సాక్షి, న్యూఢిల్లీ : గత కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం మళ్లీ పుంజుకుంది. 2018-19 సంవత్సరంలో ఈ రంగంలో ఉద్యోగ నియామకాల్లో పురోగతిని సాధించాయి. ప్రధానంగా ఐటీ కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గత మూడేళ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముఖ్యంగా డిమానిటైజేషన్ తరువాత ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకోవడం ఇదే తొలిసారి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ మొత్తం 6 ఐటీ కంపెనీలు 1,04,820 మంది టెకీలను రిక్రూట్ చేసుకున్నాయి. ఈ ధోరణి రాబోయే త్రైమాసికాల్లో కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు.
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ , రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఏడాదిలో 53వేల ఉద్యోగాలనుకల్పించాయి. మార్చి 31 తో క్యూ4 ఫలితాల్లో టీసీఎస్ ఈ ఏడాది సుమారు 29, 287మందిని కొత్తగా నియమించుకున్నట్టు వెల్లడించింది. దీంతో కంపెనీలో మొత్త ఉద్యోగుల సంఖ్య 4,24,285గా టీసీఎస్ ప్రకటించింది. అలాగే ఇన్ఫోసిస కొత్త 24వేల 16మందిని నియమించుకోగా 2019, మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,28123గా పేర్కొంది. అయితే హెచ్‌సీఎల్, విప్రో ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
అంతకు ముందు ఏడాది ఉద్యోగ నియమకాల విషయంలో ఐటీ సంస్థలు పేలవంగా ఉన్నాయి. ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్ మొత్తం కలిపి 1,01,900 జాబ్స్‌ను మాత్రమే క్రియేట్ చేసాయి. ఇందులో టీసీఎస్ 7770 మందిని, ఇన్ఫోసిస్ 3740 మందిని మాత్రమే నియమించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment