దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంతమంది ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి పని చేసే విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులను తగ్గించింది.
‘మనీకంట్రోల్’ నివేదిక ప్రకారం.. జూనియర్ ఉద్యోగులు ఇప్పటికీ వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్‌ను అందుకున్నారు. అయితే కొంతమంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం బోనస్‌లో 20-40 శాతం కోత విధించింది ఐటీ దిగ్గజం. కొంతమందికైతే బోనస్ అస్సలు లభించలేదు.
“2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూనియర్ గ్రేడ్‌లకు 100% క్యూవీఏ (త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్) చెల్లించాము. ఇతర అన్ని గ్రేడ్‌లకు క్యూవీఏ వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది” అని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా నివేదికలో పేర్కొన్నారు.
టీసీఎస్ కార్యాలయ హాజరు, ఆయా వ్యాపార యూనిట్ల పనితీరు రెండింటి ఆధారంగా బోనస్‌లను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హాజరు విధానాలను స్థిరంగా పాటించకపోవడం క్రమశిక్షణా చర్యకు దారితీస్తుందని టీసీఎస్ గతంలోనే స్పష్టం చేసింది.
కార్యాలయ హాజరు కీలకం
ఉద్యోగుల కార్యాలయ హాజరును కీలక అంశంగా చేరుస్తూ సవరించిన వేరియబుల్ పే విధానాన్ని టీసీఎస్ గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. కొత్త విధానం ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని నిర్దేశిస్తూ నాలుగు హాజరు స్లాబ్‌లను ఏర్పాటు చేసింది. కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ సమయం కార్యాలయాల పనిచేసే ఉద్యోగులకు త్రైమాసికానికి ఎటువంటి వేరియబుల్ వేతనం లభించదు.
ఇదీ చదవండి: ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
60-75 శాతం మధ్య కార్యాలయ హాజరు ఉన్నవారు వేరియబుల్ వేతనంలో 50 శాతం అందుకుంటారు. అయితే 75-85 శాతం కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతానికి అర్హులు. 85 శాతం కంటే ఎక్కువ ఆఫీస్‌కు వచ్చి పనిచేసినవారు మాత్రమే త్రైమాసికానికి పూర్తి వేరియబుల్ చెల్లింపును అందుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment