విస్తరిస్తున్న అంతర్జాతీయ ఫ్యాషన్ సెలూన్స్
నెలలో ఒక్క అంతర్జాతీయ హెయిర్ స్టైలిస్ట్‌కైనా ఆహ్వానం ..
సినీతారలకు ధీటుగా ఔత్సాహికులు
స్టైల్‌కి, ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నగరం వృద్ధిచెందుతోంది. ఓ పక్క స్టైల్‌తోపాటు దానికి తగిన విధంగా కేర్ తీసుకుంటున్నారు. ఇటీవల ఓ సినిమాలో జడేసుకోపోయావా... తల్లీ.. ముడేసుకున్నా.. ముద్దుగానే ఉన్నావులే అని రావు రమేష్ అంటాడు. ఆ తరహాలోనే ప్రతిదీ స్టైలే.. ఇక హెయిర్ స్టైల్స్‌లోనూ అనేక రకాలు ఉన్నాయంటే అతిశయోక్తిలేదు.. బజ్‌కట్.. క్రూకట్, ఫాక్స్ హాక్, బాబ్, బౌల్, కోబ్ ఓవర్, ఫ్లాట్ టాప్, ముల్లె, పాంపడోర్ ఇలా పురుషులు ఫాలో అయ్యే హెయిర్ స్టైల్స్‌లో 30కి పైగా రకాలు ఉన్నాయి.. కాగా బిక్సీకట్, స్పైకీ పిక్సీ, ఒన్ లెగ్త్ మిడీ, మోవాక్ షార్ట్ కట్, యాంగిల్డ్ బాబ్, షార్ట్ వేవీ.. వంటి 60 రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. అయితే హెయిర్ స్టైల్స్ ఎప్పటి నుండో ఉన్నప్పటికీ... ప్రొఫెషనల్స్‌తో చేయించుకోవడం తక్కువ.. కానీ ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ హెయిర్ స్టైలిస్ట్‌ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో అంతర్జాతీయ బ్రాండెడ్ సెలూన్స్ విస్తరిస్తున్నాయి. అంతేకాదు.. రెగ్యులర్‌గా నెల్లో కనీసం ఒక్కరైనా హెయిర్ స్టైలిస్ట్స్ సందర్శిస్తున్నారు..
హైదరాబాద్ అందమైన నగరంగానే కాకుండా అందానికీ అత్యంత ప్రధాన్యతనిచ్చే నగరంగా ప్రసిద్ధి చెందింది. నగరం వేదికగా అంతర్జాతీయ ఫ్యాషన్ స్టూడియోలు, ప్రతీ ఏటా పదుల సంఖ్యలో నిర్వహించే గ్లోబల్ ఫ్యాషన్ ఈవెంట్స్ దీనికి నిదర్శనం..అయితే గత కొంత కాలంగా అందానికి అదనపు హంగులద్దే హెయిర్ కట్స్ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా ఫ్యాషన్ ఔత్సాహికులు సినీతాలకు ధీటుగా వినూత్న హెయిర్ స్టైల్స్‌కు మొగ్గుచూపుతున్నారు. దీనిని వేదికగా మార్చుకుని ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లు, ఫేమస్ సెలూన్స్ నగరంలో సేవలు ప్రారంభిస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ సెమినార్లకూ హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. హెయిర్ స్టైలిస్ట్ వ్యాపారం, అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉండటం విశేషం. ఫ్యాషన్ షోలు, ఫ్యాషన్ వీక్‌లతో హెయిర్ స్టైలిస్ట్‌ల అవసరం పెరిగింది. రానున్న కాలంలో ఐటీ, హిస్టారికల్‌తో పాటు ఫ్యాషన్ ఐకాన్‌గానూ నగరం వెలుగొందనుందని పలువురు విశ్లేషకులు అంటున్న మాట..
అవకాశాలు పుష్కలం..
నగరంలో నష్టపోని రంగం ఏదైనా ఉందంటే...అది హెయిర్ స్టైలింగ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ వృత్తిపరంగా మంచి అవకాశాలు పొందుతున్నారు. మన వ్యక్తిత్వాన్ని మరింత అద్భుతంగా చూపించడంలో ఫ్యాషన్ ఔట్‌లుక్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హంగులను అందుకోవడంలో నగరవాసులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ హెయిర్ బ్రాండ్స్, హెయిర్ కట్స్ ఇక్కడి విలాసవంతమైన జీవన విధానంలో భాగమయ్యాయి. సిటీలో బోటోసూ్మత్ ట్రీట్‌మెంట్ వంటి సెమినార్స్ నిర్వహిస్తే వందల మంది స్టైలిస్ట్‌లు పాల్గొని శిక్షణ పొందారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు..ఇక్కడ కురులను అందంగా చూపించుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారో.
–నజీబ్ ఉర్ రెహా్మన్, ప్రముఖ అంతర్జాతీయ హెయిర్ స్టైలిస్ట్.
దక్షిణాది అందాలకు అంతర్జాతీయ క్రేజ్...
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో శిరోజాల అందం, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా గ్లోబల్ ఫ్యాషన్ హంగులకు హైదరాబాద్ వేదికగా మారింది. ఇటాలియన్, జపనీస్ వంటి విభిన్న హెయిర్ స్టైల్స్ ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. మొదటి సారి నగరంలో నిర్వహించిన లుక్ అండ్ లెర్న్ సెమినార్‌లో ఇక్కడి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్‌లకు వినూత్న స్టైల్స్‌పై అవగాహన కల్పించాను. గోద్రెజ్ ప్రొఫెషనల్ బోటోస్మూత్ ట్రీట్‌మెంట్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెషన్స్‌లో ఔత్సాహికుల స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయాను. హెయిర్ కలరింగ్‌కు, స్ట్రటెనింగ్, స్టైల్ కట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. మా దేశం బ్రెజిల్‌లో శిరోజ సౌందర్యం పైన మాత్రమే ఆసక్తి చూపిస్తారు. కానీ ఇక్కడ అధునాతన సాంకేతికత, అందం, ఆరోగ్యం మేళవింపుగా కనిపించింది.
మొదటిసారి 2008లో భారతీయ మహిళల సంస్కృతిలో భాగమైన ఒక హెయిర్ స్టైల్ నన్నెంతగానో ఆకట్టుకుంది. నేను పలు దేశాల్లో శిక్షణ అందిస్తున్న సమయంలో భారతీయ అందం గురించి, ముఖ్యంగా ఇక్కడి పొడవైన జుట్టు గురించి చాలా సార్లు విన్నాను. ఇక్కడ మహిళల సౌందర్యానికి, వినూత్నమైన వ్యక్తిత్వానికి కేశాలంకరణ ప్రతిబింబంలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడి అమ్మాయిలు ట్రెండీగా కనిపిస్తున్నారు. సాధారణంగా ప్రతి రెండు నెలలకోసారి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. అందంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కాబట్టి తక్కువ రసాయనాలు వాడటం శ్రేయస్కరం. బోటోసూ్మత్ ట్రీట్‌మెంట్ అందంతో పాటు ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి.
–వివియన్ బెనెడెట్టో, అంతర్జాతీయ హెయిర్ మాస్ట్రో, బ్రెజిల్. (ఫార్మాల్డిహైడ్–రహిత హెయిర్‌స్టైలిస్ట్)
Comments
Please login to add a commentAdd a comment