గతేడాదినియామకాల మందగమనం తర్వాత, భారతీయ ఐటీ రంగం 2025 ఆర్థిక సంవత్సరం కోసం నియామక ప్రణాళికలను పునరుద్ధరిస్తోంది. దాదాపు 3,50,000 ఉద్యోగాలను జోడించడానికి సిద్ధంగా ఉంది. ఈ రంగానికి డిమాండ్ వాతావరణం మెరుగుపడటంతో కంపెనీలు నియామకాలపై దృష్టి పెట్టాయని స్టాఫింగ్ సంస్థల నిపుణులు చెబుతున్నారు.
గడిచిన సంవత్సరంలో స్థూల ఆర్థిక ఎదురుగాలుల కారణంగా నియామక కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. నాస్కామ్ ప్రకారం, టెక్ పరిశ్రమ 2024 ఆర్థికేడాదిలో 60,000 కొత్త ఉద్యోగాలను మాత్రమే జోడించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన 2,70,000 ఉద్యోగాల కంటే చాలా తక్కువ. ఐటీ మేజర్లు గత ఏడాది మొత్తం ఉద్యోగుల సంఖ్య వృద్ధిలో పడిపోయాయి. అయితే, నియామక ఔట్‌లుక్ ఇప్పుడు సానుకూలంగా మారుతోంది.
ఎన్‌డీటీవీ నివేదిక ప్రకారం.. “హెడ్‌కౌంట్ తగ్గుదలతో FY25ని ప్రారంభించినందున, భారతీయ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు నికర హెడ్‌కౌంట్ జోడింపులను నమోదు చేయడానికి ముందు క్షీణతను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం నికర వృద్ధి కోసం ప్రస్తుత ఔట్‌లుక్ FY24లో చూసినట్లుగా 2,00,000-2,50,000 మధ్య ఉంది. అయితే క్షీణత, విస్తరణ నియామకాల కోసం 3,25,000-3,50,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వృద్ధిలో 60% పైగా అగ్రశ్రేణి ఐటీ సంస్థల నుంచి రావచ్చు’’ ఎక్స్‌ఫెనో ఐటీ స్టాఫింగ్ బిజినెస్ హెడ్ సుందర్ ఈశ్వర్ పేర్కొన్నారు.
ఆర్థిక అనిశ్చితులు, ఖర్చు-అవసరాల కారణంగా మొత్తం నియామకాల్లో ఫ్రెషర్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ తెలిపారు. పెద్ద ఐటీ సంస్థలు ఇప్పటికే ఫ్రెషర్ హైరింగ్‌లో గణనీయమైన పెరుగుదలను సూచించాయి. FY25లో టీసీఎస్ 40,000 మంది, హెచ్‌సీఎల్ టెక్ 10,000 మంది, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 15,000-20,000 మంది విప్రో 12,000 మంది వరకు ఫ్రెషర్‌లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment