బెంగళూరు : మంచి కంపెనీ. సంస్థ పేరుకు తగ్గట్లు ప్యాకేజీ. అందుకే ఓ టెక్కీ ఆ ఆ భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కేవలం నాలుగు రౌండ్లు జరిగే ఒక్క ఇంటర్వ్యూ కోసమే ఏడు నెలలు కష్టపడ్డాడు. అలా అని సదరు టెక్కీ.. క్ బెంచ్ స్టూడెంటా అంటే అదీ కాదు. చదువులో టాపర్. ఎంఎన్‌ఎన్‌ఐటీ అలహాబాద్ పూర్వ విద్యార్థి. మరి ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలలు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందని అడిగితే.. సదరు టెక్కీ ఏం చెప్పారంటే?
ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాకు చెందిన చిత్రాంశ ఆనంద్. భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఒరాకిల్‌లో కంపెనీలో రెండేళ్ల పాటు పనిచేశాడు. ఏడాదికి రూ.40 లక్షలు ప్యాకేజీ. మంచి శాలరీ, అనుభవం కోసం మరో కంపెనీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. చివరికి ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో తన అనుభవానికి తగ్గట్లు ఉద్యోగం ఉందని తెలుసుకుని అప్లయి చేశాడు.
అనంతరం తన ఇంటర్వ్యూల కోసం ఏడు నెలల రీసెర్చ్ చేశాడు. రేయింబవళ్లు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాడు. ఇందుకోసం లీట్‌కోడ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. ఇందులో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌ను ఎలా చేధించవచ్చో తెలుసుకోవచ్చు. అలా ఏడు నెలల అనంతరం ఉబెర్ ఇంట్వ్యూకి అటెండ్ అయ్యాడు. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలో బోర్డ్ సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలకు నేను చదవిన చదువుకు.. సంబంధం లేదు. అయినప్పటికీ వాటికి ఆన్సర్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రూ.60లక్షలు ఇచ్చేందుకు ఉబర్ ముందుకు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.
ఈ సందర్భంగా ఆనంద్ ఒరాకిల్,ఉబర్‌లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాడు. ఒరాకిల్‌లో ఐదు రోజులకు మూడురోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి వచ్చింది. ఉబర్‌లో వారానికి రెండు రోజులు మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేస్తా. అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు.
నా కెరియర్ ప్రారంభంలో ఉంది కాబట్టి ఆఫీస్- పర్సనల్ లైఫ్ విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందడం లేదు. నేను అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేయాలి. ఆ తర్వాత లైఫ్ బ్యాలెన్స్ విషయాలపై దృష్టిసారిస్తా అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment