమాసికంలో ఉన్న 12.5%తో పోలిస్తే క్యూ1లో అట్రిషన్ 12%కి తగ్గింది.రెండో త్రైమాసికంలో అట్రిషన్ స్థిరపడుతుందని క్యూ1 ఎర్నింగ్స్ కాల్లో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. "ప్రతిభను పెంపొందించడానికి టీసీఎస్‌కు ట్రైనీలు కీలకమైన వ్యూహం. అది ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది" అని ఆయన చెప్పారు.40 వేల జాబ్స్2025 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలో ఉన్నామని టీసీఎస్ తెలిపింది. అయితే ఇది బాహ్య కారకాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. కంపెనీ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్‌ని కూడా ముగించి క్వాలిఫైడ్ అభ్యర్థులను ప్రాసెస్ చేస్తోంది. టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది అభ్యర్థి సామర్థ్యాలు, నైపుణ్యాలను అంచనా వేసే సామర్థ్య పరీక్ష. కంపెనీ నైపుణ్య అంతరాలను అంచనా వేస్తుందని, అవసరాల ఆధారంగా నియామకాలు చేపడుతోందని లక్కాడ్ చెప్పారు. -
ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. నియామకాలు బాగా నెమ్మదించాయి. భారత్‌లో ముఖ్యంగా ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. దేశంలో ఉద్యోగాల క్షీణతకు సంబంధించి తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి భారతీయ ఐటీ హబ్‌లలో గడిచిన అక్టోబర్ నెలలో ఉద్యోగాల క్షీణత కనిపించిందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అక్టోబర్‌లో ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో నియామకాలు అత్యధికంగా పడిపోయాయి. మరోవైపు, చమురు, గ్యాస్, విద్యుత్ రంగాల్లో అత్యధిక వృద్ధి కనిపించింది. ఐటీ నియామకాల్లో 14% క్షీణత నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఐటీ రంగం నియామకాల్లో 14 శాతం క్షీణతను చూసింది. నౌకరీ డాట్ కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌పై ఈ నెలవారీ నివేదిక విడుదలైంది. ఇతర నగరాల్లో వృద్ధి కోల్‌కతాతో పాటు ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నియామకాల్లో 6 నుంచి 11 శాతం క్షీణత ఉండగా మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల్లో మాత్రం కొత్త జాబ్ ఆఫర్లలో వరుసగా 5, 4 శాతాల చొప్పున వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నియామకాలు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో పుణె, కోల్‌కతాలో నియామకాలు 6 శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికి వస్తే.. కొచ్చిలో 18 శాతం, కోయంబత్తూరులో 7 శాతం తగ్గింది. మరోవైపు మెట్రో నగరాలైన ఢిల్లీ 5 శాతం, ముంబై 4 శాతం వృద్ధిని సాధించాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదరలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 22 శాతం, జైపూర్‌లో 10 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైనట్లు నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రంగాల్లో జోష్ ఐటీ రంగంలో నియామకాల్లో క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లో మాత్రం కొత్త నియామకాల్లో జోష్ కనిపించినట్లు తాజా వివేదిక తెలిపింది. చమురు & గ్యాస్/పవర్ రంగం అత్యధికంగా 24 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఫార్మా పరిశోధన, అభివృద్ధి (19 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్స్/బ్రోకింగ్ (13 శాతం) ఉన్నాయి. ఇక నియామకాల్లో క్షీణత అత్యధికంగా ఉన్న రంగాలలో ఐటీ తర్వాత విద్య (10 శాతం), టెలికాం (9 శాతం) ఉన్నాయి. భారత్‌లో వైట్ కాలర్ నియామకానికి సంబంధించిన ఇండెక్స్ విలువ ఈ ఏడాది అక్టోబర్‌లో 2484గా ఉంది. ఇది గతేడాది అక్టోబర్‌లో 2455గా నమోదైంది. -
టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!
ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా టెక్నాలజీ కంపెనీల్లో నియామకాలు మందగించాయి. దీంతో టెక్ ఉద్యోగార్థులు జాబ్‌లు దొరక్క సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే అధ్యయనం ఒకటి వెలువడింది. ఇక రానున్నవి మంచిరోజులే అని ఆ అధ్యయనం చెబుతోంది. టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘సీల్’ గ్రూప్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. చాలా కంపెనీలు టెక్నాలజీ, ఇన్నోవేషన్-లీడ్ ఇనిషియేటివ్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హెడ్‌కౌంట్‌ను పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రత్యేక డిజిటల్ మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని ఈ అధ్యయనం తెలిపింది. ఇలాంటి ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లైడ్ మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్స్ డిజైన్, ఇంజినీరింగ్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి ఉద్యోగులను గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు నియమించుకుంటున్నాయని ‘సీల్’ అధ్యయనం పేర్కొంది. సాఫ్ట్వేర్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలలో ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయని వివరించింది. 96 కంపెనీల నుంచి ఇన్పుట్స్ గతేడాది ప్రారంభమైన లేదా విస్తరించిన 96 కంపెనీల నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇవి ఇప్పటికే గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లు కలిగి 57,500 మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్థలు. ఈ సెంటర్లలో ఏడాదిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగినట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. క్లౌడ్ ఇంజనీర్లు, డేటా ఇంజనీర్లకు కూడా డిమాండ్ పెరిగిందని పేర్కొంది. గత సంవత్సరంలో, ఆటో రంగంలో కంపెనీలు గణనీయంగా గ్లోబల్ కేపిబిలిటీ సెంటర్లును ఏర్పాటు చేశాయని ‘సీల్’ హెచ్ఆర్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అధ్యయనం ప్రకారం, బెంగళూరులో 42 శాతం, హైదరాబాద్‌లో 22 శాతం, పూణేలో 10 శాతం, ఢిల్లీలో 8 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేసేవే.. అన్ని జీసీసీ ఉద్యోగ అవకాశాలలో దాదాపు 51 శాతం ఆఫీస్ నుంచి పని చేసేవే. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల పరంగా ఐటీ రంగంతో పోల్చితే ఇది తక్కువే. ఐటీ రంగంలో 77 శాతం వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో నియామకాలు జరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కంది. -
ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..!
భారత కంపెనీలు భారీ ఎత్తున ఫ్రెషర్ల నియామాకాలను చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెద్ద ఎత్తున్న నియామాకాలను జరిపేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ సర్వే వెల్లడించింది. 38 శాతంపైగా..! వచ్చే మూడు నెలల్లో 38 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయని సర్వేలో తేలింది. సుమారు 3090 కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే మాత్రం నియామకాలు 11 శాతం క్షీణించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో తమ ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని 55 శాతం, తగ్గొచ్చని 17 శాతం, నియామాకాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చునని 36 శాతం కంపెనీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. మొత్తంగా చూస్తే 38 శాతం కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తేలింది. వీడని భయాలు..! కరోనా రాకతో పలు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కోవిడ్ ఉదృతి కాస్త తగ్గడంతో కంపెనీలు కొత్త ఉద్యోగుల నియమాకాలపై దృష్టి సారించాయి. అయినప్పటీకి తాజా పరిస్థితులు కంపెనీల్లో భయాలను సృష్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వార్, అధిక ద్రవ్యోల్భణాల నుంచి కంపెనీలకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటి తెలిపారు. బలంగా భారత స్టార్టప్ వ్యవస్థ..! భారత్‌లో స్టార్టప్ వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది. స్టార్టప్ కంపెనీలకు భారత్ అనువైన దేశంగా మారినట్లు సందీప్ గులాటీ అభిప్రాయపడ్డారు. బలమైన స్టార్టప్ వ్యవస్థను రూపొందించేందుకు గాను కేంద్రం కూడా భారీ ఫండ్‌ను కేటాయిస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో సుమారు రూ.283.5 కోట్ల "స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఉద్యోగాల్లో మహిళల వాటా ఇంకా ఆందోళకరంగానే ఉందని సర్వే తెలిపింది. అత్యధికంగా ఐటీ, సాంకేతికరంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండగా, తరువాత రెస్టారెంట్లు-హోటళ్లు, విద్య, వైద్యం, సామాజిక-ప్రభుత్వ రంగాల్లో నియామాకాలు అధికంగా ఉంటాయని మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే వెల్లడించింది. చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే? -
నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం
న్యూఢిల్లీ:నియామక కార్యకలాపాలు స్థిరమైన రికవరీలో ఉన్నాయని లింక్డ్ఇన్ ఇండియా తెలిపింది. కోవిడ్ ముందస్తు కాలం 2019తో పోలిస్తే 65 శాతం అధికంగా నమోదయ్యాయని వివరించింది. ‘2021 ఏప్రిల్‌లో తిరోగమన వృద్ధి నమోదైంది. ఆ తర్వాతి నుంచి రికవరీ ప్రారంభమైంది. 2019తో పోలిస్తే ఈ ఏడాది మే చివరినాటికి 35 శాతం, జూన్ 42, జూలై చివరినాటికి 65 శాతం నియామకాలు అధికమయ్యాయి. ఒక సంవత్సరం స్తంభింపజేసిన తర్వాత ఐటీ, తయారీ, హార్డ్‌వేర్ వంటి పెద్ద రంగాలు నియామకాలను పెంచడం ప్రారంభించాయి. నియామకాలు క్రమంగా అధికం అవుతూనే ఉంటాయని అంచనా. ఉద్యోగాలు చేసేవారిలో కొత్తగా ప్రవేశించే వ్యక్తుల కంటే.. జాబ్ మారుతున్నవారే అధికం. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం కొనసాగుతున్నందున కొత్త, అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలలో అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు మారే వ్యక్తులలో భారీ తగ్గుదల ఏర్పడింది. చదవండి: మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు! -
లక్షల్లో వేతనాలు కావాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే.!
న్యూ ఢిల్లీ : కోవిడ్ 19 అదుపులో ఉండటంతో ఆర్థిక కార్యకాపాలు పుంజుకుంటున్నాయి. నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. కరోనా కారణంగా చాలా కాలంగా ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు తమ అర్హతకు తగ్గ జాబులు వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుం జాబ్మార్కెట్లో ఏ తరహా కోర్సులు, స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ ఉందనే అంశంపై లింక్డ్ఇన్ సర్వే చేపట్టింది. ఈ స్కిల్స్‌కే డిమాండ్ కరోనా తర్వాత అన్ని రంగాలు ఒకే సారి కోలుకోలేదు. ఎంటర్టైన్ మెంట్, నిర్మాణ రంగం ఇంకా గాడిన పడాల్సి ఉండగా ఐటీ రంగం సాధారణ స్థికి చేరుకుంటోంది. అయితే స్థూలంగా చూస్తే మార్కెట్లో నియామకాల సంఖ్య పెరిగిందని లింక్డ్ఇన్ సర్వేలో తేలింది. అదే సమయంలో ఉద్యోగాలను అన్వేషించే వారి సంఖ్య కూడా వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం ఐటీ సెక్టార్లోనే ఎక్కువ నియామకాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులోనూ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు ఉన్న యువ వర్కర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని లింక్డ్ఇన్ అంటోంది. ఈ స్కిల్స్ ఉన్నవారికి భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు కంపెనీలు వెనకడుగు వేయడం లేదని, భారీ జీతం రావాలంటే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు తప్పని సరి అని లింక్డ్ఇన్ సూచిస్తోంది. పెరుగుతున్న నియామకాలు కరోనా సంక్షోభానికి ముందు నాటి 2019తో పోలిస్తే నియామకాల రేటు ఈ ఏడాది జూన్‌లో 42 శాతం అధికంగా నమోదయినట్టు లింక్డ్ఇన్ ఇండియా తెలిపింది. సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో హైరింగ్ కాస్త తగ్గినా. మే వచ్చేప్పటికీ సాధారణ స్థితికి చేరుకోవడం మొదలైనట్టు తెలిపింది. మేలో 35 శాతం, జూన్‌లో 42 శాతం నియామకాలు రేటు అధికంగా నమోదు అయ్యాయి. నియామకాల రేటు ప్రస్తుతం దేశీయంగా జరుగుతున్న నియామకాలను లింక్డ్ఇన్లో నమోదు చేసుకున్న ఉద్యోగార్థుల సంఖ్యతో భాగించగా వచ్చిన అంకెను హైరింగ్ రేటుగా పరిగణలోకి తీసుకుని లింక్డ్ఇన్ ఈ నివేదిక రూపొందించింది. చాలాకాలంగా నిలిచిపోయిన నియామకాలను కంపెనీలు మళ్లీ చేపడుతుండటం వల్ల హైరింగ్ రేటు పెరుగుతున్నట్టు పేర్కొంది. -
రికార్డ్ స్థాయిలో పెరిగిన ఐటీ నియామకాలు
ముంబై: డిజిటలైజేషన్, ఆటోమేషన్ కారణంగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో రికార్డ్ స్థాయిలో మంచి వృద్ధి నమోదైంది. అన్ని పరిశ్రమల్లో కలిపి జనవరిలో 1,925 జాబ్స్ హైరింగ్స్ జరగగా.. గత నెలలో 2,356 నియామకాలు జరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సర్వే తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, మార్కెట్ సాధారణ స్థితికి చేరుకోవటంతో కోవిడ్-19 తర్వాత తొలిసారిగా మెజారిటీ పరిశ్రమలలో నియామక కార్యకలాపాలలో సానుకూల థృక్పదాన్ని సాధించాయని నివేదక వెల్లడించింది. నగరాల వారీగా చూస్తే.. దేశంలోని ఆరు మెట్రో నగరాలు, ప్రధాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జాబ్స్ హైరింగ్‌లో సానుకూల వాతావరణ నెలకొంది. గత నెలలో 31 శాతం నియామక వృద్ధితో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. 28 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. పుణేలో 24 శాతంగా ఉన్నాయి. వడోదరలో 20 హైరింగ్స్ ధోరణి కనిపించింది. చదవండి: అమెజాన్.. వెనక్కి తగ్గాలి బీమా సంస్థలలో భారీ వాటాల విక్రయం! -
కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కోరలకు చిక్కిన ప్రపంచం.. వైరస్ బారినుంచి కోలుకునేందుకు ఇంకా అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థలు, వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. మరోవైపు లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. అనేక సంస్థలు ఉద్యోగాలు తొలగింపు బాటలో అన్నాయి. అయితే ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ మాత్రం వేలాదిమందిని ఉద్యోగులుగా నియమించుకుంటోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా పుంజుకోవడంతో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే అమెరికా మార్కెట్లో లక్షమందికి పైగా అభ్యర్థులను నియమించుకున్నసంస్థ మరో 75 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సోమవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. అంతేకాదు అక్కడ పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాల పెంపు కోసం మొత్తం ఖర్చును 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే భారతదేశంలో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు, ఏప్రిల్ 20 నుంచి కొన్ని అత్యవసర సేవలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో దేశంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోందనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. (హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట) మహమ్మారి కారణంగా సంభవిస్తున్న ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఫలితంగా ఏర్పడిన ఉద్యోగ నష్టాలను తగ్గించడానికి తన నియామక ప్రయత్నాలు సహాయపడతాయని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ ప్రేరిత డిమాండ్ ను అందిపుచ్చుకున్న అమెజాన్ లక్ష మంది అదనపు సిబ్బందిని ఇప్పటికే నియమించుకుంది. మరో 75వేల మందిని (ఫుల్ టైం, పార్ట్ టైం) నియమించుకోనున్నామని తెలిపింది. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సంస్థ గిడ్డంగుల నుంచి సరుకు రవాణా కోసం అత్యధిక మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం అత్యవసర (ఎమర్జన్సీ ఉత్పత్తులు) ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకోవడంతో పాటు వాటి డెలివరీని కూడా నిర్ణీత సమయంలో అందిస్తామని స్పష్టం చేసింది. అయితే అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులను కూడా ముందుగా ఆన్లైన్లో చెల్లింపులు (ప్రీ ఆన్లైన్ ప్రేమెంట్) జరిపిన వారికే అందిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల భద్రతకు సంబంధించి టెంపరేచర్ తనిఖీ, శానిటైజింగ్, మాస్క్ లు లాంటి అత్యవసర భద్రతా చర్యలను కచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేసింది. -
పుంజుకున్న ఐటీ : లక్షకు పైగా ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : గత కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం మళ్లీ పుంజుకుంది. 2018-19 సంవత్సరంలో ఈ రంగంలో ఉద్యోగ నియామకాల్లో పురోగతిని సాధించాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గత మూడేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముఖ్యంగా డిమానిటైజేషన్ తరువాత ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ఇదే తొలిసారి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ మొత్తం 6 ఐటీ కంపెనీలు 1,04,820 మంది టెకీలను రిక్రూట్ చేసుకున్నాయి. ఈ ధోరణి రాబోయే త్రైమాసికాల్లో కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ , రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఏడాదిలో 53వేల ఉద్యోగాలనుకల్పించాయి. మార్చి 31 తో క్యూ4 ఫలితాల్లో టీసీఎస్ ఈ ఏడాది సుమారు 29, 287మందిని కొత్తగా నియమించుకున్నట్టు వెల్లడించింది. దీంతో కంపెనీలో మొత్త ఉద్యోగుల సంఖ్య 4,24,285గా టీసీఎస్ ప్రకటించింది. అలాగే ఇన్ఫోసిస కొత్త 24వేల 16మందిని నియమించుకోగా 2019, మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,28123గా పేర్కొంది. అయితే హెచ్‌సీఎల్, విప్రో ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అంతకు ముందు ఏడాది ఉద్యోగ నియమకాల విషయంలో ఐటీ సంస్థలు పేలవంగా ఉన్నాయి. ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ మొత్తం కలిపి 1,01,900 జాబ్స్‌ను మాత్రమే క్రియేట్ చేసాయి. ఇందులో టీసీఎస్ 7770 మందిని, ఇన్ఫోసిస్ 3740 మందిని మాత్రమే నియమించుకుంది. -
నియామకాల్లో మహిళలకు రెడ్ కార్పెట్
ముంబై: వచ్చే ఏడాది మహిళా ఉద్యోగుల నియామకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2019లో మహిళల హైరింగ్ 15–20 శాతం మేర పెరగనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీపుల్‌స్ట్రాంగ్ తెలియజేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ .. ఫైనాన్షియల్ సర్వీసెస్ .. ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఆటోమోటివ్, ఐటీ, సాఫ్ట్వేర్, హాస్పిటాలిటీ.. ట్రావెల్ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్లు ’ది ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్ 2019’ పేరిట రూపొందించిన నివేదికలో పీపుల్‌స్ట్రాంగ్ తెలియజేసింది. సుమారు 15 రంగాలకు చెందిన 1,000 పైగా సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. నిర్దిష్ట హోదాలకు సంబంధించి సుశిక్షితులైన వారి సంఖ్య తక్కువగా ఉండటం, సామాజిక కట్టుబాట్లు, పని ప్రదేశాల్లో భద్రత తదితర అంశాలు సైతం మహిళల నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు పీపుల్‌స్ట్రాంగ్ వ్యవస్థాపకుడు దేవాశీష్ శర్మ చెప్పారు. మహిళల నియామకాలను ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు. మహిళల ఉద్యోగిత క్రమంగా పెరుగుతోందంటూ ‘‘2017లో 38 శాతంగా ఉన్న ఉద్యోగిత.. 2018లో 46 శాతానికి చేరింది. కానీ ఇప్పటికీ మహిళా జనాభాతో పోలిస్తే వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగానే ఉంటోంది’’ అని శర్మ వివరించారు. ఉద్యోగులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ ఆఖరున ఉంది. తెలంగాణతో పాటు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఈ లిస్టులో ఈ ఏడాది కొత్తగా చోటు దక్కించుకున్నాయి. -
ఉర్దూ ఆఫీసర్స్ నియామకాల్లో అవకతవకలు
-
జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్న దానికి సూచనగా నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. నౌకరీడాట్‌కామ్ నివేదిక ప్రకారం మే నెలలో రిక్రూట్మెంట్స్ 11% పెరిగాయి. కంపెనీ నిర్వహించే జాబ్‌స్పీక్ సూచీ గతేడాది మేలో 1,904 పాయింట్లుగా ఉండగా.. ఈసారి మేలో 11% వృద్ధితో 2,106 పాయింట్లుగా నమోదైంది. ఏప్రిల్‌లో నియామకాల వృద్ధి 21%గా ఉన్నట్లు నౌకరీడాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ వెల్లడించారు.ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాలు, నిర్మాణ, ఇంజినీరింగ్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో అత్యధికంగా నియామకాలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిపుణులకు డిమాండ్ పెరుగుతుండటం .. ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయనడానికి స్పష్టమైన సూచనగా సురేశ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 13 శాతం .. నగరాలవారీగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 15 శాతం, ముంబైలో 14% నియామకాలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నైలలో ఇది 13 శాతంగా ఉంది. బెంగళూరులో ఒక మోస్తరుగా 3 శాతం వృద్ధి నమోదైంది. లో బేస్ కారణంగా కోల్‌కతా మాత్రం అత్యధికంగా 38 శాతం వృద్ధి కనపర్చింది. నెలలవారీగా తమ వెబ్సైట్లో నమోదయ్యే జాబ్ లిస్టింగ్స్ ఆధారంగా నౌకరీడాట్‌కామ్ ఈ సూచీ నిర్వహిస్తోంది. ఇందుకోసం 1,000 పాయింట్ల ప్రారంభ స్కోరుతో 2008 జూలైని బేస్ ఇయర్‌గా పరిగణిస్తుంది. ఆటో, నిర్మాణ, ఎఫ్ఎంసీజీల్లో జోరు: రంగాలవారీగా చూస్తే ఆటోమొబైల్, అనుబంధ సంస్థల్లో నియామకాలు వార్షికంగా 31 శాతం పెరిగాయి. నిర్మాణ, ఇంజనీరింగ్‌లో 21 శాతం మేర వృద్ధి చెందాయి. అనుభవం కోణంలో చూస్తే ఫ్రెషర్స్‌కి ఉద్యోగావకాశాలు స్థిరంగా 15 శాతం మేర పెరిగాయి. మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఉద్యోగుల (4–7 ఏళ్ల అనుభవం) నియామకాలు 11 శాతం పెరిగాయి. ఇక సబ్ సీనియర్ (8–12 ఏళ్లు), టాప్ మేనేజ్మెంట్ (16 ఏళ్ల పైగా అనుభవం) పోస్టుల్లో హైరింగ్ 5 శాతం మేర వృద్ధి నమోదైంది. -
ఐటీలో అంతే..
సాక్షి,బెంగళూర్: ఐటీ రంగంలో నియమాకాలు మరికొన్నేళ్లు మందకొడిగానే ఉంటాయన్న అంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 7-8 శాతం పెరగడం కష్టమేనని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) వీ బాలకృష్ణన్ అన్నారు. వచ్చే ఏడాది ఐటీ రంగంలో వృద్ధి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందిన మార్కెట్లలో పరిస్థితి ప్రోత్సాహకరంగా లేకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఐటీ రంగం చెప్పుకోదగ్గ వృద్థి సాధించలేదని పేర్కొన్నారు. నియామకాలు మందగించాయని, ఆటోమేషన్ ప్రభావంతో మూడు ప్రధాన కంపెనీలు ఉద్యోగుల వృద్థిలో ప్రతికూల వృద్ధిని సాధించాయని చెప్పుకొచ్చారు. అయితే భారత ఐటీ పరిశ్రమకు ప్రధాన వనరుగా ఉన్న అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కొంత మేర ఊపందుకోవడం ఊరట ఇచ్చే పరిణామమని చెప్పారు. యూరప్‌లోనూ పరిస్థితి మెరుగుపడటంతో వచ్చే ఏడాది నుంచి ఐటీ ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని, అయితే డిజిటల్ రంగంలోనూ భారత్ సత్తా చాటాలని డిజిటల్ వైపుయ మళ్లే క్రమంలో భారత ఐటీ పరిశ్రమ పెద్దమొత్తంలో నిధులు కేటాయించి నూతన టెక్నాలజీలకు మళ్లే ప్రక్రియపై పెట్టుబడులు పెట్టాల్సిఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ వృద్ధి 7 నుంచి 8 శాతం ఉంటుందన్న నాస్కామ్ అంచనాలను ప్రస్తావిస్తూ ఆ స్థాయిలో ఐటీ వృద్ధి ఉంటుందని తాను అనుకొవడం లేదన్నారు. మూడవ, నాల్గో త్రైమాసికాల్లో ప్రోత్సాహకర వృద్ధి రేటును సాధించడం ఐటీ పరిశ్రమ ముందున్న సవాల్ అని అన్నారు. ఇక ఐటీ రంగంలో నియామకాల్లో నెలకొన్న మందకొడితనం మరికొన్నాళ్లు కొనసాగుతుందని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. -
ఆ రంగంలో నియామకాలు పెరిగాయ్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్, ఫైనాన్సియల్ రంగంలో నియామాకాలు పెరిగినట్టు తెలిసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బ్యాంకింగ్ రంగంలో 21 శాతం వృద్ధి రేటు నమోదైందని జాబ్ పోర్టల్ నౌకరి.కామ్ రిపోర్టు చేసింది. దేశంలో ఉద్యోగ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్ నెలలో మొత్తం ఉద్యోగ మార్కెట్ 3 శాతం వృద్ధిని నమోదుచేసిందని పేర్కొంది. ఈ వృద్ధి కూడా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఆటో, ఇంజనీరింగ్ వంటి రంగాల వల్ల సాధ్యమైందని నౌకరి.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వీ.సురేష్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని నెలల వరకు ఉద్యోగ మార్కెట్లో ఈ అస్థిరత కొనసాగుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో నియామకాలు 15 శాతం వృద్ధిని నమోదుచేశాయని చెప్పారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉద్యోగాలు 32 శాతం, ఫైనాన్స్ ఉద్యోగాలు 15 శాతం వృద్ధి కనబర్చాయని నౌకరి.కామ్ పేర్కొంది. సాఫ్ట్వేర్ రంగంలో నియామకాలు మాత్రం ఆరు శాతం పడిపోయినట్టు తెలిసింది. మొత్తం 13 నగరాల్లో చేపట్టిన ఈ రిపోర్టులో 12 నగరాల్లో నియామకాలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ముంబై, కోల్‌కత్తాలో 15 శాతం వృద్ధి నమోదైంది. దేశరాజధానిలో మాత్రం నియామకాలు 9 శాతం తగ్గాయి. -
గట్టిపోటీ: ఒరాకిల్ భారీగా ఉద్యోగాలు
ప్రముఖ మల్టినేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్‌తో గట్టిపోటీకి సిద్దమైంది. ఈ పోటీలో భాగంగా ఒరాకిల్ భారీగా ఉద్యోగ నియామకాలకు గంట మోగించింది.. తమ క్లౌడ్ సాఫ్ట్వేర్ బిజినెస్‌లో మరో ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రిలో సేల్స్‌ఫోర్స్ ఇంక్‌కు గట్టి పోటీగా నిలబడి మార్కెట్ షేరును దక్కించుకోవాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్వార్టర్లో ఒరాకిల్ రెవెన్యూలు 58 శాతం మేర పైకి ఎగిశాయి. ఇండస్ట్రిలో గట్టిపోటీతో పాటు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ సంస్థలు నియామకాల జోరును కొనసాగిస్తున్నాయి. 2018 వరకు అమెజాన్.కామ్ ఇంక్ కూడా లక్ష మంది వర్కర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఆపిల్ ఇంక్ కూడా అమెరికా మానుఫ్రాక్ట్ర్చరింగ్లో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తెలిపింది.