న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్న దానికి సూచనగా నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. నౌకరీడాట్‌కామ్ నివేదిక ప్రకారం మే నెలలో రిక్రూట్‌మెంట్స్ 11% పెరిగాయి. కంపెనీ నిర్వహించే జాబ్‌స్పీక్ సూచీ గతేడాది మేలో 1,904 పాయింట్లుగా ఉండగా.. ఈసారి మేలో 11% వృద్ధితో 2,106 పాయింట్లుగా నమోదైంది. ఏప్రిల్‌లో నియామకాల వృద్ధి 21%గా ఉన్నట్లు నౌకరీడాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ వెల్లడించారు.ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాలు, నిర్మాణ, ఇంజినీరింగ్, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల్లో అత్యధికంగా నియామకాలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిపుణులకు డిమాండ్ పెరుగుతుండటం .. ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయనడానికి స్పష్టమైన సూచనగా సురేశ్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 13 శాతం ..
నగరాలవారీగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 15 శాతం, ముంబైలో 14% నియామకాలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నైలలో ఇది 13 శాతంగా ఉంది. బెంగళూరులో ఒక మోస్తరుగా 3 శాతం వృద్ధి నమోదైంది. లో బేస్ కారణంగా కోల్‌కతా మాత్రం అత్యధికంగా 38 శాతం వృద్ధి కనపర్చింది. నెలలవారీగా తమ వెబ్‌సైట్లో నమోదయ్యే జాబ్ లిస్టింగ్స్ ఆధారంగా నౌకరీడాట్‌కామ్ ఈ సూచీ నిర్వహిస్తోంది. ఇందుకోసం 1,000 పాయింట్ల ప్రారంభ స్కోరుతో 2008 జూలైని బేస్ ఇయర్‌గా పరిగణిస్తుంది.
ఆటో, నిర్మాణ, ఎఫ్‌ఎంసీజీల్లో జోరు: రంగాలవారీగా చూస్తే ఆటోమొబైల్, అనుబంధ సంస్థల్లో నియామకాలు వార్షికంగా 31 శాతం పెరిగాయి. నిర్మాణ, ఇంజనీరింగ్‌లో 21 శాతం మేర వృద్ధి చెందాయి. అనుభవం కోణంలో చూస్తే ఫ్రెషర్స్‌కి ఉద్యోగావకాశాలు స్థిరంగా 15 శాతం మేర పెరిగాయి. మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగుల (4–7 ఏళ్ల అనుభవం) నియామకాలు 11 శాతం పెరిగాయి. ఇక సబ్ సీనియర్ (8–12 ఏళ్లు), టాప్ మేనేజ్‌మెంట్ (16 ఏళ్ల పైగా అనుభవం) పోస్టుల్లో హైరింగ్ 5 శాతం మేర వృద్ధి నమోదైంది.
జోరుగా నియామకాలు
Published Thu, Jun 14 2018 12:30 AM | Last Updated on Thu, Jun 14 2018 12:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment